Asianet News TeluguAsianet News Telugu

Omicron: ఒక ఈవెంట్ కంటే జీవితం ఎంతో ముఖ్యం.. ఒమిక్రాన్ నేప‌థ్యంలో WHO వ్యాఖ్యలు

Omicron: ద‌క్షిణాఫ్రికాలో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భ‌యాందోళ‌నలు పెరుగుతున్నాయి. ఈ ర‌కం కేసులు సైతం ప‌లు దేశాల్లో రికార్డు స్థాయిలో న‌మోద‌వుతున్నాయి. మ‌రో వైపు కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లకు ప్ర‌జ‌లు సిద్ధ‌మ‌తున్నారు. ఈ నేప‌థ్యంలోనే "ఒక ఈవెంట్ కంటే జీవితం ఎంతో ముఖ్య‌మైన‌దంటూ"  World Health Organization (డ‌బ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. 
 

WHO urges cancelling some holiday events over Omicron fears
Author
Hyderabad, First Published Dec 21, 2021, 11:58 AM IST

Omicron:  గ‌త నెల‌లో ద‌క్షిణాఫ్రికాలో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాలా దేశాల్లో పంజా విసురుతోంది. ఈ  వేరియంట్‌ను ఇప్ప‌టివ‌ర‌కు వెలుగుచూసిన వాటికంటే అత్యంత ప్ర‌మాక‌ర‌మైన‌దిగా నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగానే ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అత్యంత వేగంగా ఉంది. ద‌క్షిణాఫ్రికా, బ్రిట‌న్‌, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లో ఒమిక్రాన్ విజృంభ‌ణ కొన‌సాగుతోంది. దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా భ‌యాందోళ‌న‌లు అధిక‌మ‌వుతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితులు ఉన్నప్ప‌టికీ.. కొత్త సంవ‌త్సర వేడుక‌ల‌కు ప్ర‌జ‌లు సిద్ధ‌మ‌వుతున్నారు. పెద్ద పెద్ద ఈవెంట్లు జ‌ర‌ప‌డానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ  (World Health Organization) కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.  ఒక ఈవెంట్ కంటే జీవితం ముఖ్యమైన‌ద‌ని పేర్కొంది. కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచమంతా వ్యాపిస్తుండడంతో, అది మరింత వ్యాపించకుండా ప్రజలు సెలవు దినాల్లో కొన్ని వేడుకలను రద్దు చేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. World Health Organization చీఫ్ డాక్ట‌ర్ టెడ్రోస్ అధ‌నోమ్ గెబ్రియేస‌స్ మాట్లాడుతూ.. "జీవితం కోల్పోవడం కంటే, ఒక ఈవెంట్‌ను రద్దు చేసుకోవడం మంచిది. కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో వాటిని రద్దు చేయడం లేక వాయిదా వేసుకోవడం మంచిది" అని అన్నారు. 

Also Read: హైదరాబాద్‌లో దారుణం..సెల్‌ఫోన్ కోసం స్నేహితుడి హత్య

అత్యంత ప్ర‌మాక‌ర‌మైన వేరియంట్‌గా భావిస్తున్న క‌రోనా కొత్త వేరియంగ్ ఒమిక్రాన్ గురించి పూర్తి స‌మాచారం అందుబాటులో లేద‌ని పేర్కొన్న టెడ్రోస్ అధ‌నోమ్ గెబ్రియేస‌స్.. ఒమిక్రాన్ వేరియంట్, డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తోందనడానికి ప్ర‌స్తుతం ఆధారాలు ఉన్నాయని చెప్పారు. దీనిపై ఖ‌చ్చిత‌మైన నిర్ణ‌యానికి రావ‌డానికి మ‌రింత డేటా కావాల్సింది ఉంద‌ని తెలిపారు. అయితే, ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న‌ద‌ని రుజువుల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం కీల‌క‌మ‌ని పేర్కొన్నారు.  ఒమిక్రాన్ వేరియంట్ పంజా విసురుతున్న బ్రిట‌న్‌, ఫ్రాన్స్ వంటి ప‌లు దేశాల ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను ప్ర‌స్తావిస్తూ.. ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఒమిక్రాన్ భ‌యాందోళ‌న‌ల నేప‌థ్యంలో దీని వ్యాప్తిని  నియంత్రించడానికి ఫ్రాన్స్, జర్మనీ సహా వివిధ దేశాలు కోవిడ్ ఆంక్షలు, ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్న సమయంలో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేయ‌డంతో ప్ర‌ధాన్య‌త సంత‌రించుకుంది. ఒమిక్రాన్ వ్యాప్తి నేప‌థ్యంలో నెదర్లాండ్స్‌లో క్రిస్మస్ సందర్భంగా  అక్క‌డి అధికారులు కఠిన లాక్‌డౌన్ విధించారు. అమెరికాలోనూ వైర‌స్ కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. అక్క‌డ కూడా ఆంక్ష‌లు విధించే అవ‌కాశాలున్నాయ‌ని ఊహాగ‌నాలు వినిపిస్తున్నాయి.

Also Read: Vizag Ashram: జ్ఞానానంద ఆశ్రమంలో మరో 2 ఆవులు మృతి.. మూడు రోజుల్లోనే 26కు పైగా..

ఒమిక్రాన్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుండ‌టంపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న‌ద‌ని టెడ్రోస్ అధ‌నోమ్ గెబ్రియేస‌స్ పేర్కొన్నారు. దీని వ్యాప్తిని క‌ట్ట‌డి చేయ‌డానికి మెరుగైన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అలాగే, ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ కోసం మ‌న‌మంద‌రం క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని ఆయ‌న అన్నారు.  కొన్ని సందర్భాల్లో ఈవెంట్లు రద్దు చేయడం లేదా వాయిదా వేసుకోవడం మంచిది. తర్వాత బాధపడడం కంటే ఇప్పుడు వాటిని రద్దు చేసుకుని, ఆలస్యంగా జరుపుకోవడం మంచిది. ఎందుకంటే అన్నింటి కంటే ప్రాణ‌లు ముఖ్య‌మైని అని టెడ్రోస్ అధ‌నోమ్ గెబ్రియేస‌స్ పేర్కొన్నారు. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను సైతం వేగ‌వంతం చేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇప్ప‌టికే ఈ ఒమిక్రాన్ వేరియంట్ 90కి పైగా దేశాల‌క‌కు వ్యాపించింద‌ని తెలిపారు. చాలా దేశాల్లో డ‌బ్ల్యూహెచ్‌వో బృందాలు దీనిపై ప‌రిశోధ‌న‌లు సాగిస్తున్నాయ‌ని తెలిపారు.  ఇదిలావుండ‌గా, భార‌త్ లోనూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నిత్యం వెలుగుచూస్తుండ‌టంతో ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌నీ, అంద‌రూ టీకాలు వేసుకోవాల‌ని అధికారులు కోరుతున్నారు.

Also Read: AFSPA ర‌ద్దుకు నాగాలాండ్ తీర్మానం.. ఎందుకు AFSPA ను ఈశాన్య రాష్ట్రాలు వ్య‌తిరేకిస్తున్నాయి?

Follow Us:
Download App:
  • android
  • ios