భారీ వర్షాలతో ఆసిఫాబాద్ జిల్లాలో ముగ్గురు మృతి.. పిడుగుపడి ఇద్దరు, వాగులో కొట్టుకుపోయి మరొకరు..
ఉత్తర తెలంగాణలో మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలో ఎడతెరపి లేకుండా పడుతున్న వానల వల్ల పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇందులో ముగ్గురు మరణించారు. ఈ ఘటనలు జిల్లా వ్యాప్తంగా విషాదాన్ని నింపాయి.
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద విషాదాన్నే నింపాయి. ఆసిఫాబాద్ జిల్లాలో ఈ వర్షాల వల్ల జరిగిన వేరు వేరు ప్రమాదాల్లో ముగ్గురు మరణించారు. ఆసిఫాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న హీరాపూర్ వాసులైన లక్ష్మీబాయి, 24 ఏళ్ల చంద్రకళ తల్లీ కూతుర్లు. వీరు ఎప్పటిలాగే శనివారం పొలం పనులకు వెళ్లారు. అక్కడ తమ పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో ఒక్క సారిగా వారిపై పిడుగు పడింది. దీంతో చంద్రకళ తీవ్ర అస్వస్థతకు గురై అక్కడే కింద పడిపోయింది. అనంతరం మరణించింది. అయితే తల్లి మాత్రం ప్రస్తుతం హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.
సింగర్ శుభ్ దేశ భక్తిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు - హర్ సిమ్రత్ బాదల్
అలాగే ఆసిఫాబాద్ మండలంలో ఉన్న చిర్రకుంట గ్రామ పంచాయతీ పరిధిలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. గుట్టచెలిమ వాస్తవ్యుడైన 24 ఏళ్ల దేవురావు శనివారం పొలానికి వెళ్లారు. పనులు పూర్తి చేసుకొని మధ్యాహ్నం ఇంటికి బయల్దేరాడు. ఈ క్రమంలో అతడిపై అకస్మాత్తుగా పిడుగు పడింది. దీంతో అతడు మరణించారు.
తండ్రి చనిపోయాడని డిప్రెషన్.. 39 రోజుల కూతురును 14 అంతస్తు నుంచి తోసేసిన తల్లి..
కాగా.. ఇదే గ్రామ పంచాయతీ పరిధిలో ఓ మహిళ వాగులో కొట్టుకుపోయి చనిపోయారు. ఎర్రగుట్ట గ్రామానికి చెందిన 55 ఏళ్ల భీంబాయి తన గ్రామానికి సమీపంలో ఉన్న వాగు దాటేందుకు ప్రయత్నించింది. అయితే భారీ వర్షాల వల్ల ఆ వాగు వేగంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో వాగు మధ్యలోకి వచ్చిన తరువాత ఆమె ప్రవాహ వేగాన్ని తట్టుకోలేక అందులో కొట్టుకుపోయింది. ఈ వాగు ప్రవహించే పక్క గ్రామంలో భీంబాయి మృతదేహం లభించింది.