india: టీ20 ప్రపంచకప్ 2026కు యంగ్ ప్లేయర్లతో భారత జట్టు.. స్టార్లకు షాక్
India probable squad for 2026 T20 World Cup: 2026 టీ20 ప్రపంచకప్ కోసం ప్రకటించే భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఉండగా, శ్రేయస్ అయ్యర్ కు కూడా చోటుదక్కుతుందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
టీ20 ప్రపంచకప్ 2026 సన్నాహాలు మొదలు
India probable squad for 2026 T20 World Cup : టీ20 ప్రపంచకప్ 2026 కోసం భారత జట్టును బీసీసీఐ సిద్ధం చేస్తోంది. ఈ మెగా టోర్నమెంట్‌ను భారత్-శ్రీలంకలు సంయుక్తంగా 2026 ఫిబ్రవరి-మార్చి నెలల్లో నిర్వహించనున్నాయి. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, టీమిండియా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది.
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత టీ20 జట్టు
2025 ఐపీఎల్ తర్వాత ఎంపిక ప్రక్రియకు మళ్లీ అవకాశం లేదు. టీ20 ఫార్మాట్‌లో సూర్యకుమార్ నేతృత్వంలో భారత జట్టు గత 15 మ్యాచ్‌ల్లో కేవలం 2 ఓటములే చవిచూసింది.
శుభ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్ వంటి యంగ్ బ్యాటర్లు టెస్టు, ఛాంపియన్స్ ట్రోఫీకి దృష్టి సారించిన తర్వాత ఇప్పుడు తిరిగి టీ20 ఫార్మాట్‌లోకి వస్తున్నారు. గిల్ ఇటీవల టెస్ట్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు, టీ20లో చివరి సారి వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు.
టీ20 వరల్డ్ కప్ 2026 భారత జట్టులో సన్ రైజర్స్ యంగ్ ప్లేయర్
టీ20 వరల్డ్ కప్ 2026 కోసం భారత జట్టులోకి సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ కూడా రానున్నాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు. అభిషేక్ శర్మ, ఇంగ్లాండ్‌పై 37 బంతుల్లో సెంచరీతో ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లో కూడా తన ఎడమచేతి స్పిన్‌తో మంచి పాత్ర పోషించనున్నాడు.
తిలక్, శ్రేయాస్ అయ్యర్ లకు చోటు
అలాగే, దక్షిణాఫ్రికాపై రెండు సెంచరీలు, ఇంగ్లాండ్ పై మంచి ఇన్నింగ్స్ లను ఆడిన తిలక్ వర్మకు కూడా టీ20 ప్రపంచ కప్ 2026 భారత జట్టులో చోటుదక్కుతుందని క్రీడా నిపుణులు పేర్కొంటున్నారు.
అలాగే, ఐపీఎల్ లో పంజాబ్ ను ఫైనల్ కు తీసుకెళ్లడంతో పాటు అద్భుతమైన బ్యాటింగ్ తో 2025 సీజన్ లో 604 పరుగులు సాధించిన శ్రేయాస్ అయ్యర్ కూడా జట్టులోకి రావచ్చు. అతను ఛాంపియన్స్ ట్రోఫీలో టాప్ స్కోరర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
కేఎల్ రాహుల్ కు చోటుదక్కేనా?
వికెట్ కీపర్ పాత్రలో కేఎల్ రాహుల్ కు చోటుదక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సంజూ శాంసన్ 2024లో మూడు సెంచరీలతో వికెట్ కీపర్ గా భారత టీ20 జట్టులో బలమైన పోటీదారుగా ఉన్నాడు. రెండవ వికెట్ కీపర్ స్థానానికి జితేశ్ శర్మ, ధ్రువ్ జురెల్ మధ్య పోటీ ఉంది. జితేశ్ 2025 ఐపీఎల్‌లో ఆర్సీబీ విజయంలో కీలకంగా ఉన్నాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 భారత బౌలింగ్ విభాగంలో ఎవరుంటారు?
హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు జట్టులో ఉండటం పక్కా. బుమ్రా, అర్షదీప్ సింగ్ కూడా పేస్ విభాగాన్ని నడిపించనున్నారు. మూడవ పేసర్‌గా హర్షిత్ రాణా ఎంపిక అయ్యే అవకాశముంది.
ఒక అదనపు ఆల్‌రౌండర్ ఎంపిక చేస్తే, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్ లేదా శివమ్ దూబేకు అవకాశం లభించవచ్చు.
భారత జట్టు ప్రపంచకప్‌కు ముందు 18 టీ20 మ్యాచులు ఆడనుంది. ఇక్కడి ప్రదర్శనలు కూడా పరిగణలోకి తీసుకునే అవకాశముంది.
టీ20 ప్రపంచ కప్ 2026 కోసం భారత అంచనా జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), జితేశ్ శర్మ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రిత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా.