Asianet News TeluguAsianet News Telugu

క‌ర్నాట‌క ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో హ‌స్తం హ‌వా.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ !

local body polls: క‌ర్నాట‌క ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో హ‌స్తం హ‌వా కొన‌సాగింది. అత్య‌ధిక స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవ‌త‌రించింది. అధికార బీజేపీ రెండో స్థానంతో స‌రిపెట్టుకుంది. ముఖ్యమంత్రి ఇలాకాలోనూ బీజేపీ  ఓడిపోవడం గమనార్హం.
 

Karnataka urban local body polls: Congress emerges single largest party winning 498 of 1,184 seats
Author
Hyderabad, First Published Dec 31, 2021, 4:55 AM IST

local body polls: క‌ర్నాట‌క ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో హ‌స్తం హ‌వా కొన‌సాగింది. అత్య‌ధిక స్థానాలు గెలుచుకుని అతిపెద్ద సింగిల్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ అవ‌త‌రించింది. అధికార బీజేపీ రెండో స్థానంతో స‌రిపెట్టుకుంది.  క‌ర్నాట‌క‌లోని 5 కార్పొరేషన్లు, 19 మునిసిపాలిటీలు, 34 పట్టణ పంచాయతీల్లోని 1185 డివిజన్లు, వార్డులకు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఈ ఎన్నిక‌ల్లో అధికార బీజేపీకి గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ 501 వార్డుల్లో విజయకేతనం ఎగురవేయగా.. బీజేపీ 431 వార్డుల్లో మాత్రమే గెలుపొందింది. అలాగే,  జేడీఎస్ 45, ఇతరులు 204 సీట్లు గెలుచుకున్నారు. మొత్తం 195 మంది స్వతంత్రులు కూడా ఎన్నికలలో విజయం సాధించారు. ఆప్, జనతా పార్టీ ఒక్కో సీటును గెలుచుకోగా, ఏఐఎంఐఎం, ఎస్‌డీపీఐ వరుసగా రెండు, ఆరు స్థానాల్లో విజయం సాధించాయి. డిసెంబ‌ర్ 27న ఈ ఎన్నిక‌లు జ‌రిగాయి. 2022లో ఎన్నిక‌లు ప‌లు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గున్నాయి. ఈ నేప‌థ్యంలో వెలువ‌డిన ఈ ఫ‌లితాలు కాంగ్రెస్ కు బూస్టులా ప‌నిచేస్తాయ‌ని చెప్ప‌డంలో సందేహం లేదు. దీనికి తోడు 2023లో క‌ర్నాట‌క‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గున్నాయి.  కాబ‌ట్టి ఈ ఫ‌లితాలు రాష్ట్ర కాంగ్రెస్ లో జోష్ నింపుతున్నాయి. 

Also Read: rahul gandhi: విదేశీ ప‌ర్య‌ట‌న‌లో రాహుల్ గాంధీ.. మోగా ర్యాలీకి బ్రేక్‌ .. పంజాబ్ కాంగ్రెస్‌లో క‌ల‌వ‌రం!

అలాగే, 20 పట్టణ స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ మెజారిటీ సాధించింది. అదే సమయంలో బీజేపీ 15 గెలుచుకుంది. జెడి(ఎస్) ఒక యూెఎల్ బీని గెలుచుకుంది. ఏ పార్టీ మెజారిటీ సాధించలేకపోవడంతో మిగిలిన ULBలు మిశ్రమ ఫలితాలను అందించాయి. మొత్తం ఫ‌లితాలను పరిశీలిస్తే తమ పార్టీ మంచి పనితీరు కనబరిచిందని క‌ర్నాట‌క ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. కానీ మైనారిటీల జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఎదురుదెబ్బ‌లు త‌గిలాయ‌ని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో మెరుగైన ఫ‌లితాలు రాబ‌ట్టాల్సిన ప‌రిస్థితులు ఉన్నప్పటికీ గతసారి కంటే మెరుగైన ప్రదర్శన చేశామని ఆయన అన్నారు. "ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రిగ‌న ప్రాంతాల్లో మైనారిటీ కమ్యూనిటీ ఓటర్లు ఎక్కువగా ఉన్నందున, మాకు మంచి ఫలితాలు రాలేదు, కానీ ఈసారి ప్రయత్నాల వల్ల, గడగ్ మరియు ఇతర ప్రాంతాలలో, మేము విజయం సాధించాము" అని చెప్పారు. ఇదిలావుండ‌గా, ముఖ్య‌మంత్రి బొమ్మై మంత్రం ప‌నిచేయ‌లేదు. 

Also Read: Omicron: మ‌హారాష్ట్రలో ఒక్క‌రోజే 198 ఒమిక్రాన్ కేసులు.. రాష్ట్ర మంత్రిని వదలని మహమ్మారి !

యడియూరప్ప రాజకీయ వారసుడిగా లింగాయత్‌ వర్గానికే చెందిన బసవరాజ్‌ బొమ్మైను బీజేపీ  తెరపైకి తీసుకువ‌చ్చినా..  క‌మ‌ళం పార్టీని విజయపథంలో నడపలేకపోతున్నారన్న ఆరోపణలొస్తున్నాయి.  ఇక బొమ్మై నియోజ‌క‌వ‌ర్గంలోనూ బీజేపీ ఓడిపోవ‌డం గ‌మ‌నార్హం. క‌ర్నాట‌క ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్ మాట్లాడుతూ.. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు స్థానిక ఎన్నికల్లో విజయాలు దిక్సూచి కానున్నాయని అన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని గ‌ద్దె దించేందుకు క‌ర్నాట‌క ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్నార‌ని కాంగ్రెస్ మ‌రో సీనియ‌ర్ నేత,  రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి రణదీప్‌ సుర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ అన్నారు. మతమార్పిడులకు వ్యతిరేకంగా చేసిన చట్టాలు రాష్ట్ర ప్రజలను నమ్మించలేవ ని స్థానిక ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయన్నారు. 

Also Read: Omicron: మ‌ళ్లీ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ‌.. ఒక్క‌వారంలోనే 50 ల‌క్ష‌ల‌కు పైగా కొత్త కేసులు

Follow Us:
Download App:
  • android
  • ios