Asianet News TeluguAsianet News Telugu

స్థిరమైన వృద్ధి కోసం భారత్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం - చైనా

స్థిరమైన వృద్ధి, బలమైన సంబంధాల కోసం భారత్ కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా తెలిపింది. సరిహద్దు ప్రాంతాల్లో స్థిరత్వాన్ని నిలబెట్టడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని పేర్కొంది. 

Ready to work with India for sustainable growth - China
Author
First Published Dec 26, 2022, 10:32 AM IST

ద్వైపాక్షిక సంబంధాల స్థిరమైన, పటిష్టమైన వృద్ధి కోసం భారత్‌తో కలిసి పని చేసేందుకు చైనా సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ అన్నారు. 2020 నుంచి ఉద్రిక్తతలు కొనసాగుతున్న సరిహద్దు ప్రాంతాల్లో స్థిరత్వాన్ని కొనసాగించేందుకు రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని ఆయన ఆదివారం స్పష్టం చేశారు. 2022లో అంతర్జాతీయ పరిస్థితులు, చైనా విదేశాంగ సంబంధాలపై జరిగిన సింపోజియంలో వాంగ్ మాట్లాడుతూ.. చైనా, భారత్ దౌత్య, సైనిక మార్గాల ద్వారా కమ్యూనికేషన్ ను కొనసాగించాయని, సరిహద్దు ప్రాంతాల్లో స్థిరత్వాన్ని నిలబెట్టడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని అన్నారు.

నేడు వీర్ బాల్ దివస్.. చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని మోడీ..

చైనా దౌత్య కార్యకలాపాలపై వాంగ్ ఇచ్చిన సుధీర్ఘ ప్రసంగంలో యుక్రెయిన్ యుద్ధం ఉన్నప్పటికీ అమెరికాతో చైనా సమస్యాత్మక సంబంధాలు, రష్యాతో పెరుగుతున్న సంబంధాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. తూర్పు లడఖ్లోని వివాదాస్పద ప్రాంతాలకు చైనా తన దళాలను పెద్ద సంఖ్యలో తరలించడానికి ప్రయత్నించినప్పుడు 2020 ఏప్రిల్ నుండి ఇరుక్కుపోయిన భారత్-చైనా సంబంధాలను ఆయన క్లుప్తంగా ప్రస్తావించారు. కాగా.. అరుణాచల్ ప్రదేశ్లోని యాంగ్సేలో భారత, చైనా దళాల మధ్య ఘర్షణ జరిగిన కొద్ది రోజుల తర్వాత ప్రతిష్టంభనను పరిష్కరించడానికి ఇరు దేశాలు ఇప్పటివరకు 17 రౌండ్ల చర్చలు జరిపాయి.

కూటమి ఘర్షణకు చైనా వ్యతిరేకం: వాంగ్
కూటమి ఘర్షణను చైనా వ్యతిరేకిస్తుందని వాంగ్ యి పునరుద్ఘాటించారు. అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ లతో కూడిన క్వాడ్ కూటమి ఏర్పాటును అలాగే అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ ల ‘ఔకుస్ కూటమి’ను జిన్ పింగ్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఇలాంటి కూటమిలు తమ ఎదుగుదలను అదుపు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయని అన్నారు. ‘‘మేము కూటమి ఘర్షణ, జీరో-సమ్ పోటీని తిరస్కరించాం. ఇతర ప్రధాన దేశాలతో సంబంధాలలో వ్యూహాత్మక స్థిరత్వాన్ని కొనసాగించాము’’ అని అన్నారు.

వాజ్‌పేయి సహా పలువురు మాజీ ప్రధానుల స్మారకాల వద్ద రాహుల్ గాంధీ నివాళులు..

పాకిస్తాన్ తో చైనా సంబంధాలను కూడా వాంగ్ ప్రస్తావించారు. రెండు దేశాలు ఒకరికొకరు గట్టిగా మద్దతు ఇవ్వడం కొనసాగించాయని అన్నారు. అమూల్యమైన వాతావరణ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిలబెట్టాయని పేర్కొన్నారు. స్నేహాన్ని బలోపేతం చేశాయని తెలిపారు. అలాగే చైనా-యూఎస్ సంబంధాలపై వాంగ్ మాట్లాడుతూ.. చైనాపై అమెరికా విధానాన్ని గట్టిగా తిరస్కరించామని తెలిపారు. రెండు దేశాలు ఒకరితో ఒకరు కలిసి ఉండటానికి సరైన మార్గాన్ని అన్వేషిస్తున్నామని తెలిపారు. అమెరికా మొండిగా చైనాను తన ప్రధాన పోటీదారుగా చూడటం, చైనాకు వ్యతిరేకంగా కఠినమైన దిగ్బంధనం, అణచివేత, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుండటంతో చైనా-అమెరికా సంబంధాలు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డాయని వాంగ్ అన్నారు.

కోవిడ్‌-19తో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం

ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ప్రమేయం ఉన్నప్పటికీ చైనా-రష్యా సంబంధాల అభివృద్ధి పై ఆయన మాట్లాడారు. రష్యాతో సత్సంబంధాలు, సహకారాన్ని పెంపొందించామని, చైనా-రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత పరిణతి చెందిందని వాంగ్ చెప్పారు. గతేడాది కాలంగా చైనా, రష్యా తమ ప్రధాన ప్రయోజనాలను కాపాడుకోవడంలో ఒకరికొకరికి మద్దతు ఇచ్చుకున్నాయని అన్నారు. తమ రాజకీయ, వ్యూహాత్మక పరస్పర విశ్వాసం మరింత బలపడిందని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios