Vizag Ashram: జ్ఞానానంద ఆశ్రమంలో మరో 2 ఆవులు మృతి.. మూడు రోజుల్లోనే 26కు పైగా..

Vizag Ashram:  విశాఖ‌ప‌ట్నంలోని జ్ఞానానంద ఆశ్రమంలో మ‌రో రెండు ఆవులు చ‌నిపోయాయి. ఈ ఆశ్ర‌మంలో 500 పైగా ఆవులు ఉన్నాయి.  ఇది చాలా చిన్న ఆశ్ర‌మం  అయినప్ప‌టికీ ఇక్క‌డ 500ల‌కు పైగా గోవులు వుండ‌టం గ‌మ‌నార్హం. ఇక్క‌డ ఆవులకు స‌రిప‌డా మేత కూగా అందించలేని ప‌రిస్థితులు ఉన్నాయి.  
 

2 more cows die at Vizag Ashram

Vizag Ashram: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప‌లు గో ఆశ్రమాల్లో ప‌రిస్థితులు దారుణంగా ఉన్నాయి. వాటికి మేత స‌రిగా అందించ‌క‌పోవ‌డం, రోగాల బారిన‌ప‌డితే వైద్యం విష‌యంలో నిర్ల‌క్ష్యంగా ఉండ‌టం, వాటికి క‌నీస సౌక‌ర్యాలు లేని కార‌ణంగా గోవులు చ‌నిపోతున్నాయి. విశాఖ‌ప‌ట్నంలోని జ్ఞానానంద ఆశ్రమంలోనూ ఇలాంటి ప‌రిస్థితులే ఉన్నాయి.  ఇక్క‌డ వ‌రుస‌గా గోవులు చ‌నిపోతుండ‌టం క‌ల‌క‌లం రేపుతున్న‌ది. రోగాలు, చలి తీవ్రత, మేత కొర‌త వంటి కార‌ణాల‌తో ఈ ఆశ్ర‌మంలోని మ‌రో రెండు ఆవులు మృత్యువాత ప‌డ్డాయి. ఇప్పటివరకు మొత్తం 26 ఆవులు చ‌నిపోయాయి.  మరణించిన ప‌శువుల‌లో ఆవుల‌తో పాటు లేగ దూడ‌లు కూడా ఉన్నాయి. జ్ఞానానంద ఆశ్రమంలోనూ వ‌రుస పెట్టి గోవులు మృత్యువాత ప‌డుతుండ‌టంపై  జంతు ప్రేమికులు, కార్యకర్తలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.  జిల్లా యంత్రాంగం గోవుల మ‌ర‌ణాల‌ను వెంట‌నే నిరోధించ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవాల‌నీ, విశాఖ జిల్లా ఆనందపురం మండలంలోని  కుసులవాడలో ఐదు ఎకరాలు కేటాయించార‌నీ, అక్క‌డికి గోవుల‌ను మార్చ‌వ‌చ్చ‌ని  విశాఖ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ అండ్ కేర్ ఆఫ్ యానిమల్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాథ్ అన్నారు.

Also Read: AFSPA ర‌ద్దుకు నాగాలాండ్ తీర్మానం.. ఎందుకు AFSPA ను ఈశాన్య రాష్ట్రాలు వ్య‌తిరేకిస్తున్నాయి?

అలాగే, విశాఖ‌ప‌ట్నంలోని జ్ఞానానంద ఆశ్రమం చాలా చిన్న‌ద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఇక్కడ 500ల‌కు పైగా గోవులు ఉన్నాయి. దాని సొంత అవుల‌కు కూడా మేత‌ను అందించ‌లేని ప‌రిస్థితులు ఉన్నాయి. ఇటీవ‌లే ఓ కంటైన‌ర్ లో అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న 160 ఆవుల‌ను పోలీసులు గుర్తించి.. వాటిని ఇక్క‌డ తీసుకువ‌చ్చి వ‌దిలారు. సిహాచ‌లం దేవ‌స్థానం సైతం మ‌రో 300 ఆవుల‌ను ఇక్క‌డ‌కు చేర్చింది అని ఆయ‌న చెప్పాడు. ఆంధ్ర ప్రదేశ్  హైకోర్టులో ప్రతి జిల్లాలో ఆవులు కోసం ఆశ్రయాలను  ఏర్పాటు చేసే విధ‌మైన ఆదేశాల‌ను జారీ చేసిన విష‌యాన్ని కూడా ఆయ‌న గుర్తు చేశారు.  ప్ర‌భుత్వం నుంచి ఆశ్రమ నిర్వ‌హ‌ణ‌కోసం నిధులు అంద‌డం లేద‌నే ఆరోప‌ణ‌లు సైతం ఉన్నాయి.  అధికారులు ఆవుల సంర‌క్ష‌ణ కోసం వెంట‌నే స‌రైన చర్య‌లు తీసుకోకుంటే తాము హైకోర్టును ఆశ్ర‌యిస్తామ‌ని జంతు ప్రేమికులు, కార్య‌క‌ర్త‌లు పేర్కొంటున్నారు. ఇదిలావుండ‌గా, పశుసంవర్థక జాయింట్ డైరెక్టర్ డి. రామ కృష్ణ మాట్లాడుతూ.. 309 అవుల‌ను గుర్తించామ‌నీ, అందులో 108 దూడ‌లు సైతం ఆశ్రమంలో ఉన్నాయ‌ని తెలిపారు. అయితే, వీటిని ఎక్క‌డ నుంచి తీసుకువ‌చ్చార‌నే దానిపై పూర్తి స‌మాచారం లేద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం అనారోగ్యానికి గురైన గోవుల‌కు వైద్యం అందిస్తున్నామ‌ని తెలిపారు. 

Also Read: Philippines: 208 మందిని బ‌లిగొన్న రాయ్ తుఫాను.. నిరాశ్ర‌యులైన ల‌క్ష‌ల మంది..

కాగా, జ్ఞానానంద ఆశ్రమంలో  ఈ నెల 19,20 తేదీల్లో రెండు రోజుల్లో 14కు పైగా గోవులు మృత్యువాత ప‌డ్డాయి. గ‌త  మూడు రోజుల్లోనే ఈ ఆశ్ర‌మంలో  26కు పైగా ఆవులు చ‌నిపోయాయి.  అంత‌కు ముందు శ్రీకాకుళం జిల్లా నారాయణ వలస వీక్లీ మార్కెట్‌లో సోమవారం ఆవులను విక్రయించి అక్రమంగా లారీల్లో తరలిస్తున్న 160కిపైగా ఆవులను మామిడిలోవ సమీపంలో ఆనందపురం పోలీసులు రక్షించారు. అనంతరం రక్షించిన ఆవులను పోలీసులు వెంకోజిపాలెంలోని జ్ఞానానంద ఆశ్రమానికి తరలించారు. లారీలలో రవాణా చేస్తున్న సమయంలో ఇప్పటికే గాయపడిన అనేక ఆవులు మరియు దూడలు ఆహారం మరియు నీరు లేకపోవడంతో చనిపోయాయని ఆరోప‌ణ‌లున్నాయి. ఎందుకంటే ఆశ్రమం పశువులకు సరైన ఆశ్రయం, ఆహారం అందించలేక తీవ్ర ఇబ్బందుల్లో ఉంది.  శుక్రవారం 10 ఆవులు, దూడలు మృతి చెందగా, శనివారం నాలుగు మృతి చెందినట్లు ఆశ్రమ వర్గాలు తెలిపాయి. ఆశ్రమం పరిమిత సంఖ్యలో ఆవులకు సౌక‌ర్యాలు క‌ల్పించ‌గ‌ల‌ద‌ని అక్కడి వారు చెబుతున్నారు. పశువులను పరిశీలించేందుకు పశువైద్యుల బృందం అక్క‌డ ఉన్నాయి. .ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపమే గోవుల మృత్యువాతకు కారణమని, దైవంగా పూజించే గోవులు ఆకలితో అలమటిస్తోన్నాయని ఎమ్మెల్యే రామకృష్ణబాబు ఆవేదన వ్యక్తంచేశారు.

Also Read: Arvind Kejriwal: ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు సిద్ధం..: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios