PM Modi: ప్రధాన మంత్రి న‌రేంద్ర మోడీ మాట్లాడుతూ.. "సూరజ్ కుండ్ లోని కొన‌సాగుతున్న వివిధ రాష్ట్రాల హోం మంత్రులకు చెందిన ఈ చింత న్ శివిర్ దేశ సహకార సమాఖ్య విధానానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. వివిధ రాష్ట్రాలు ఒకరి నుండి ఒకరు మెరుగైన విష‌యాలు నేర్చుకోవచ్చు.. ఒకరి నుండి ఒకరు ప్రేరణ పొందవచ్చు. దేశ శ్రేయస్సు కోసం కలిసి పనిచేయవచ్చు.. ఇది రాజ్యాంగం.. మ‌న భావ‌న‌.. మన పౌరుల పట్ల మన కర్తవ్యం" అని అన్నారు.  

Chintan Shivir-Surajkund: శాంతిభద్రతలను కాపాడటం రాష్ట్రాల బాధ్యత అనీ, అయితే లా అండ్ ఆర్డర్ దేశ ఐక్యత, సమగ్రతతో ముడిపడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అన్నారు. "వివిధ సవాళ్ల మధ్య, పండుగల సమయంలో దేశ ఐక్యతను బలోపేతం చేయడం మీ సన్నాహాలను ప్రతిబింబిస్తుంది. లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్రాల బాధ్యత, అయితే ఇవి దేశ ఐక్యత-సమగ్రతతో ముడిపడి ఉన్నాయి" అని ప్ర‌ధాని అన్నారు. హర్యానాలో జరుగుతున్న చింతన్ శివిర్ నేప‌థ్యంలో వివిధ రాష్ట్రాల‌ హోం మంత్రులను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంతులు, హోం మంత్రులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, కేంద్ర పోలీసు సంస్థల డైరెక్టర్ జనరల్స్, రాష్ట్రాల హోం కార్యదర్శులు, డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ చింతన్ శివార్ లో పాలుపంచుకుంటున్నారు. 

 ప్రధాన మంత్రి న‌రేంద్ర మోడీ మాట్లాడుతూ.. "సూరజ్ కుండ్ లోని కొన‌సాగుతున్న వివిధ రాష్ట్రాల హోం మంత్రులకు చెందిన ఈ చింత న్ శివిర్ దేశ సహకార సమాఖ్య విధానానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. వివిధ రాష్ట్రాలు ఒకరి నుండి ఒకరు మెరుగైన విష‌యాలు నేర్చుకోవచ్చు.. ఒకరి నుండి ఒకరు ప్రేరణ పొందవచ్చు. దేశ శ్రేయస్సు కోసం కలిసి పనిచేయవచ్చు.. ఇది రాజ్యాంగం.. మ‌న భావ‌న‌.. మన పౌరుల పట్ల మన కర్తవ్యం" అని అన్నారు. వివిధ రాష్ట్రాల హోం మంత్రుల రెండు రోజుల చింతన్ శివర్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలుపంచుకున్న ప్ర‌ధాని ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు. చింత‌న్ శివిర్ హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో జరుగుతోంది.

Scroll to load tweet…

ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ప్రకటన ప్రకారం, అంతర్గత భద్రత-సంబంధిత విషయాలపై విధాన రూపకల్పనకు జాతీయ దృక్పథాన్ని అందించడానికి హోం మంత్రుల చింతన్ శివిర్ ఒక ప్రయత్నంగా పేర్కొంది. పోలీసు బలగాల ఆధునీకరణ, సైబర్ క్రైమ్ మేనేజ్‌మెంట్, క్రిమినల్ న్యాయ వ్యవస్థలో ఐటీ వినియోగం పెరగడం, భూ సరిహద్దు నిర్వహణ, తీరప్రాంత భద్రత, మహిళల భద్రత, మాదకద్రవ్యాల అక్రమ రవాణా తదితర అంశాలపై హోం మంత్రుల చింత‌న్ శివిర్ చర్చించినట్లు ప్రకటనలో తెలిపారు. కాగా, హర్యానాలోని సూరజ్‌కుండ్‌లో గురువారం జరిగిన 'చింతన్ శివిర్'లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్య‌క్ష‌త వ‌హించారు. ఈ క్రమంలోనే ఆయ‌న మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీని స్ఫూర్తిగా తీసుకుని సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల వ్యాప్తి, సీమాంతర ఉగ్రవాదం వంటి సవాళ్లను దేశం ముందు ఎదుర్కొనేందుకు ఉమ్మడి వేదికగా ఈ చింతన్ శివిర్ నిర్వహిస్తున్నామని అమిత్ షా తెలిపారు.

Scroll to load tweet…