చిన్నారులపై ఒమిక్రాన్ పంజా.. సౌత్ ఆఫ్రికా సైంటిస్టుల ఆందోళన
ఇటీవల దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా మహమ్మారి (Coronavirus) కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) పై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్త చేస్తున్నాయి. శాస్త్రవేత్తలు, పలువురు నిపుణులు ఈ వేరియంట్‌పై చెప్తున్న అభిప్రాయాలు మరింత ఆందోళనను కలిగిస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ దక్షిణాఫ్రికాలలో రెట్టింపు వేగంతో విజృంభిస్తుండటం, చిన్నారుల కేసులు పెరుగుతుండటంతో సైంటిస్టులు (South Africa) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది చైనాలో వెలుగుచూసిన Coronavirus ఇప్పటికీ తన ప్రభావాన్ని కొనసాగిస్తూనే ఉంది. అనేక మార్పులు చెందుతూ.. తన సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఇదివరకు కరోనా వేరియంట్లైన డెల్టా, డెల్టా ప్లస్ ల పంజా కారణంగా చాలా దేశాల్లో పరిస్థితులు దారుణంగా మారాయి. ఆస్పత్రుల్లో బెడ్లు సైతం ఖాళీ లేకుండా రోగులతో నిండిపోవడంతో అనేక మంది వైద్యం అందక చనిపోయిన ఘటనలు అనేకం. ఆలాంటి భయానక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొత్తగా వెలుగుచేసిన ఒమిక్రాన్ (Omicron) తో దేశాలన్ని అప్రమత్తమయ్యాయి. ఒమిక్రాన్ కట్టడికోసం చర్యలను వేగవంతం చేశాయి. ఒమిక్రాన్ దాదాపు ఆరు రెట్లు అధికంగా వ్యాప్తి చెందుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వ్యాప్తి మొదలైన తర్వత కొత్త కేసులు రెట్టింపు అవుతున్నాయి. కరోనా నాల్గో వేవ్ వచ్చే అవకాశముందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు.
Also Read: భారత్‌లో లక్షదిగువకు క్రియాశీల కేసులు.. మరోవైపు ఒమిక్రాన్ ఆందోళనలు
ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో చిన్నారుల్లో కరోనా ఇన్ ఫెక్షన్లు పెరుగుతుండటంపై అక్కడి సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడి వైద్య నిపుణులు మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి ప్రారంభంలో పిల్లలు పెద్దగా ప్రభావితం కాలేదనీ, వైద్యం కోసం ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం కూడా తక్కువగానే ఉన్నదని చెప్పారు. అయితే, కరోనా థర్డ్ వేవ్‌లో మాత్రం ఐదేండ్లలోపు పిల్లలు, టీనేజీల వారు ఆస్పత్రుల్లో చేరడం ఎక్కువగానే కనిపించిందని తెలిపారు. ఇక ప్రస్తుతం ఒమిక్రాన్ (Omicron) విజృంభణతో పిల్లల్లో ఇన్ ఫెక్షన్లు పెరుగుతున్నాయని తెలిపారు. కరోనా నాల్గో వేవ్ ప్రారంభమైందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్ని వయస్సుల వారు ఆస్పత్రులో చేరడం అధికమైందని చెప్పారు. ఐదేండ్లలోపు చిన్నారుల చేరికలు అధికం కావడం మరింత ఆందోళన కలిగించే విషయమని చెబుతున్నారు. ముందు ఊహించినదానికంటే భిన్న పరిస్థితులున్నాయని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్(ఎన్‌ఐసీడీ)కు చెందిని నిపుణులు చెబుతున్నారు.
Also Read: ఆర్థిక చాణక్యుడు.. అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోశయ్య
ఇదిలావుండగా, ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ గురించి పూర్తి సమాచారం ఇంకా అందుబాటులో లేదని మరికొంత మంది నిపుణులు చెబుతున్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందనీ, లోతైనా సమాచారం పొందాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నారు. ఒమిక్రాన్ పంజా విసురుతుండటంతో కేసులు పెరుగుతున్నాయి. చిన్న పిల్లలు దీని బారినపడటం ఇప్పుడే అధికమవుతోంది. వారిని పర్యవేక్షించడం వల్ల కూడా ఒమిక్రాన్‌ను ఎదుర్కొవడానికి సంబంధించిన సమాచారం లభించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించిన విషయాలపై పరిశోధనలు ఇప్పటికే ప్రారంభించామని అక్కడి సైంటిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతం చిన్న పిల్లలు, గర్భిణీల్లో ఇన్ఫెక్షన్ రేటు పెరగడానికి గల కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఒమిక్రాన్ కు సంబంధించిన సమాచారం పరిమితంగా ఉండటం కారణంగా వైరస్ కట్టడి చర్యలకు సంబంధించి స్పష్టమైన నిర్ణయానికి రాలేని పరిస్థితి ఏర్పడిందని ఆ దేశ (South Africa) వైద్యశాఖ వెల్లడించింది. అలాగే, దేశంలో కేసులు, మరణాలు క్రమంగా పెరుగుతున్నాయనీ, ప్రజలు కరోనా మార్గదర్శకాలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.
Also Read: ఆర్థిక మంత్రిగా సరికొత్త ఒరవడిని తీసుకొచ్చిన కొణిజేటి రోశయ్య.. రాజకీయ ప్రస్థానం..