స్నేహితురాలి బర్త్ డే కోసం వెళ్లి.. కొలంబియాలో తెలుగు విద్యార్థి అనుమానాస్పద మరణం..
ఎంఎస్ పూర్తి చేసేందుకు స్పెయిన్ వెళ్లిన తెలుగు విద్యార్థి.. కొలంబియాలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. స్నేహితురాలి బర్త్ డే వేడుకల కోసం అని ఆ యువకుడు స్పెయిన్ నుంచి కొలంబియా వెళ్లాడు. అక్కడే ఈ ఘటన జరిగింది.
స్నేహితురాలి పుట్టిన రోజు వేడుకల కోసం అని వెళ్లి కొలంబియాలో ఓ తెలుగు విద్యార్థి అనుమానాస్పదంగా మరణించాడు. ఈ ఘటన ఈ నెల 19వ తేదీన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా కొండూరు వాస్తవ్యుడైన 34 ఏళ్ల బేతపూడి సుదీర్ కుమార్ (జోషి) ఇక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అనంతరం 2018 సంవత్సరంలో పీజీ చేసేందుకు ఆయన స్పెయిన్ కు వెళ్లారు.
భారీ వర్షాలతో ఆసిఫాబాద్ జిల్లాలో ముగ్గురు మృతి.. పిడుగుపడి ఇద్దరు, వాగులో కొట్టుకుపోయి మరొకరు..
ఆ దేశంలో టెలీ కమ్యూనికేషన్‌లో ఎంఎస్ చేసేందుకు యూనివర్సిటీ ఆఫ్ లే డే జైన్‌లో జాయిన్ అయ్యారు. అయితే కరోనా మహమ్మరి వల్ల ఆయన పీజీ పూర్తి కాలేదు. కొన్ని సబ్జెక్ట్ లు ఇంకా మిగిలిపోయాయి. దీంతో అక్కడే ఓ పార్ట్ టైమ్ జాబ్ వెతుకున్నాడు. ఆ జాబ్ చేసుకుంటూ పీజీ పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
సింగర్ శుభ్ దేశ భక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు - హర్ సిమ్రత్ బాదల్
అయితే సుదీర్ కుమార్ కు తన యూనివర్సిటీ ఆఫ్ లే డే జైన్‌లో చదువుతున్న జెస్సికా అనే యువతితో పరిచయం కలిగింది. ఆమె కొలంబియా ప్రాంతానికి చెందిన యువతి. వీరి మధ్య స్నేహం ఏర్పడింది. దీంతో ఆమె పుట్టిన రోజు వేడుకల కోసం సుధీర్ ఈ నెల 15వ తేదీన కొలంబియాలోని బొగొటో ప్రాంతానికి వెళ్లారు. అయితే బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగిన తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ.. జెస్సికా ఈ నెల 19వ తేదీన సుధీర్ తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. సుధీర్ మరణించాడని తెలిపింది. దీంతో తల్లిదండ్రులు బేతపూడి కేథరీన్, దేవదాసు ఒక్క సారిగా షాక్ అయ్యారు.
అర్ధరాత్రి భారీ వర్షం.. జలమయమైన నాగ్ పూర్ సిటీ.. సహాయక చర్యల కోసం రంగంలోకి కేంద్ర బలగాలు
రియో బ్లాంకోలో ఉన్న తన ఇంట్లోనే సుధీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆమె వివరించింది. తమ కుమారుడి ఆత్మహత్య కాదని, కావాలనే వారి వద్దకు పిలిపించుకొని హత్య చేసి ఉంటారని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తాము ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి, తమ కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని కోరారు.