Omicron: ఒమిక్రాన్ దెబ్బకు అమెరికా విలవిల.. ఒక్కరోజే 5 లక్ష‌ల కేసులు.. పెరిగిన మ‌ర‌ణాలు

Omicron:క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ త‌న ప్ర‌తాపం చూపుతోంది. ఇటీవ‌ల వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ కార‌ణంగా మ‌ళ్లీ క‌రోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అమెరికా స‌హా ప‌లు యూర‌ప్ దేశాల్లో ప‌రిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఒక్క అమెరికాలో ఒక్క‌రోజే 5 ల‌క్ష‌ల క‌రోనా కేసులు న‌మోదుకావ‌డం అక్క‌డి ప‌రిస్థితుల‌కు అద్దం ప‌డుతోంది. 
 

New COVID-19 Cases in US Soar To Highest Levels On Record

Omicron: ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ మ‌ళ్లీ మొద‌లైంది. ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూసిన త‌ర్వాత వైర‌స్ బారిన‌ప‌డుతున్న వారి సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న‌ది. ఒమిక్రాన్ దెబ్బ‌కు అగ్ర‌రాజ్యం అమెరికా గ‌జ‌గ‌జ వ‌ణికిపోతున్న‌ది. అమెరికాలో ఒక్కరోజులో ఐదు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో స‌గానికి సైగా ద‌క్షిణాఫ్రికాలో న‌వంబ‌ర్ లో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులే కావ‌డం స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. క‌రోనా కొత్త కేసుల‌తో పాటు వైర‌స్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య సైతం పెరుగుతున్న‌ది. ఒమిక్రాన్ బారిన‌ప‌డుతున్న వారిలో రెండు డోసుల టీకాల‌తో పాటు బూస్ట‌ర్ డోలుసు సైతం తీసుకున్న వారు ఉండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. జాన్స్‌ హోప్‌కిన్స్‌ యూనివర్సిటీ  వెల్ల‌డించిన క‌రోనా వైర‌స్ వివ‌రాల ప్ర‌కారం.. గడిచిన 24 గంటల్లో అమెరికాలో 5, 12, 000 కరోనా వైరస్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో సగం కంటే ఎక్కువ క‌రోనా వైర‌స్  ఒమిక్రాన్‌ వేరియెంట్‌ కేసులు  ఉన్నాయి. అమెరికాలో క‌రోనా ప్ర‌భావం మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన గ‌రిష్ట కేసులు (ఒక్క‌రోజులో) ఇవే కావ‌డం ప్ర‌స్తుత క‌రోనా విజృంభ‌ణ‌కు అద్దం ప‌డుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు అమెరికాలో 54 మిలియన్ల కోవిడ్‌-19 కేసులు ఇప్పటిదాకా నమోదయ్యాయి. 

Also Read: Amit Shah: క‌రోనా మ‌ళ్లీ విజృంభిస్తోంది.. నిర్లక్ష్యం వహిస్తే.. మహమ్మారి నియంత్రణ కష్టమే..!

అమెరికాలో క‌రోనా వైర‌స్ వెలుగుచూసిన త‌ర్వాత ఒక్క‌రోజులోనే న‌మోదైన అత్య‌ధిక కేసులు ఈ ఏడాది జ‌న‌వ‌రి 8న 2,94,015 కేసులు వెలుగుచూశాయి. ప్ర‌స్తుతం ఆ రికార్డును బ్రేక్  చేస్తూ ఐదు ల‌క్ష‌ల‌కు పైగా కొత్త కేసులు ఒకే రోజు న‌మోద‌య్యాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఒమిక్రాన్ వేరియంటేన‌ని నిపుణులు అభిప్ర‌య‌ప‌డుతున్నారు. అమెరికా డిజీస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (CDC) వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం..  ప్రస్తుతం నమోదు అవుతున్న కేసుల్లో 58 శాతం(దాదాపు సగం కంటే ఎక్కువ) ఒమిక్రాన్‌ కేసులే ఉన్నాయి.  ఒమిక్రాన్‌ కంటే ముందు డెల్టా వేరియెంట్‌ మూలంగానే అమెరికాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం నమోదు అవుతున్న కరోనా కేసుల్లో 41 శాతం డెల్టా వేరియెంట్ కేసులు ఉన్నాయి. ఇలా ఒక‌వైపు ఒమిక్రాన్‌.. మ‌రోవైపు డెల్టా వేరియంట్లు అమెరికాపై పంజా విస‌ర‌డంతో విల‌విల్లాడుతోంది అమెరికా. క‌రోనా కార‌ణంగా చ‌నిపోతున్న వారి సంఖ్య సైతం గ‌ణ‌నీయంగా పెరుగుతున్న‌ది. గ‌త 24 గంట‌ల్లో క‌రోనా వైర‌స్ తో పోరాడుతూ 1,762 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తంగా మృతుల సంఖ్య 8,42,000 చేరింది. ఇప్ప‌టివ‌ర‌కు 4.32 కోట్ల మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం 1.9 కోట్ల యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

Also Read: Omicron: ఆ మూడు గంటలు మద్యం అమ్మకాలు ఆపండి... హైకోర్టు ఆదేశాలు

బ్రిటన్‌, ఫ్రాన్స్‌ దేశాల్లో ఒమిక్రాన్ విజృంభణ‌ కార‌ణంగా నిత్యం లక్షకు పైగా కోవిడ్‌-19 కొత్త కేసులు నమోదవుతున్నాయి. గ‌త  వారంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కేసులు 11 శాతానికి పైగా పెరిగాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభణ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే చైనా, జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి దేశాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ కరోనా కొత్త కేసులు గ‌రిష్టంగా పెరుగ్నుతూనే ఉన్నాయి. నెదర్లాండ్స్‌, స్విట్జర్లాండ్‌లు తమ దేశాల్లో ఓమిక్రాన్‌ ఇతర వేరియంట్లపై ఆధిపత్యం చెలాయిస్తూ.. పంజా విసురుతున్నదనీ, ఇతర వేరియంట్ల కేసులు తక్కువగా నమోదవుతున్నాయని ఆ దేశాల నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే హెచ్చరించిన డబ్ల్యూహెచ్‌వో అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాల‌నీ, ప్రజలు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలని సూచించింది. కరోనా వైరస్‌ డెల్టా వేరియంట్‌ కంటే ఒమిక్రాన్‌ వేరియంట్‌ రెండు నుంచి మూడు రోజుల్లోనే రెట్టింపు వేగంతో  వృద్ధి చెందుతున్నదని గ‌ణాంకాలు పేర్కొంటున్నాయి. ఆస్పత్రిలో చేరే అవసరం తక్కువగానే ఉందని పలు అధ్యయాలు పేర్కొన్నాయి కానీ, ఒమిక్రాన్‌ తీవ్రతను తెలుసుకోవడానికి మరింత డేటా అవసరముందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.

Also Read: పోలవరం ప‌నుల‌పై కేంద్ర జల్‌ శక్తి శాఖ కమిటీ సంతృప్తి.. నేడు కుడికాలువ ప‌నుల ప‌రిశీల‌న

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios