ఖలిస్తాన్ వేర్పాటువాది సుఖ్దూల్ సింగ్ దారుణ హత్య.. కెనడాలో ఘటన

ఖలిస్తానీ వేర్పాటువాది, గ్యాంగ్ స్టర్ సుఖ్దూల్ సింగ్ కెనడాలో దారుణ హత్యకు గురయ్యాడు. పంజాబ్ లోని మోగా జిల్లాకు చెందిన అతడిని గుర్తు తెలియని దుండుగులు కాల్చి చంపారు. భారత్ లో పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడు.. 2017లో కెనడాకు పారిపోయాడు.

Khalistan separatist Sukhdul Singh brutal murder.. Incident in Canada..ISR

ఖలిస్తాన్ వేర్పాటువాది సుఖ్దూల్ సింగ్ అలియాస్ సుఖా దునేకే దారుణ హత్యకు గురయ్యారు. పంజాబ్ లోని మోగా జిల్లాకు చెందిన అతడు కెనడాలో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. అతడు మోగా జిల్లాలోని దవీందర్ బాంబిహా గ్యాంగ్ కు చెందిన గ్యాంగ్ స్టర్ గా గుర్తింపు పొందాడు. అతడు కెనడాలోని విన్నిపెగ్ లో ఆయన హత్యకు గురయ్యాడని ‘టైమ్స్ నౌ’ కథనం పేర్కొంది. అయితే రెండు నెలల క్రితం ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో ఈ హత్యకు పోలికలు ఉన్నాయి.

ప్రేమించిన ప్రభాకర్ రెడ్డి కోసమే గోవా నుంచి డ్రగ్స్ - కస్టడీలో రోదిస్తూ చెప్పిన అనురాధ

సుఖ్దూల్ సింగ్ 2017లో భారత్ నుంచి కెనడాకు పారిపోయాడు అతనిపై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. అతడు ఖలిస్తాన్ వేర్పాటువాది అర్ష్దీప్ సింగ్ అలియాస్ అర్ష్ దాలాకు సహాయకుడని కొన్ని వార్తా కథనాలు చెబుతున్నాయి. ఖలిస్థాన్ సంస్థల వైపు మొగ్గు చూపుతూ సుపారీ హత్యలకు పాల్పడినట్లు కూడా తెలుస్తోంది. అతడు నకిలీ పాస్ పోర్టుతో వెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి.

‘భర్తను విడిచిపెట్టి వచ్చేయ్.. రూ.10 లక్షలైనా ఇవ్వు.. లేకపోతే మన ఇద్దరి ప్రైవేటు వీడియోలు రిలీజ్ చేస్తా’

గత ఏడాది మార్చి 14న కబడ్డీ ప్లేయర్ సందీప్ సింగ్ నంగల్ హత్యకు సుఖ్దూల్ సింగ్ కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయి. డెనెక్ పై పంజాబ్, ఇతర రాష్ట్రాల్లో కనీసం 20 క్రిమినల్ కేసులు నమోదైనట్లు పలు వార్తా సంస్థలు నివేదించాయి. ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత ఏజెంట్లకు సంబంధం ఉందని ఇప్పటికే కెనడా ఆరోపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ హత్య వెలుగులోకి వచ్చింది.

విషాదం.. ఇంజెక్షన్ వికటించి రిటైర్డ్ కానిస్టేబుల్ మరణం..హన్మకొండలో ఘటన

ఈ ఏడాది జూన్ లో జరిగిన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత్ తో సంబంధం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయని, ఈ ఆరోపణలపై తమ దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని జస్టిన్ ట్రూడో ఇటీవల పేర్కొన్నారు. దీంతో భారత్-కెనడా సంబంధాలు చారిత్రాత్మక స్థాయికి చేరుకున్నాయి. ఆ దేశంలో ఉన్న భారత దౌత్యవేత్తను తొలగించింది. దీనికి ప్రతిచర్యగా భారత్ లో ఉన్న కెనడా దౌత్యవేత్తను కూడా దేశం విడిచి వెళ్లిపోవాలని భారత్ ఆదేశించింది.  కాగా.. యూఏపీఏ చట్టం కింద చర్యలు ఎదుర్కొంటున్న హర్దీప్ సింగ్ నిజ్జర్ ను బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో జూన్ 18న కాల్చి చంపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios