అమెరికా గగనతలంలో ఇప్పటి వరకు నాలుగు ఎగిరే వస్తువులను ఆ దేశ మిలటరీ కాల్చివేసింది. అయితే మొదటి దానితో పాటు మిగితావి కూడా చైనా నుంచే వచ్చాయని యూఎస్ చెబుతోంది. ఈ నేపథ్యంలో చైనా అమెరికాపై సంచలన ఆరోపణలు చేసింది. గతేడాది ప్రారంభం నుంచి యూఎస్ తమ దేశ గగనతలంలోకి 10 కంటే ఎక్కువ సార్లు అక్రమంగా బెలూన్లను పంపించిందని తెలిపింది.
చైనా కు చెందిన నిఘా క్రాఫ్ట్ ను అమెరికా గగనతలంలో కూల్చివేశామని యూఎస్ ఈ నెల మొదటి వారంలో తెలిపింది. అయితే అది నిఘా కోసం కాదని, పౌర ప్రయోజనాల కోసం ఉద్దేశించినదని చైనా వాదించింది. దీంతో అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయి. కాగా ఫిబ్రవరి నాలుగో తేదీ నుంచి ఇప్పటి వరకు అలాంటి బెలూన్ లను నాలుగింటిని అమెరికా కూల్చివేసింది. కానీ అందులో మొదటిది మాత్రమే తమ దేశానిదని చైనా చెప్పింది.
ఈ క్రమంలో చైనా మరో వాదనను ముందుకు తెచ్చింది. జనవరి 2022 నుండి అమెరికా తమ గగనతలంలోకి 10 బెలూన్‌లను పంపిందని సోమవారం తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ ఓ బ్రీఫింగ్ సందర్భంగా వెల్లడించారు. ఇతర దేశాల గగనతలంలోకి అమెరికా అక్రమంగా ప్రవేశించడం అసాధారణమేమీ కాదని అన్నారు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు చైనా అధికారుల అనుమతి లేకుండానే అమెరికా బెలూన్లు 10 సార్లు చైనాపైకి అక్రమంగా ఎగిరివచ్చాయని తెలిపారు.
అవి ఏలియెన్సా? కాదని చెప్పలేం.. అమెరికా ఎయిర్ ఫోర్స్ జనరల్ కీలక వ్యాఖ్యలు
ఆ చొరబాట్లపై చైనా ఎలా స్పందిస్తుందన్న ప్రశ్నకు వాంగ్ సమాధానమిస్తూ.. బీజింగ్ వ్యవహరించిన తీరు బాధ్యతాయుతంగా, ప్రొఫెషనల్ గా ఉందన్నారు. ‘‘చైనా గగనతలంలోకి అక్రమంగా ప్రవేశించిన అమెరికా హై ఆల్టిట్యూడ్ బెలూన్ల గురించి మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే, మీరు అమెరికాను ప్రశ్నించాలని నేను సూచిస్తున్నాను’’ అని ఆయన వెల్లడించారు.
ఫిబ్రవరి 4న కూల్చివేసిన చైనా 'గూఢచారి' బెలూన్ పై ఎట్టకేలకు బీజింగ్ తో సంప్రదింపులు జరిపినట్లు అమెరికా అధికారులు పేర్కొన్న కొద్దిసేపటికే చైనా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ విషయంపై కమ్యూనికేట్ చేయడానికి పెంటగాన్ (అమెరికా డిఫెన్స్ డిపార్ట్ మెంట్) చేసిన ప్రయత్నాలు రోజుల తరబడి విఫలమయ్యాయని రక్షణ అధికారి ఒకరు చెప్పారు.
జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు మార్గం సుగమం.. డీలిమిటేషన్‌పై దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
బెలూన్ కాల్పులు జరిగిన తర్వాత పెంటగాన్ చీఫ్ లాయిడ్ ఆస్టిన్, ఆయన సహచరుడి మధ్య సురక్షితమైన సమావేశం కోసం చేసిన అభ్యర్థనను బీజింగ్ తిరస్కరించిందని అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి మంగళవారం పేర్కొన్నారు. ‘‘ఫిబ్రవరి 4, శనివారం, పీఆర్సీ బెలూన్ ను కూల్చడానికి చర్యలు తీసుకున్న వెంటనే కార్యదర్శి ఆస్టిన్, జాతీయ రక్షణ మంత్రి వీ ఫెంఘే మధ్య సురక్షితమైన కాల్ కోసం డీఓడీ అభ్యర్థనను సమర్పించింది’’ అని బ్రిగేడియర్ జనరల్ పాట్ రైడర్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ‘‘దురదృష్టవశాత్తూ మా అభ్యర్థనను పీఆర్సీ తిరస్కరించింది. కమ్యూనికేషన్ ఓపెన్ లైన్లకు మా నిబద్ధత కొనసాగుతుంది’’ అని రైడర్ తెలిపారు.
కాగా.. తాజాగా కూడా అమెరికా-కెనడా సరిహద్దులోని మిచిగాన్ ఎగువ ద్వీపకల్పం, హురాన్ సరస్సు గగనతలంపై ఎగురుతున్న వస్తువును అమెరికా కూల్చివేసింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆదేశాల ప్రకారం జరిగాయని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఆ అధికారి ‘రాయిటర్స్’తో తెలిపినట్టు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. యూఎస్-కెనడా సరిహద్దులోని హురాన్ సరస్సుపై స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:42 గంటలకు యూఎస్ ఎఫ్-16 యుద్ధ విమానం ఆ వస్తువును కూల్చివేసిందని పెంటగాన్ ప్రతినిధి పాట్రిక్ రైడర్ అధికారిక ప్రకటనలో తెలిపారు.
వాలెంటైన్స్ డే గిఫ్ట్ పేరుతో 51యేళ్ల మహిళకు రూ. 3.68 లక్షలు టోకరా..
కాగా.. ఈ ఎగిరే వస్తువు సైనిక ముప్పును కలిగి లేనప్పటికీ 20,000 అడుగుల (6,100 మీ) వద్ద ప్రయాణించడం వల్ల దేశీయ విమాన రాకపోకలకు అంతరాయం కలిగించింది. ఇది నిఘా కోసం ఉపయోగపడకపోవచ్చని ‘ది పెంటగాన్ (యూఎస్ డిఫెన్స్ డిపార్ట్ మెంట్)’ తెలిపింది. ఈ వస్తువు అష్టభుజి ఆకారంలో ఉంది. దీనికి తీగలు వేలాడుతున్నాయి కానీ ఎలాంటి పేలోడ్ ను అధికారులు గుర్తించలేదు. ఈ వస్తువు ఇటీవల మోంటానాలో సున్నితమైన సైనిక ప్రదేశాలకు సమీపంలో గుర్తించారు.
