AFSPA ర‌ద్దుకు నాగాలాండ్ తీర్మానం.. ఎందుకు AFSPA ను ఈశాన్య రాష్ట్రాలు వ్య‌తిరేకిస్తున్నాయి?

AFSPA: ఈశాన్య భార‌త రాష్ట్రాల్లో చాలా కాలం నుంచి  సాయుధ దళాల ప్రత్యేక చట్టం (Armed Forces Special Powers Act-AFSPA) ర‌ద్దు చేయాల‌నే డిమాండ్ ఉంది. నాగాలాండ్ లో ఈ నెల‌లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు కాల్పులు జ‌ర‌ప‌డంతో 14 మంది పౌరులు చ‌నిపోయారు. ఈ ఘ‌ట‌న‌తో AFSPA చ‌ట్టం మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. ఈశాన్య రాష్ట్రాలన్నీ ఏఎప్ఎస్‌పీఏను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే నాగాలాండ్ అసెంబ్లీ Armed Forces Special Powers Act ను ర‌ద్దుచేయాల‌ని ఏక‌గ్రీవ తీర్మాన్ని ఆమోదించింది.
 

Nagaland adopts resolution demanding repeal of AFSPA

AFSPA: ఈశాన్య భార‌త రాష్ట్రాల్లో చాలా కాలం నుంచి  సాయుధ దళాల ప్రత్యేక చట్టం (Armed Forces Special Powers Act-AFSPA) ర‌ద్దు చేయాల‌నే డిమాండ్ ఉంది. ఈ నెల మొద‌టివారంలో నాగాలాండ్ లోని మోన్ జిల్లాలో మిలిటెంట్లుగా భావించి భద్రతా బలగాలు సాధారణ పౌరులపై కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే నాగాలాండ్ తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చాలా ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు ప్ర‌త్యేక అధికారాలు క‌ల్పిస్తున్న Armed Forces Special Powers Act మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. దీనిలో భాగంగా ప‌లు రాష్ట్రాల్లో ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఈ చ‌ట్టాన్ని ర‌ద్దు చేయాల‌ని డిమాంవ్ చేస్తున్నారు. నాగాలాండ్, మ‌ణిపూర్ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు సైతం ఈ Armed Forces Special Powers Act చ‌ట్టాన్ని ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. దీనిలో భాగంగానే  కేంద్ర ప్రభుత్వం AFSPA ఉపసంహరించాలని నాగాలాండ్‌ ప్రభుత్వం మరోసారి డిమాండ్‌ చేసింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సాయుధ దళాల ప్రత్యేక చట్టాన్ని ఈశాన్య ప్రాంతంలో, ప్రత్యేకించి నాగాలాండ్ నుంచి ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్‌ చేసింది. నాగాలాండ్‌ సీఎం నీఫియు రియో అసెంబ్లీకి నాయకత్వం వహించి తీర్మానాన్ని ఆమోదింపజేశారు.

Also Read: Philippines: 208 మందిని బ‌లిగొన్న రాయ్ తుఫాను.. నిరాశ్ర‌యులైన ల‌క్ష‌ల మంది..

Armed Forces Special Powers Act  ర‌ద్దు చేయాల‌నే తీర్మానం ఆమోదిస్తున్న సంద‌ర్భంగా నాగాలాండ్‌ సీఎం నీఫియు రియో  మాట్లాడుతూ..  AFSPAను వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. రాష్ట్రం నుంచి దీనిని ఉప‌సంహ‌రించుకోవాల‌ని పేర్కొన్నారు. అలాగే,  నాగా శాంతి చర్చలను త్వరగా పరిష్కరించాలని అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో విజ్ఞప్తి చేశారు. ‘నాగాలాండ్, నాగా ప్రజలు ఎల్లప్పుడూ AFSPAని వ్యతిరేకించారు. దానిని రద్దు చేయాలి’ అని డిమాండ్‌ చేశారు.  ఇదిలావుండ‌గా, నాగాలాండ్ లో పాటు ఈశ‌న్య భార‌తంలోని అన్ని రాష్ట్రాలు ప్ర‌జ‌లు చాలా కాలం నుంచి AFSPA ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. మోన్ జిల్లాలోని ఓటింగ్ గ్రామంలో చోటుచేసుకున్న ఘ‌ట‌న నేప‌థ్యంలో ఇంకా నిర‌స‌న‌లు కోన‌సాగుతున్నాయి. AFSPA ర‌ద్దు చేయాల‌నే డిమాండ్ అధిక‌మవుతోంది. 

Also Read: Arvind Kejriwal: ఒమిక్రాన్ ను ఎదుర్కొనేందుకు సిద్ధం..: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

AFSPA  చ‌ట్టాన్ని ఎందుకు వ్య‌తిరేకిస్తున్నారు? అందులో ఏముంది? 

ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ (AFSP Act) ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాలకు పౌరులపై అపారమైన విచక్షణాధికారాలను కట్టబెడుతుంది. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో జారీ అయిన 1942 నాటి సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) ఆర్డినెన్స్ ఆధారంగా ఈ చట్టాన్ని రూపొందించారు. సెప్టెంబరు 11, 1958న AFSP చట్టాన్ని భారత పార్లమెంటు ఆమోదించింది. AFSP చట్టం సమస్యాత్మక, అల్లర్ల, కల్లోల ప్రాంతాలను నియంత్రించడానికి సాయుధ దళాలకు ప్రత్యేక అధికారాలను ఇస్తుంది. ఏదైనా ఓ ప్రాంతం ప్రమాదకరమైన స్థితిలో ఉందని అభిప్రాయపడినప్పుడు.. ఆ ప్రాంత పౌరులకు సహాయంగా సాయుధ బలగాలను రంగంలోకి దింపడానికి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉప‌యోగిస్తుంది.  బలగాలకు కాల్పులు జరపడానికి, వారెంట్ లేకుండా ప్రవేశించడానికి, శోధించడానికి, నేరానికి పాల్పడిన ఏ వ్యక్తినైనా అరెస్టు చేయడానికి అధికారం కల్పిస్తుంది. ఈ చర్యలన్నింటినీ చేసే సాయుధ బలగాలకు ప్రాసిక్యూట్ నుంచి మినహాయింపు లభిస్తుంది. Armed Forces Special Powers Act అందించే ప్రత్యేకమైన అధికారాలతో చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌ను నుంచి వీలు క‌ల్పిస్తుంది. AFSPA  చ‌ట్టం ముసుగులో అక్క‌డి అమాయ‌క ప్ర‌జ‌ల‌ను అణ‌చివేయ‌డంతో పాటు.. వారి ప్రాణాలు తీస్తున్నార‌ని విమ‌ర్శ‌లున్నాయి. ఇండ్ల‌లోకి చొర‌బ‌డి మ‌హిళ‌ల‌ను అఘాయిత్యాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అందుకే AFSPA  ను ద్దు చేయాల‌ని ఈశాన్య ప్ర‌జ‌లు సంవ‌త్స‌రాల నుంచి డిమాండ్ చేస్తున్నారు.

Also Read: elections 2022: మమతా బెనర్జీ తీరు ఉత్తర కొరియా నియంత కిమ్‌ లా ఉంది: బీజేపీ

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios