Asianet News TeluguAsianet News Telugu

coronavirus: భారత్ పై కరోనా పంజా.. 22వేలకు పైగా కొత్త కేసులు.. ఒమిక్రాన్ ఆందోళన !

coronavirus: భార‌త్ లో క‌రోనా వైర‌స్ క‌ల్లోలం రేపుతున్న‌ది. గ‌త కొంత కాలంగా త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా వైర‌స్ కేసులు... గత వారం నుంచి క్ర‌మంగా పెరుగుతున్నాయి. గ‌త 24 గంటల్లో 22 వేల‌కు పైగా కొత్త‌కేసులు, 200 ల‌కు పైగా మ‌రణాలు సంభ‌వించాయి. 
 

India Sees Massive Jump in Daily Tally, Reports Over 22k Cases
Author
Hyderabad, First Published Jan 1, 2022, 10:51 AM IST

coronavirus: ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. ప‌లు దేశాల్లో ప‌రిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఇటీవ‌ల ద‌క్షిణాఫ్రికాలో వెలుగుచూసిన క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పంజా కార‌ణంగానే కొత్త కేసులు పెరుగుతున్నాయ‌ని నిపుణులు పేర్కొంటున్నారు. భార‌త్ లోనూ క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్నాయి. దీనికి తోడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సైతం శరవేగంగా విస్తరిస్తూ వణుకు పుట్టిస్తోంది. ఇటీవ‌ల కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. గత రెండు మూడు రోజులుగా విపరీతంగా పెరుగుతున్నాయి. శ‌నివారం ఉద‌యం కేంద్ర ఆరోగ్య‌,  కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్రకారం.. గ‌త  24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య ఏకంగా 22వేలు దాటగా.. 400 మందికి పైగా మరణించడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇక ఒమిక్రాన్‌ కేసులు సైతం రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. 

Also Read: R Value: దేశంలో క‌రోనా వైర‌స్ ఆర్‌-ఫ్యాక్టర్ ఆందోళ‌న !

 గ‌త 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11.10లక్షల మందికి క‌రోనా వైర‌స్  వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో  22,775 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా వ‌చ్చింది. పాజిటివిటీ రేటు సైతం 2శాతం దాటడం గమనార్హం. ఇదే స‌మ‌యంలో క‌రోనా వైర‌స్ నుంచి 8949 మంది బ‌య‌ట‌ప‌డ్డారు. దీంతో వైర‌స్ నుంచి మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3.42కోట్ల కు చేరుకుంది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా సంభ‌విస్తున్న మ‌ర‌ణాలు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. నిన్న ఒక్క రోజే 406 మంది మహమ్మారితో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా ఇప్పటివరకు 4.81లక్షల మందిని కోవిడ్‌-19బలితీసుకుంది. మరోవైపు కొత్త కేసులు పెరుగుతుండటంతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య మళ్లీ లక్షకు పైగా పెరిగాయి. దీంతో స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. దేశంలో ప్ర‌స్తుతం 1,04,781 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా కూడా వివిధ ఆస్పత్రులు, హోఐసోలేష‌న్, కోవిడ్‌-19 కేర్ సెంట‌ర్ల‌లో ఉన్నారు. భార‌త్ లో క్రియాశీల రేటు రేటు 0.30శాతానికి పెరిగింది.

Also Read: క‌ర్నాట‌క ప‌ట్ట‌ణ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో హ‌స్తం హ‌వా.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ ! 

అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్ గా భావిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకూ గ‌ణ‌నీయంగా పెరుగుతుండ‌టం తీవ్ర ఆందోళ‌న‌కు గురిచేస్తున్న‌ది. ఇప్ప‌టికే ఈ వేరియంట్ కేసులు దేశంలోని 23 రాష్ట్రాలు వెలుగుచూశాయి. మొత్తంగా ఈ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు దేశంలో  1431కు పెరిగాయి. అంత‌కు ముందు రోజుతో  పోలిస్తే దాదాపు 200 కేసులు పెరగడం గమనార్హం. అత్యధికంగా మహారాష్ట్రలో 454 మందికి కొత్త వేరియంట్ సోకింది. ఆ త‌ర్వాతి స్థానంలో ఉన్న దేశ రాజ‌ధాని  ఢిల్లీలో 351 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఇక తమిళనాడు, గుజరాత్‌, కేరళలోనూ కొత్త వేరియంట్‌ కేసుల సంఖ్య సెంచ‌రీ దాటింది. దీంతో కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు సైతం ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటివరకు మొత్తం 23 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్‌ విస్తరించిందని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. ఇదే స‌మ‌యంలో ఒమిక్రాన్ వేరియంట్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య సైతం పెరుగుతుండ‌టం ఊర‌ట క‌లిగించే అంశం.  ఇప్పటివరకు 488 మంది కొత్త వేరియంట్‌ నుంచి కోలుకున్నారు.

Also Read: rahul gandhi: విదేశీ ప‌ర్య‌ట‌న‌లో రాహుల్ గాంధీ.. మోగా ర్యాలీకి బ్రేక్‌ .. పంజాబ్ కాంగ్రెస్‌లో క‌ల‌వ‌రం!

క‌రోనా వైర‌స్ విజృంభ‌ణనేప‌థ్యంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్ర‌భుత్వాలు వేగ‌వంతం చేస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు 1.45కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.  శుక్రవారం 58.11లక్షల మందికి టీకాలు వేశారు. ఇక జనవరి 3 నుంచి 15-18 సంవ‌త్స‌రాల వారికి కూడా టీకాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.  క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు పేర్కొంది. అలాగే, త్వ‌ర‌లోనే బూస్ట‌ర్ డోసులు సైతం అందిస్తామ‌ని వెల్ల‌డించింది. 

Also Read: Omicron: మ‌హారాష్ట్రలో ఒక్క‌రోజే 198 ఒమిక్రాన్ కేసులు.. రాష్ట్ర మంత్రిని వదలని మహమ్మారి !

 

Follow Us:
Download App:
  • android
  • ios