ఇంట్లో సానుకూలత, లక్ష్మీ కటాక్షం కావాలా? ఇల్లు తుడిచేటప్పుడు ఆ నీటిలో ఈ 5 వస్తువులు వేసి తుడిస్తే ఇల్లు శుభ్రంగా, ప్రతికూల శక్తులు దూరంగా ఉంటాయి.
రోజూ ఉదయం చీపురు, మాప్ తో ఇంటిని శుభ్రం చేసుకుంటాం. చాలామంది ఇల్లు తుడవడానికి మాప్ చేసే సమయంలో నీళ్ళు మాత్రమే వాడతారు లేదా సువాసన కోసం ఫినాయిల్ వాడతారు. కానీ మీ వంటింట్లోనే కొన్ని వస్తువులు ఉంటాయి, వాటిని ఇల్లు తుడిచే నీటిలో వేసి తుడిస్తే ఇల్లు శుభ్రంగా ఉండటమే కాకుండా, సానుకూలత, లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతాయి. ప్రతికూల శక్తులు దూరమవుతాయి. మరి ఆ ఐదు వస్తువులేంటో చూద్దాం.
ఇళ్లు తుడిచే నీళ్ళలో వేయాల్సిన 5 వస్తువులు
ఉప్పు లేదా సైంధవ లవణం
ఇల్లు తుడిచే నీళ్ళలో ఉప్పు లేదా సైంధవ లవణం వేస్తే వాస్తు ప్రకారం ప్రతికూల శక్తులు దూరమవుతాయి. బాక్టీరియా, ఫంగస్ కూడా తగ్గుతాయి. ఒక బకెట్ నీళ్ళలో ఒక చెంచా సైంధవ లవణం వేయొచ్చు. ముఖ్యంగా గురువారం ఉప్పు నీళ్ళతో పోచ వేయాలి.
నిమ్మరసం లేదా తొక్కలు
ఇంటిని డీప్ క్లీన్ చేయాలంటే, జిడ్డు తొలగించాలంటే ఒక బకెట్ నీళ్ళలో ఒక చెంచా నిమ్మరసం లేదా తొక్కలు వేయొచ్చు. ఇది సహజ క్లీనర్, డీయోడరైజర్ లా పనిచేస్తుంది. ఇంటికి తాజాదనం, సువాసన ఇస్తుంది.
వైట్ వెనిగర్
వైట్ వెనిగర్ లో యాంటీసెప్టిక్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఒక బకెట్ నీళ్ళలో 2-3 చెంచాలు వైట్ వెనిగర్ వేసి ఇంటి మూలలు శుభ్రం చేయొచ్చు. జిడ్డు, మురికి తేలిగ్గా పోతాయి.
గులాబీ నీళ్ళు లేదా ఎసెన్షియల్ ఆయిల్
ఇంటికి సువాసన కావాలంటే అర బకెట్ ఇల్లు తుడిచే నీళ్ళలో 10-15 చుక్కలు లావెండర్, రోజ్మేరీ లేదా లెమన్ గ్రాస్ వంటి ఎసెన్షియల్ ఆయిల్ వేయొచ్చు. లేదా 2 చెంచాలు గులాబీ నీళ్ళు వేసి మాప్ వేయొచ్చు. ఇది బాక్టీరియాను చంపి, తాజాదనం ఇస్తుంది.
వేపాకు నీళ్ళు
ఇంట్లో దోమలు, చీమలు వంటి కీటకాలు ఎక్కువగా ఉంటే వేపాకు ఉడకబెట్టి చల్లార్చిన నీళ్ళతో ఇంటిని తుడవాలి. దీనిలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాల వల్ల కీటకాలు దూరమవుతాయి.
గమనిక
ఇల్లు తుడిచేటప్పుడు అన్ని వస్తువులు ఒకేసారి కలపకూడదు. ఒకటి లేదా రెండు వస్తువులు మాత్రమే వాడాలి. మార్బుల్ ఫ్లోరింగ్ కి వెనిగర్, నిమ్మరసం తక్కువగా వాడాలి. ఎందుకంటే అవి ఆమ్ల గుణాలు కలిగి ఉండటం వల్ల మార్బుల్ పై పసుపు మరకలు పడే అవకాశం ఉంది. వారంలో 2-3 సార్లు మాత్రమే ఈ వస్తువులతో ఇల్లు తుడుచుకోవాలి.