ఇండియానా స్టేట్ మాల్‌లోని ఫుడ్ కోర్ట్‌లో జరిగిన కాల్పుల ఘటనలో కనీసం ముగ్గురు మరణించారు. ఇద్దరు గాయపడ్డారు.
అమెరికా : అమెరికాలో మళ్ళీ కాల్పుల కలకలం చెలరేగింది. అధ్యక్షుడి నుంచి సామాన్యుడి వరకు అప్రమత్తంగా ఉన్నా.. చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నా.. కాల్పుల ఘటనలు ఆపలేకపోతున్నారు. తాజాగా యునైటెడ్ స్టేట్స్‌లోని ఇండియానా స్టేట్ మాల్‌లోని ఫుడ్ కోర్ట్‌లో ఒక వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలోముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఇద్దరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
ఈ ఘటన గ్రీన్‌వుడ్ పార్క్ మాల్‌లో చోటుచేసుకుంది. కాల్పులు జరిపిన వ్యక్తిని సాయుధుడైన ఓ పౌరుడు హతమార్చాడని అమెరికా పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు గ్రీన్‌వుడ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ చీఫ్ జిమ్ ఐసన్ తెలిపారు. “గ్రీన్‌వుడ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఈ పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. కమాండ్ పోస్ట్‌తో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నాను, ఇక ఎలాంటి ముప్పు లేదు” అని మేయర్ మార్క్ మైయర్స్ న్యూయార్క్ టైమ్స్‌తో అన్నారు.
బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయంపై దాడి.. హిందువుల ఇళ్లు, దుకాణాలు ధ్వంసం..
కాల్పులకు తెగబడ్డమధ్య వయసు వ్యక్తి... సాయుధుడైన పౌరుడిచే కాల్చి చంపబడ్డాడు. అయితే, కాల్పుల వెనుక ఎటువంటి ఉద్దేశ్యం ఉందనేది తెలియరాలేదని అధికారులు తెలిపారు. చీఫ్ జిమ్ ఐసన్, విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, స్థానిక అత్యవసర కాల్ సెంటర్‌కు స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ఫుడ్ కోర్ట్‌లో షూటింగ్ గురించి కాల్స్ రావడం ప్రారంభించాయని చెప్పారు. కాల్పులు జరిపిన వ్యక్తి వద్ద పొడవాటి రైఫిల్, మందుగుండు సామగ్రికి సంబంధించిన అనేక మ్యాగజైన్లు ఉన్నాయని పోలీసులు తెలిపారని ఫాక్స్ న్యూస్ నివేదించింది.
