జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించేందుకు సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. డీలిమిటేషన్‌ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. ఎన్నికల సంఘం సమ్మతితో డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేసే హక్కు, అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని తెలిపింది.

జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికలకు మార్గం సుగమం అయింది. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌లోని అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన కోసం డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ అభయ్ ఎస్ ఓక్ ధర్మాసనం తీర్పు వెలువరించింది. జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ ప్రక్రియను సమర్థించింది.

భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం.. హెచ్చరించాడని ప్రియుడితో కలిసి చంపేసిన భార్య..

శ్రీనగర్ కు చెందిన హాజీ అబ్దుల్ ఘనీఖాన్, మహ్మద్ అయూబ్ మట్టు తమ పిటిషన్‌లో డీలిమిటేషన్‌లో సరైన విధానాన్ని పాటించలేదని పేర్కొన్నారు. జూలై 2004లో డీలిమిటేషన్ కమిషన్ జారీ చేసిన లేఖ ప్రకారం మొదటి జనాభా లెక్కలు జరిగే వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ సీట్ల సంఖ్యను మార్చలేమని తమ పిటిషన్‌లో వాదించారు. 2026 తర్వాత నిర్వహించవచ్చని తెలిపారు. అయితే కాగా కేంద్ర ప్రభుత్వం, జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్, ఎన్నికల సంఘం ఈ వాదనను తప్పు అని వాదించాయి.

అమెరికాలో తెలుగు బాలిక అదృశ్యం.. నెల రోజులుగా వెతుకుతున్న తల్లిదండ్రులు..

అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్‌లలో గత 51 సంవత్సరాలుగా డీలిమిటేషన్ కసరత్తు జరగలేదని వారు వాదించారు. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 ప్రకారం.. డీలిమిటేషన్ కసరత్తును నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ కు మాత్రమే అధికారం కలిగి ఉందని తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌లోని అసెంబ్లీ సీట్ల విభజన కోసం ఏర్పాటు చేసిన కమిషన్ రాజ్యాంగ నిబంధనల ప్రకారం సరైనది కాదని వాదించారు.

ఎల్‌టీటీఈ నేత ప్రభాకరన్ బ్రతికే ఉన్నారు.. ప్రజల ముందుకు వస్తారు: నెడుమారన్ సంచలన వెల్లడి

కాగా.. మెహబూబ్ ముఫ్తీకి చెందిన పీడీపీ సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ 2018 జూన్ లో వైదొలిగింది. దీంతో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రపతి పాలనలోనే ఉంది. అయితే మార్చి 6, 2020న కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చట్టం- 2002లోని సెక్షన్ 3 కింద అధికారాన్ని అమలు చేస్తూ డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి (రిటైర్డ్) రంజన ప్రకాష్ దేశాయ్ చైర్‌పర్సన్‌గా కమిషన్ ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

నువ్వు చాలా రిచ్చు గురూ.. పెళ్లికి వెళ్లడానికి మొత్తం విమానాన్నే బుక్ చేసిన వరుడు..

అయితే డీలిమిటేషన్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దు మారింది. అందులో కొత్త ప్రాంతాలను చేర్చారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 24 సీట్లతో కలిపి 107 సీట్లను 114కు పెంచారు. దీనిని సవాలు చేస్తు పలువురు పిటిషనర్లు సుప్రీకోర్టుకు వెళ్లారు. తాజాగా సుప్రీంకోర్టు దీనిపై తీర్పు వెలువరించింది. ఎన్నికల సంఘం సమ్మతితో డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేసే హక్కు, అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని పేర్కొంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన హక్కులను సక్రమంగా వినియోగించుకుందని చెప్పింది.