శ్రీలంకలో మొట్ట మొదటి సారిగా అధ్యక్ష పదవికి జూలై 20వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడు ఎమర్జెన్సీ విధించారు. ఎన్నికలు అయిపోయేంత వరకు ఇది అమలులో ఉంటుంది. 

శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే సోమవారం దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. తిరుగుబాటు కార‌ణంగా గోట‌బ‌య రాజ‌ప‌క్సే అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామ చేయ‌డంతో ఇప్పుడు అక్క‌డ కొత్త అధ్య‌క్షుడు కొలువుదీర‌నున్నారు. దీని కోసం దేశ చ‌రిత్ర‌లోనే తొలిసారిగా ఎన్నిక‌లు నిర్వ‌హించున్నారు. అయితే ఈ ఎన్నిక జూలై 20వ తేదీన చేప‌ట్టనున్నారు. ఈ నేపథ్యంలో శాంతియుత వాతావ‌ర‌ణం నెల‌కొల్పేందుకు అత్యవసర పరిస్థితిని విధిస్తూ సోమ‌వారం ఉద‌యం గెజిట్ విడుద‌ల అయ్యింది. 

"అలంకారమూ కాదు రాజకీయమూ కాదు": గవర్నర్ పదవిపై ఉప‌రాష్ట్రప‌తి వెంకయ్యనాయుడు వ్యాఖ్యలు

225 మంది సభ్యులున్న పార్లమెంటు కొత్త అధ్యక్షుడిని మ‌రో రెండు రోజుల్లో ఎన్నుకోనుంది. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప్రజా భద్రతా ఆర్డినెన్స్‌లోని పార్ట్ 2లో అత్యవసర నిబంధనలను విధించడానికి రాష్ట్రపతికి అధికారం ఉంది, “ (ఎ) ఓ పరిస్థితిని ఎదుర్కోవడానికి పోలీసులు సరిపోరని రాష్ట్రపతి అభిప్రాయపడితే ఆయ‌న సాయుధ బలగాలను పిలుస్తూ ఆర్డర్‌ను గెజిట్ చేయవచ్చు. ’’ అనే నిబంధన శ్రీలంక రాజ్యాంగంలో ఉంది. దీని ప్రకారం భద్రతా దళాలు ఆయుధాలు, పేలుడు పదార్థాలను వెతికి తీయవచ్చు. అలాగే అనుమానితులను అరెస్టు చేయొచ్చు. మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకోవడం, తొలగించడం, ఏ ప్రాంగ‌ణంలోకి అయినా ప్ర‌వేశించి శోధించే అవ‌కాశం ల‌భిస్తాయి. 

రాజపక్సే దేశం విడిచి పారిపోయి, ఆ తర్వాత రాజీనామా చేయడంతో గత వారం ఖాళీ అయిన అధ్యక్ష పదవికి సంబంధించిన నామినేషన్లను పార్లమెంట్ మంగళవారం ఆమోదించనున్న నేపథ్యంలో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే రాజపక్సే ప్రస్తుతం సింగపూర్‌లో ఉన్నారు. విక్రమసింఘేతో పాటు మ‌రో న‌లుగురు అభ్యర్థులు అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ ప‌డుతున్నారు. దీని ప‌ద‌వీకాలం 2024 నవంబర్ వ‌ర‌కు ఉంది. కాగా పార్లమెంట్‌లో బుధవారం ఓటింగ్ జరగనుంది. అయితే ఓటింగ్‌లో పార్లమెంటేరియన్లను బెదిరించే, ప్రభావితం చేసే వారిపై నిఘా పెట్టాలని పోలీసులను ఆదేశించినట్లు తాత్కాలిక అధ్యక్షుడి కార్యాలయం ఆదివారం తెలిపింది.

చైనాలో ఆకస్మిక వరదలు, 12 మంది మృతి, వేలాది మంది పునరావాస కేంద్రాలకు...

విక్రమసింఘే, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాసతో పాటు మార్క్సిస్ట్ జనతా విముక్తి పెరమున (JVP) నాయకుడు అనుర కుమార దిసానాయక, SLPP నుంచి విడిపోయిన డల్లాస్ అలహప్పెరుమ లు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. అయితే SLPP అధికారికంగా విక్రమసింఘేకు మద్దతు ప్రకటించింది. కాగా సింగపూర్ నుంచి పంపిన రాజపక్సే రాజీనామా లేఖను స్పీకర్ ఆమోదించడంతో ప్రధాని రణిల్ విక్రమసింఘే శుక్రవారం తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. 73 ఏళ్ల ఆయ‌న 2020 పార్లమెంటరీ ఎన్నికలలో యునైటెడ్ నేషనల్ పార్టీ (యుఎన్‌పీ)ని ఓడించారు. అయితే అధ్య‌క్ష ప‌ద‌వికి ఆయ‌నే ముందజ‌లో ఉన్నారు. 

అమెరికాలోని ఇండియానా మాల్ లో కాల్పులు.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు..

ఆహారం, ఇంధనం, మందులతో పాటు నిత్యావసరాల దిగుమతి చేసుకోవ‌డానికి శ్రీలంక వ‌ద్ద విదేశీ మార‌క‌ద్ర‌వ్యం లేక‌పోవ‌డంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ప‌డింది. ఏడు దశాబ్దాలలో ఇలాంటి ప‌రిస్థితి ఆ దేశం ఎప్పుడూ ఎదుర్కోలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా తిరుగుబాటు తర్వాత ఆర్థిక సంక్షోభం దేశంలో రాజకీయ సంక్షోభానికి దారితీసింది. అయితే ఈ ద్వీప దేశంలో ఉన్న 22 మిలియన్ల మంది ప్రజలకు రాబోయే ఆరు నెలల పాటు ప్రాథమిక అవసరాలను తీర్చడానికి సుమారు 5 బిలియన్ డాలర్లు అవసరం.