హైదరాబాద్‌లో దారుణం..సెల్‌ఫోన్ కోసం స్నేహితుడి హత్య
Hyderabad: ఇటీవలి కాలంలో క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు ప్రాణాలను ప్రమాదంలో పడేసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ తరహాలోనే ఎక్కడి నుంచో వలస వచ్చిన ఇద్దరు స్నేహితులు సెల్‌ఫోన్ కోసం గొడవపడ్డారు. సెల్‌ఫోన్ ఇవ్వలేదని స్నేహితుడిని కొట్టి చంపేసిన అమానుష ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.
Hyderabad: ఇటీవలి కాలంలో కొందరు చిన్నచిన్న కారణాలతో తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే దారుణాలకు తెగబడుతున్నారు. దగ్గరివారితోనే గోడవలకు సైతం దిగుతూ.. కొట్టుకుంటున్నారు. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు, చేష్టలతో నేరాలకు పాల్పడుతూ.. హంతకులుగా మారుతున్నారు. ఇదే తరహాలో సెల్‌ఫోన్ ఇవ్వలేదని స్నేహితుడిని కొట్టి చంపేసిన అమానుష ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగుచూసింది. పనికోసం ఎక్కడి నుంచో హైదరాబాద్ వచ్చిన ఇద్దరు స్నేహితుల మధ్య సెల్‌ఫోన్ గొడప పెట్టింది. ఇద్దరు తీవ్రంగా కొట్టుకున్నారు. తీవ్ర ఆవేశానికి లోనైన ఒకరు.. తన స్నేహితున్ని ప్రాణాలు తీశాడు. ఈ ఘటన ఆసిఫ్ నగర్ లో చోటుచేసుకుంది.
Also Read: Vizag Ashram: జ్ఞానానంద ఆశ్రమంలో మరో 2 ఆవులు మృతి.. మూడు రోజుల్లోనే 26కు పైగా..
సెల్ ఫోన్ కోసం గొడవపడి స్నేహితున్ని చంపిన ఘటన గురించి ఆసిఫ్ నగర్ పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా వున్నాయి.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 26 సంత్సరాల జితేందర్ ఉపాధి కోసం ఇటీవలే హైదరాబాద్ వచ్చాడు. అతను ఆసిఫ్ నగర్ ఏరియా జిర్రాలోని వర్క్‌షాపులో కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. పనిచేసుకుంటూ వర్క్‌షాపులోనే ఉండేవాడు. ఇదిలావుండగా, ఇటీవల అతని స్నేహితుడు ఫరూఖ్ కూడా ఉత్తరప్రదేశ్ నుంచి ఉపాధి కోసం హైదరాబాద్ కు వచ్చాడు. తన స్నేహితుడైన జితేందర్ వద్దకు వచ్చి.. అతనితో కలసి వర్క్‌షాపులోనే ఉంటున్నాడు. అయితే, ఆదివారం ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. అనూహ్యంగా జితేందర్ వర్క్‌షాప్‌లో శవమై కనిపించాడు. ఉత్తరప్రదేశ్ నుంచి ఇటీవలే వచ్చిన ఫరూక్ సైతం తీవ్రగాయలతో అక్కడే పడి ఉన్నాడు. ఉదయం వర్క్ షాప్ వద్దకు రాగానే యజమానికి ఈ భయానక దృశ్యాలు కనిపించాయి.
Also Read: AFSPA రద్దుకు నాగాలాండ్ తీర్మానం.. ఎందుకు AFSPA ను ఈశాన్య రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి?
ఈ ఘటనపై వెంటనే వర్క్ షాప్ యజమాని ముంతాజిర్ పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీశారు. అంతకు ముందు రోజు జరిగిన విషయాలను పైనా యజమానికి అడిగి తెలుసుకున్నారు. మొత్తం దర్యాప్తులో ఈ ఇద్దరు స్నేహితుల మద్య సెల్ ఫోన్ కారణంగా చోటుచేసుకున్న గొడవతోనే ఈ దారుణ ఘటన జరిగిందని పోలీసులు గుర్తించారు. ఈ దారుణానికి ముందు రోజు రాత్రి ఇద్దరు స్నేహితుల మధ్య సెల్‌ఫోన్ విషయమై గొడవ జరిగినట్లు ఆసిఫ్ నగర్ ఇన్‌స్పెక్టర్ రవీందర్ వెల్లడించారు. ఈ క్రమంలోనే వీరిద్దరు గొడవపడ్డారనీ, ఆవేశానికి లోనై ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరిందని పేర్కొన్నారు. ఈ ఘటన గురించి ఇన్‌స్పెక్టర్ రవీందర్ వివరిస్తూ.. జితేందర్ ఫోన్ ఇవ్వాలని ఫరూఖ్ అడిగాడని.. అందుకు అతను నిరాకరించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు చెప్పారు. దీంతో ఇద్దరూ వర్క్‌షాపులో చేతికందిన వస్తువులతో పరస్పరం దాడి చేసుకున్నారు. తీవ్రంగా కొట్టుకున్నారు. ప్రమాదకర గాయాలు అయ్యాయి. దాడిలో తలకు తీవ్రగాయం కావడంతో జితేందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అలాగే, వీరిద్దరి గొడవలో ఫరూఖ్ కు సైతం తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదుచేసుకుని పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తాం అని తెలిపారు. ప్రస్తుతం ఫరూక్ చికిత్స అందిస్తున్నామన్నారు.
Also Read: Philippines: 208 మందిని బలిగొన్న రాయ్ తుఫాను.. నిరాశ్రయులైన లక్షల మంది..