- Home
- Life
- Pregnancy & Parenting
- Kids Health: మీ పిల్లలు సన్నగా, బరువు తక్కువగా ఉన్నారా? అయితే ఈ సూపర్ ఫుడ్స్ పెట్టండి!
Kids Health: మీ పిల్లలు సన్నగా, బరువు తక్కువగా ఉన్నారా? అయితే ఈ సూపర్ ఫుడ్స్ పెట్టండి!
మీ పిల్లలు సన్నగా, బలహీనంగా ఉన్నారా? ఎంత తిన్నా బరువు పెరగడం లేదా? అయితే నిపుణులు సూచిస్తున్న ఈ సూపర్ ఫుడ్స్ పెట్టి చూడండి. పిల్లలు చక్కగా బరువు పెరుగుతారు. ఆరోగ్యంగా ఉంటారు. మరి ఆ ఫుడ్స్ ఏంటో.. అవి పిల్లల ఎదుగుదలకు ఏ విధంగా ఉపయోగపడతాయో చూద్దాం.

Kids Health Tips
పిల్లలు ఆరోగ్యంగా ఎదగడానికి, చక్కగా బరువు పెరగడానికి సరైన పోషకాహారం అందించడం అవసరం. ఇంట్లో తయారు చేసే కొన్ని న్యూట్రిషియస్ ఆహారాలు పిల్లలకు అవసరమైన ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్, ఫైబర్, శక్తిని అందిస్తాయి. వీటిని సమతుల్యంగా, మితంగా ఇవ్వడం ద్వారా పిల్లల శారీరక, మానసిక, రోగనిరోధక వ్యవస్థలు బలపడతాయి. మరి పిల్లలు బరువు పెరగడానికి కచ్చితంగా పెట్టాల్సిన ఆ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందామా.
స్వచ్ఛమైన నెయ్యి
పిల్లలకు ఇంట్లో తయారు చేసిన స్వచ్ఛమైన నెయ్యిని మితంగా ఇస్తే చక్కగా బరువు పెరుగుతారు. నెయ్యిలోని విటమిన్ A, D, E, K వంటి కొవ్వులో కరిగే విటమిన్లు.. పిల్లల రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి.
డ్రై ఫ్రూట్స్ పౌడర్
పిల్లలకు డ్రై ఫ్రూట్స్ ని పౌడర్ రూపంలో ఇవ్వడం మంచిది అంటున్నారు నిపుణులు. డ్రై ఫ్రూట్స్ లో ఐరన్, కాల్షియం, ప్రోటీన్, విటమిన్లు, ఫైబర్, హెల్తీ కొవ్వులు ఉంటాయి. ఇవి ఎముకలు బలపడటానికి, కండరాలు పెరగడానికి సహాయపడతాయి.
నువ్వుల లడ్డు, రాగిలడ్డు
రాగిలడ్డు లేదా నువ్వుల లడ్డు పిల్లలకు మంచి పోషకాహారం. రాగిలోని కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్ పిల్లల ఎముకలు బలపడటానికి, రక్తహీనత నివారణ, కండరాల అభివృద్ధికి సహాయపడతాయి.
బ్రౌన్ బ్రెడ్
బ్రౌన్ బ్రెడ్, పీనట్ బటర్ ఇవ్వడం ద్వారా పిల్లలకు ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి. బ్రౌన్ బ్రెడ్ లో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి. పీనట్ బటర్ లోని ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్ కండరాల పెరుగుదలకు సహాయపడతాయి.
అరటి పండు
పిల్లలకు అరటి పండు ఇవ్వడం ద్వారా సహజ శక్తి, పొటాషియం, ఫైబర్, విటమిన్లు అందుతాయి. ఇవి బరువు పెరుగుదలకు సహాయపడతాయి. అంతేకాదు ఈ పండు సులభంగా జీర్ణమవుతుంది.
మిల్క్ షేక్స్
ఇంట్లో తయారు చేసిన మిల్క్ షేక్స్ కూడా పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది. పాల ద్వారా ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు లభిస్తాయి. పండ్ల ద్వారా ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, సహజ షుగర్స్ లభిస్తాయి. ఇవి పిల్లల బరువు పెరుగుదలకు, మెదడు అభివృద్ధికి తోడ్పడుతాయి.
గుడ్లు
గుడ్డులో ప్రోటీన్‌తో పాటు విటమిన్ B12, విటమిన్ D, ఐరన్, మంచి కొవ్వులు, ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి పిల్లల మెదడు అభివృద్ధి, ఎముకల బలోపేతం, కండరాల పెరుగుదలకు సహాయపడతాయి. రోజుకు ఒక గుడ్డు ఇస్తే పిల్లలు ఆరోగ్యంగా బరువు పెరుగుతారు.
చికెన్, ఫిష్
చికెన్, ఫిష్.. ప్రోటీన్ కి మంచి మూలం. ఇవి పిల్లల బరువు పెరుగుదలకు, కండరాల అభివృద్ధికి సహాయపడతాయి. ఫిష్‌లో ఉండే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్లు మెదడు అభివృద్ధికి ఉపయోగపడతాయి.
కిచిడి
పెసరపప్పు కిచిడి పిల్లలకు ఆరోగ్యకరమైన, సులభంగా జీర్ణమయ్యే ఆహారం. పెసరపప్పు ప్రోటీన్, ఐరన్, విటమిన్లు, ఫైబర్ అందిస్తుంది. ఇవి కండరాల పెరుగుదలకు, రోగనిరోధక శక్తి పెరగడానికి, జీర్ణక్రియ మెరుగుపడటానికి సహాయపడతాయి.

