Asianet News TeluguAsianet News Telugu

WWII: యుద్ధంలో సెక్స్ బానిసలుగా.. బాధితులకు పరిహారం చెల్లించాలని జపాన్‌ను ఆదేశించిన దక్షిణ కొరియా కోర్టు

రెండో ప్రపంచ యుద్ధంలో దక్షిణ కొరియా దేశ మహిళలను సెక్సువల్ బానిసలుగా మార్చారని, జపాన్ సైనికుల చేతిలో వారు దారుణంగా గాయపడ్డారని దక్షిణ కొరియా కోర్టు పేర్కొంది. కాబట్టి, 16 మంది బాధిత పిటిషనర్లకు పరిహారం చెల్లించాలని జపాన్‌ను ఆదేశించింది.
 

south korea court orders japan to pay 1,5000 dollars as their soldiers made sexual enslavement of women kms
Author
First Published Nov 23, 2023, 10:05 PM IST

న్యూఢిల్లీ: యుద్ధాలు జరిగినప్పుడు మరణాలే కాదు.. ప్రాణాలున్నా జీవితమంతా కోలుకోలేని గాయాలూ ఉంటాయి. బయటికి వెల్లడి కాని మరెన్నో హీన ఘటనలు ఉంటాయి. అధికారిక చరిత్రలో భాగం కాని చీకటి అధ్యాయాలు ఇంకెన్నో ఉంటాయి. ఇలాంటివే రెండో ప్రపంచ యుద్ధంలోనూ జరిగాయి. యుద్ధ సమయంలో సెక్సువల్ స్లేవరీకి బలవంతంగా గురి చేసిన బాధితులు దీర్ఘకాలంలో న్యాయపోరాటం చేస్తున్నారు. జపాన్ సైనికుల కబంధ హస్తాల్లో తమ జీవితం నలిగిపోయిందని, తమకు పరిహారం చెల్లించాలని కోర్టులో పోరాడుతున్నారు. దక్షిణ కొరియా కోర్టు వారికి ఊరట ఇచ్చింది.

16 మంది మహిళలకు జపాన్ పరిహారం ఇవ్వాలని, 200 మిలియన్ వొన్ (1.54 లక్షల డాలర్లు) ఒక్కొక్కరికి అందించాలని ఆదేశించింది. ఈ మహిళను బలవంతంగా అపహరించి సెక్సువల్ బానిసలుగా మార్చేశారని తెలిపింది. వారు తీవ్రంగా గాయపడ్డారని, యుద్ధం తర్వాత సాధారణ జీవితాన్ని వారు జీవించలేకపోతున్నారని వివరించింది.

16 మంది బాధితులు కోర్టులో పిటిషన్ వేశారు. అందులో 95 ఏళ్ల లీ యంగ్ సో కూడా ఉన్నది. ఆమె కోర్టు నుంచి బయటకు విజయానందంతో వచ్చారు. మరణించిన బాధితులకూ తాను కృతజ్ఞురాలినని వివరించారు.

తొలుత దిగువ కోర్టు వీరి పిటిషన్లను కొట్టేసింది. జపాన్‌కు సార్వభౌమ రక్షణ వారికి ఉంటుందని, కాబట్టి, బాధితులకు పరిహారాన్ని అడిగే అవకాశాలు ఉండవని తెలిపింది. కానీ, సియోల్ హైకోర్టు మాత్రం ఆ తీర్పును ఓవర్ రూల్ చేసింది. అక్రమ ప్రవర్తన సందర్భాల్లో సార్వభౌమత్వ రక్షణను గౌరవించలేమని తేల్చేసింది.

Also Read : Uttar Pradesh: ‘హమాస్ అరాచకాలతో ఇస్లాం వదిలిపెట్టాను’.. హిందు యువకుడితో ఆమె వివాహం

రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ సైనికుల కోసం సుమారు 2,00,000 మంది మహిళలను సెక్సువల్ స్లేవర్లుగా మార్చేశారని ప్రధానస్రవంతి చరిత్రకారులు చెబుతారు. చైనా, ఇతర ఆసియా దేశాలకు చెందినవారూ ఇందులో ఉన్నప్పటికీ ఎక్కువ మంది మహిళలు కొరియా నుంచే ఉంటారని వివరిస్తారు. 1910 నుంచి 1945 ల మధ్య కొరియాలో జపాన్ వలస పాలన చేసింది. 

ఈ సమస్య ఉభయ దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపెడుతూనే ఉన్నది. పాత గాయాలను మరిచిపోదామని, ఇప్పుడ జపాన్‌తో కలిసి అభివృద్ధి మార్గంలో పయనిద్దామని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ చెబుతున్నారు. ఈ సందర్భంలో కోర్టు తీర్పు వెలువడటం గమనార్హం.

కాగా, జపాన్ ప్రభుత్వం మాత్రం ఈ తీర్పును తప్పుబడుతున్నది. యుద్ధ కాలంనాటి అఘాయిత్యాలకు నేరుగా తమను ఎలా బాధ్యులను చేస్తారని ప్రశ్నిస్తున్నది. సైనికుల కోసం వేశ్యా వాటికలను కమర్షియల్‌గా నిర్వహించేవారని, ఆ వేశ్యా వాటికల్లోకి పౌరులే మహిళలను తీసుకుని వచ్చేవారని జపాన్ వాదించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios