అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం రేకెత్తించాయి. వాషింగ్టన్ డీసీలోని నైట్ లైఫ్ ప్రాంతంలో దుండుగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. మరొకరికి గాయాలు అయ్యాయి. మృతుల్లో ఒకరు మహిళ ఉన్నారు.

వాషింగ్టన్ డీసీలో మళ్లీ కాల్పులు జరిగాయి. నైట్ లైఫ్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. ఒకరికి గాయాలయ్యాయి. మృతుల్లో ఆగ్నేయ వాషింగ్టన్ లోని అనకోస్టియా ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, ఓ మహిళ ఉన్నారని పోలీసులు తెలిపారు.

మద్యం మత్తులో స్నేహితుడి రక్తం తాగాలని ప్రయత్నం.. ప్రాణాలకే ముప్పు తెచ్చిన కోరిక.. అసలేమైందంటే ?

వాషింగ్టన్ డీసీ తాత్కాలిక పోలీసు చీఫ్ పమేలా స్మిత్ ఈ కాల్పులను "ఆగ్నేయ ప్రాంతంలో అర్థరహిత హింసాత్మక చర్య" గా అభివర్ణించారు. ఆగస్టు మొదటి ఐదు రోజుల్లో కనీసం డజను మందిని పొట్టనబెట్టుకున్న వరుస కాల్పుల నేపథ్యంలో ఈ హత్యలు జరిగాయి.

కాగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు నగరంలో అనేక మార్లు కాల్పులు జరిగాయి. ఇందులో 150కి పైగా సాధారణ పౌరులు హతమయ్యారు. గడిచిన రెండు దశాబ్దాల్లో ఇవే అత్యధిక హత్యలు కావడం గమనార్హం. గత నెల 27వ తేదీన కూడా అమెరికాలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. శాన్ ఫ్రాన్సిస్కో-ఓక్‌లాండ్ బే బ్రిడ్జిపై రద్దీ సమయంలో ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. నగ్నంగా ఉన్న ఓ మహిళ అకస్మాత్తుగా తన కారులోంచి దిగి, అటుగా ప్రయాణిస్తున్న కార్లపై తుపాకీతో కాల్చడం ప్రారంభించింది. 

కారుకు దారివ్వాలని గొడవ.. ఆదివాసిపై బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి కాల్పులు..

అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాలిఫోర్నియా హైవే పాట్రోల్‌కి సాయంత్రం 4.40 గంటలకు ఇంటర్‌స్టేట్ 80లో ఒక నిర్లక్ష్యపు డ్రైవర్ ఇతర డ్రైవర్లకు తుపాకీని చూపిస్తూ.. 911 కాల్‌ వచ్చింది. ఓ వీధి గుండా వెడుతున్న మహిళ వీధి మధ్యలో ఆగి, కత్తితో కారులోంచి దిగి కేకలు వేయడం ప్రారంభించింది. ఆ తర్వాత మహిళ కారులోకి ఎక్కి టోల్ ప్లాజా వద్దకు వెళ్లింది. అక్కడ బట్టలు విప్పి మళ్లీ తుపాకీతో కారు దిగింది. అనంతరం ఇతర వాహనాల వైపు కాల్పులు జరిపింది. 

నటిపై పలుమార్లు వ్యాపారవేత్త అత్యాచారం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దోపిడి..

కాలిఫోర్నియా హైవే పెట్రోలింగ్ ప్రదేశానికి చేరుకుని ఆయుధాన్ని కిందకు దింపమని ఆ మహిళను కోరింది. కొద్దిసేపు అలా చేయడానికి నిరాకరించిన తర్వాత, ఆ మహిళ తన తుపాకీని కిందకి దింపి, పోలీసు కస్టడీలోకి వచ్చింది. స్థానిక ఆసుపత్రిలో మహిళ మానసిక ఆరోగ్యం విషయాలు ఇంకా వెల్లడించలేదన్నారు. ఆమెను విడుదల చేసిన తర్వాత ఈ ఆరోపణలపై మళ్లీ బుక్ చేస్తామని పోలీసులు తెలిపారు.