World Census: 9 సెకన్లకు ఒకరి జననం.. ప్రపంచ జనాభా ఎంతకు పెరిగిందో తెలుసా?
World Census: ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుతున్నదని అమెరికా సెన్సస్ బ్యూరో వరల్డ్ సెన్సస్ నివేదికలో వెల్లడించింది. కరోనా వైరస్ కొనసాగిన గతేడాది కూడా జనాభా పెరిగిందని పేర్కొంది.
World Census: యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి దాదాపు రెండు సంవత్సరాలుగా తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నది. అనేక మ్యూటేషన్లకు లోనవుతూ మానవ మనుగడకు సవాలు విసురుతున్నది. లక్షలాది మందని బలిగొంటూ.. కోట్లాది మందిని అనారోగ్యానికి గురిచేస్తున్నది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ.. ఈ సమయంలోనూ ప్రపంచ జనాభా గణనీయంగా పెరుగుదలను నమోదుచేసింది. ప్రపంచ వ్యాప్తంగా జనాభా పై అంచనాలను అమెరికా World Census నివేదిక వెల్లడించింది. అమెరికా సెన్సస్ బ్యూరో వెల్లడించిన World Census నివేదిక నివేదికలో ఆసక్తికరమైన వివరాలను ప్రస్తావించింది. శనివారానికి ప్రపంచ జనాభా 786 కోట్ల మార్క్‌ను దాటేసిందని ఈ నివేదిక అంచనా వేసింది. కరోనా వైరస్ విజృంభణ కొనసాగిన 2021లో కూడా ప్రపంచ జనాభా భారీగా పెరిగిందనిపేర్కొంది.
Also Read: Vaishno Devi Stampede: వైష్ణోదేవి ఆలయ విషాదానికి ఆదే కారణమా?.. అసలు ఏం జరిగింది?
2021లో కరోనా మహమ్మారి చాలా దేశాల్లో కల్లోలం రేపింది. అన్ని దేశాలు సంక్షోభంలోకి జారుకున్నాయి. అయితే, ఈ సమయంలోనూ ప్రపంచ జనాభా గణనీయంగా పెరిగింది. 2021లోనే దాదాపు 7.4 కోట్ల జనాభా పెరిగిందని అమెరికా సెన్సస్ బ్యూరో ప్రకటించిన వరల్డ్ సెన్సన్ నివేదిక పేర్కొంది. అలాగే, అమెరికా జనాభా 33,24,03,650గా ఉంటుందని పేర్కొంది. 2021లో అమెరికా జనాభా 7,06,899 (0.21%) పెరుగుదల నమోదైనట్టు తెలిపింది. అమెరికా జాతీయ జనాభా దినోత్సవం ప్రకారం ఆ దేశ జనాభా 0.29 శాతం అంటే 9,54,369 మంది పెరిగారని అమెరికా తన నివేదికలో పేర్కొంది.
Also Read: coronavirus: భారత్ పై కరోనా పంజా.. 22వేలకు పైగా కొత్త కేసులు.. ఒమిక్రాన్ ఆందోళన !
అలాగే, కొత్త ఏడాది 2022కు సంబంధించిన జనాభా అంచనాలను కూడా అమెరికా వరల్డ్ సెన్సస్ నివేదిక వెల్లడించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి... 2022 జనవరిలో ప్రతి 9 సెకన్లకు కొత్త శిశువు జన్మించనున్నదని, ప్రతి 11 సెకండ్లకు ఒకరు మరణిస్తారని అమెరికా సెన్సస్ బ్యూరో అంచనా వేసింది. కొత్త సంవత్సరం నుండి, US జననాలు, మైనస్ మరణాలు, అలాగే నికర అంతర్జాతీయ వలసల నుండి ప్రతి 40 సెకన్లకు ఒక వ్యక్తి పెరుగుతుందని అంచనా వేయబడింది. దీనికి తోడు వివిధ దేశాల నుంచి వలస రావడం ద్వారా ప్రతి 130 సెకండ్లకు అమెరికా జనాభాలో మరొకరు జత కలుస్తారని పేర్కొంది. అయితే, ప్రపంచ వ్యాప్తంగా సంభవించే జనన మరణాలు, వలసలతో అమెరికా జనాభాలో ప్రతి 40 సెకన్లకు ఒకరు చేరుతున్నారని వివరించింది. 2022 జనవరి 1 నాటికి ప్రపంచ జనాభా 786,88,72,451గా ఉంటుందని అంచనా వేసింది. 2021 జనవరి 1 నుంచి 7,42,35,487 జనాభా పెరిగినట్టు అమెరికా వరల్డ్ సెన్సస్ నివేదిక పేర్కొంది.
Also Read: R Value: దేశంలో కరోనా వైరస్ ఆర్-ఫ్యాక్టర్ ఆందోళన !
UN డేటా ప్రకారం.. ప్రపంచ జనాభా 2100 వరకు పెరుగుతూనే ఉంటుంది, అయితే పెరుగుదల తక్కువ ప్రదేశాల్లోనే.. తక్కువగా కేంద్రీకృతమై ఉంటుంది. రాబోయే మూడు దశాబ్దాలలో జనాభా పెరుగుదలలో సగానికి పైగా కేవలం ఎనిమిది దేశాల్లోనే కేంద్రీకృతమై ఉంటుందని అంచనా.. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, ఇండోనేషియా, నైజీరియా, పాకిస్థాన్, టాంజానియా, యునైటెడ్ స్టేట్స్ ఈ జాబితాలో ఉన్నాయి.
Also Read: కర్నాటక పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో హస్తం హవా.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ !