Asianet News TeluguAsianet News Telugu

బ్యాంకు ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల.. వెయ్యికి పైగా ఖాళీలు.. వెంటనే ఇలా అప్లయ్ చేసుకోండి..

IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకి భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తోంది. భారతదేశం అంతటా రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి 1402 ఖాళీలు ఉన్నాయి . 

IBPS SO 2023 Notification (Out): Check Exam Date, Vacancy, Eligibility-sak
Author
First Published Aug 1, 2023, 5:57 PM IST

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ అండ్ సెలక్షన్ IBPS SO 2023 నోటిఫికేషన్‌ను 01/08/2023న విడుదల చేసింది. IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకి భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తోంది. భారతదేశం అంతటా రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి 1402 ఖాళీలు ఉన్నాయి . కాబట్టి ఆసక్తి ఇంకా  అర్హత గల అభ్యర్థులు అర్హత ప్రమాణాల ద్వారా  01/08/2023 నుండి 21/08/2023 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగంలో పని చేయాలనుకునే అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం. పరీక్షను ప్రిలిమ్స్, మెయిన్స్ ఇంకా ఇంటర్వ్యూ అనే మూడు దశల్లో నిర్వహిస్తారు. 

పోస్ట్ పేరు: స్పెషలిస్ట్ ఆఫీసర్

నోటిఫికేషన్ తేదీ: 01/08/2023

ఖాళీ పోస్టుల  సంఖ్య: 1402

జబ లొకేషన్ :  భారతదేశం అంతటా

వివిధ విభాగాల్లో IBPS SO రిక్రూట్‌మెంట్:

ఐటీ ఆఫీసర్ 

అగ్రికల్చర్  ఫీల్డ్  ఆఫీసర్ 

రాజ్ భాష అధికారి

లా అధికారి

HR/పర్సనల్ ఆఫీసర్

మార్కెటింగ్ అధికారి

IBPS SO నోటిఫికేషన్ 2023 ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 01/08/2023

ఆన్‌లైన్ దరఖాస్తును  చివరి తేదీ: 21/08/2023

దరఖాస్తు ఫీజు /ఇంటిమేషన్ ఛార్జీలు చెల్లించడానికి చివరి తేదీ: 21/08/2023

ఆన్‌లైన్ ప్రిలిమ్స్ పరీక్ష కోసం కాల్ లెటర్‌  డౌన్‌లోడ్ : డిసెంబర్ 2023

ఆన్‌లైన్ ప్రిలిమ్స్ పరీక్ష    : 30/12/2023/ నుండి 31/12/2023

ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాల ప్రకటన    జనవరి 2024

ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ డౌన్‌లోడ్:     జనవరి 2024

మెయిన్స్ పరీక్ష : 28/01/2024

మెయిన్ పరీక్ష ఫలితాల ప్రకటన:  ఫిబ్రవరి 2024

ఇంటర్వ్యూ కాల్ లెటర్‌ని డౌన్‌లోడ్ : ఫిబ్రవరి 2024

ఇంటర్వ్యూ తేదీ : ఫిబ్రవరి/మార్చి 2024

తాత్కాలిక కేటాయింపు:  ఏప్రిల్ 2024

IBPS SO రిక్రూట్‌మెంట్ 2023 పోస్టుల వివరాలు:
2023-24 సంవత్సరానికి IBPS SO ఖాళీలు వివిధ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల నియామకం కోసం ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ అండ్ సెలక్షన్ 1402 ఖాళీలను ప్రకటించింది. IBPS SO 2023 ఖాళీ కేటాయింపు పోస్ట్, క్యాటగిరి, రాష్ట్రాల వారీగా వివరంగా అందించబడింది. 

ఖాళీల వివరాలు 

S. No    పోస్ట్ పేరు                          ఖాళీలు 
1    అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్-I)    500
2    మార్కెటింగ్ ఆఫీసర్ (స్కేల్-I)        700
3    ఐటీ ఆఫీసర్ (స్కేల్-I)                     120
4    లా ఆఫీసర్ (స్కేల్-I)                       10
5    HR/పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-I)       31
6    రాజభాష అధికారి (స్కేల్-I)                 41
7    మొత్తం                                             1402

IBPS SO జీతం:
ప్రభుత్వ నిబంధనల ప్రకారం IBPS SO జీతం వర్తిస్తుంది.

వయో పరిమితి:
అభ్యర్థులు తప్పనిసరిగా ఆగస్టు 1, 2023 నాటికి కింది వయోపరిమితిలో ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా 02/08/1993 కంటే ముందుగా జన్మించి ఉండకూడదు. 01/08/2003 కంటే (రెండు తేదీలు కలుపుకొని) జన్మించి ఉండాలి.  
 
 వయస్సు సడలింపు:
భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు  ఉంటుంది.  

ఎంపిక ప్రక్రియ:
ప్రిలిమ్స్ పరీక్ష
మెయిన్స్ పరీక్ష
ఇంటర్వ్యూ

గమనిక:

పరీక్ష  పేపర్ రెండు భాషల్లో ఉంటుంది, అంటే ఇంగ్లీష్ అండ్ హిందీ.
ప్రశ్నలన్నీ ఐదు ఆప్షన్లతో ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి.
ప్రతి తప్పు సమాధానానికి, మొత్తం మార్కుల నుండి 0.25 మార్కులు కట్ అవుతాయి.
కానీ సమాధానం లేని ప్రశ్నలకు ఎలాంటి నెగటివ్ మార్కులు ఉండవు.
సెక్షనల్ అలాగే మొత్తం కట్-ఆఫ్ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఒకసారి చెల్లించిన ఫీజు/ఇంటిమేషన్ ఛార్జీలు వాపసు చేయబడవు.  

ఫీజు 
SC / ST / PWD అభ్యర్థులు: రూ . 175/-
ఇతరులు    రూ .850/-

IBPSలో  పాల్గొనే సంస్థలు:
BOB - బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్యాంక్ ఆఫ్ ఇండియా
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
కెనరా బ్యాంక్
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఇండియన్ బ్యాంక్
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
UCO బ్యాంక్

Follow Us:
Download App:
  • android
  • ios