Asianet News TeluguAsianet News Telugu

దక్షిణ కొరియా వైపు బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా..

ఉత్తర కొరియా మరో సారి కవ్వింపు చర్యలకు పూనుకుంది. దక్షిణ కొరియా వైపు బాలిస్టిక్ క్షిపణని ప్రయోగించింది. దీనిని దక్షిణ కొరియా సైన్యం ధ్రువీకరించింది.

North Korea launched a ballistic missile towards South Korea..
Author
First Published Oct 28, 2022, 11:37 AM IST

ఉత్తర కొరియా తన దూకుడు ధోరణని కొనసాగిస్తోంది. మరోసారి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. తన తూర్పు సముద్ర జలాల వైపు ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని దక్షిణ కొరియా పేర్కొంది. ఈ ప్రయోగం శుక్రవారం జరిగిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చెప్పారు, అయితే ఆయుధం ఎంత దూరం ప్రయాణించిందనే దానితో పాటు మరిన్ని వివరాలు ఇవ్వలేదు.

ఏపీపీఎస్సీ నిర్వహించిన అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల‌ ప్రశ్నాపత్రం లీక్.. సీబీఐ కేసు న‌మోదు

ఇటీవలి వారాల్లో ఉత్తర కొరియా చేసిన ఆయుధ పరీక్షల శ్రేణిలో తాజా ప్రయోగ ఇది. . ఉత్తర కొరియా ఈ నెలలో ఇప్పటివరకు ఏడు క్షిపణులను ప్రయోగించింది. నెల రోజుల వ్యవధిలో ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం చేయడం ఇది ఏడోసారి. దాదాపు ఐదేళ్లలో తొలిసారిగా అక్టోబరు 4వ తేదీన ఉత్తర కొరియా జపాన్ మీదుగా మధ్యశ్రేణి క్షిపణిని ప్రయోగించిన రెండు రోజుల తర్వాత, బాలిస్టిక్ క్షిపణి పరీక్ష నిర్వహించబడింది. అక్టోబర్ నెలలో అనేక సార్లు క్షిపణులను ప్రయోగించారు.

లా అండ్ ఆర్డర్ రాష్ట్రాల బాధ్య‌త‌.. ఇది దేశ ఐక్య‌త‌తో ముడిపడి ఉంది: ప్ర‌ధాని మోడీ

తాజాగా ప్రయోగం జరిగిన దక్షిణ కొరియా సముద్ర జాలాలను జపాన్ సముద్రం అని కూడా పిలుస్తారు. అయితే దక్షిణ కొరియా వార్షిక మిలిటరీ డ్రిల్‌ ను నిర్వహించడంతో దానిని ఉత్తర కొరియా దండయాత్ర రిహార్సల్‌గా భావించింది. ఈ నేపథ్యంలోనే ఉత్తర కొరియా ఇలాంటి చర్యలకు ఉపక్రమిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios