MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • International
  • Benjamin Netanyahu : ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు ఏం చదువుకున్నారో తెలుసా?

Benjamin Netanyahu : ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహు ఏం చదువుకున్నారో తెలుసా?

మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేరు బాగా వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన చదువు, రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఏం చేసేవారనే విషయాలు ఆసక్తి రేపుతున్నాయి. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 17 2026, 03:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇజ్రాయెల్ పీఎంగా నెతన్యాహు రికార్డు...
Image Credit : Getty

ఇజ్రాయెల్ పీఎంగా నెతన్యాహు రికార్డు...

ఇజ్రాయెల్ రాజకీయాల్లో ఎక్కువ కాలం చక్రం తిప్పిన నేత ఎవరైనా ఉన్నారంటే అది బెంజమిన్ నెతన్యాహునే. ఆయన్ను ప్రపంచవ్యాప్తంగా 'బీబీ' అనే ముద్దుపేరుతో కూడా పిలుస్తారు. నెతన్యాహు ఇజ్రాయెల్‌లో అత్యధిక కాలం పనిచేసిన ప్రధానిగా గుర్తింపు పొందారు. అంతేకాదు నెతన్యాహు రాజకీయ పునరాగమనం కూడా చాలా ప్రత్యేకమైనది.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నెతన్యాహు పొలిటికల్ కెరీర్
Image Credit : Getty

నెతన్యాహు పొలిటికల్ కెరీర్

నెతన్యాహు మొదటిసారి 1996 జూన్‌లో ఇజ్రాయెల్ ప్రధాని అయ్యారు. ఈ దేశ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా రికార్డు సృష్టించారు. ఆయన మొదటి పదవీకాలం 1999 వరకు కొనసాగింది. 

మధ్యలో అధికారాన్ని కోల్పోయిన నెతన్యాహు తిరిగి 2009లో మళ్లీ పాలనా పగ్గాలు చేపట్టాడు. 2021 జూన్ వరకు దేశ ప్రధానిగా ఉన్నారు. మధ్యలో చిన్న విరామం వచ్చినా డిసెంబర్ 2022లో మళ్లీ పీఎం కుర్చీని దక్కించుకున్నారు… ప్రస్తుతం ఈ పదవిలోనే కొనసాగుతున్నారు. ఇలా ఇజ్రాయెల్‌లో సుదీర్ఘకాలం ప్రధానిగా పనిచేసిన రికార్డు సృష్టించారు నెతన్యాహు.

35
స్పెషల్ ఫోర్స్‌లో పనిచేసిన నెతన్యాహు
Image Credit : Getty

స్పెషల్ ఫోర్స్‌లో పనిచేసిన నెతన్యాహు

1948లో ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత జన్మించిన తొలి ప్రధానులలో నెతన్యాహు ఒకరు… 1949 లో రాజధాని టెల్ అవీన్ లో జన్మించారు.  అందుకే ఆయన ఆలోచనలు, రాజకీయాల్లో కొత్త తరం దృక్పథం కనిపిస్తుంది.

రాజకీయాల్లోకి రాకముందు నెతన్యాహు ఇజ్రాయెల్ అత్యంత ప్రమాదకరమైన స్పెషల్ ఫోర్స్ యూనిట్ 'సయెరెట్ మత్కల్' (Sayeret Matkal)లో పనిచేశారు. అత్యంత క్లిష్టమైన మిషన్లకు ఈ యూనిట్ పెట్టింది పేరు. ఇది ఆయన బలమైన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది.

45
అమెరికాలో చదువు.. పెద్ద కంపెనీలో ఉద్యోగం
Image Credit : Getty

అమెరికాలో చదువు.. పెద్ద కంపెనీలో ఉద్యోగం

నెతన్యాహు అమెరికాలోని ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)లో చదువుకున్నారు. అక్కడ ఆర్కిటెక్చర్, మేనేజ్‌మెంట్‌లో డిగ్రీలు పొందారు. ఆ తర్వాత బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ వంటి పెద్ద అంతర్జాతీయ కంపెనీలో కూడా పనిచేశారు. 

నెతన్యాహు తన అనర్గళమైన ఇంగ్లీష్, పదునైన ప్రసంగాలకు ప్రసిద్ధి. ఐక్యరాజ్యసమితిలో చాలాసార్లు ఇజ్రాయెల్ వాదనను ఆయన బలంగా వినిపించారు. ఆయన ప్రసంగాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతాయి.

55
టెల్ అవీవ్‌లో మొదలైన ప్రస్థానం..
Image Credit : Getty

టెల్ అవీవ్‌లో మొదలైన ప్రస్థానం..

నెతన్యాహు ఇజ్రాయెల్‌లోని ప్రధాన నగరం టెల్ అవీవ్‌లో జన్మించారు. ఇక్కడి నుంచే ఆయన ప్రస్థానం మొదలై, దేశ రాజకీయాల్లో అత్యున్నత శిఖరాలకు చేర్చింది. ఆయన అన్న యోనాతన్ నెతన్యాహు 1976లో జరిగిన చరిత్రాత్మక సైనిక ఆపరేషన్ 'ఆపరేషన్ ఎంటెబ్బే'లో మరణించారు. ఈ ఘటన నెతన్యాహు జీవితం, ఆలోచనలపై తీవ్ర ప్రభావం చూపింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రపంచం
యుద్ధం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Recommended image2
అమెరికాలో ఇళ్ల బయట జనం ఎందుకు కనిపించరు.? ఇంతకీ వాళ్లేం చేస్తుంటారు.?
Recommended image3
Trump Tariffs: రష్యా ఆయిల్ కొంటే భారత్‌పై 100% టారిఫ్? ట్రంప్ చేతికి డెడ్లీ వెపన్ ఇచ్చిన అమెరికా పార్లమెంట్
Related Stories
Recommended image1
Iran Israel War: ఇజ్రాయెల్ ప్ర‌ధాని బ‌తికే ఉన్నారా.? అస‌లేం జ‌రుగుతోంది.?
Recommended image2
Iran Israel War : దుబాయ్ లో 19 మంది భారతీయులు అరెస్ట్.. అసలేం జరుగుతోంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved