విషాదం.. ఇంజెక్షన్ వికటించి రిటైర్డ్ కానిస్టేబుల్ మరణం..హన్మకొండలో ఘటన
డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్లు వికటించడతో ఓ పదవీ విరమణ పొందిన కానిస్టేబుల్ మరణించారు. ఈ ఘటన హన్మకొండ జిల్లాలోని హసన్ పర్తి లో వెలుగులోకి వచ్చింది. అధికారులు ఆ హాస్పిటల్ కు చేరుకొని, విచారణ జరిపి దానికి సీజ్ వేశారు.
ఆయనో రిటైర్డ్ కానిస్టేబుల్. ఒంట్లో బాగా లేకపోవడంతో స్థానికంగా ఉన్న ఓ హాస్పిటల్ కు వెళ్లారు. అక్కడి డాక్టర్లు పరీక్షలు నిర్వహించి, రెండు ఇంజెక్షన్లు ఇచ్చారు. అయితే అవి వికటించి ఆయన మరణించారు. ఈ ఘటన హన్మకొండ జిల్లాలోని హసన్ పర్తి మండల కేంద్రంలో జరిగింది. దీంతో అధికారులు ఆ హాస్పిటల్ ను సీజ్ చేశారు.
అజ్ఞానులుగా అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు.. : ప్రధాని మోడీపై కేటీఆర్, హరీశ్ రావు ఫైర్
వివరాలు ఇలా ఉన్నాయి. హసన్‌పర్తి మండలం చింతగట్టు గ్రామానికి చెందిన 65 ఏళ్ల సారయ్య కానిస్టేబుల్ గా పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. ఆయనకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో సోమవారం హసన్‌పర్తిలో ఉన్న శంకర్ హాస్పిటల్ కు వచ్చారు. అక్కడున్న డాక్టర్ శంకర్ వైద్య పరీక్షలు చేపట్టారు. తరువాత రెండు ఇంజెక్షన్లు ఇచ్చారు. దీంతో ఆయన ఉన్నట్టుండి ఒక్క సారిగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు.
రామగుండం రియల్టర్ హత్యకేసులో ట్విస్ట్... చంపింది అబ్బాయేనట..! (వీడియో)
108 అంబులెన్స్ అక్కడికి చేరుకుంది. అందులో సిబ్బంది ఆ డాక్టర్ శంకర్ ను ను బాధితుడికి ఇచ్చిన మందుల ప్రిస్కిప్షన్ ఇవ్వాలని కోరారు. కొంత సమయంలోనే అక్కడికి చేరుకున్న మృతుడి కుమారులు ఆ డాక్టర్ పై దాడి చేశారు. తరువాత ఆ డాక్టర్ ను కూడా అంబులెన్స్ లోనే ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సారయ్య మరణించాడని డాక్టర్లు ప్రకటించారు. ఈ సమయంలో డాక్టర్ శంకర్ అక్కడి నుంచి పారిపోయాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
1998 నాటి తీర్పును సమీక్షిస్తాం..: సుప్రీం కోర్టు కీలక ప్రకటన
కాగా.. ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు డిప్యూటీ డీఎంహెచ్‌ఓ మధన్‌మోహన్, సీఐ గోపి లు హాస్పిటల్ కు చేరుకున్నారు. డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్ ఏంటని అడిగి తెలుసుకున్నారు. అలాగే హాస్పిటల్ లో ని పలు విభాగాలను పరిశీలించారు. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఇంజక్ష్లన్లు, మందులు ఉన్నట్టు గుర్తించారు. అనంతరం రెవెన్యూ అధికారులు కూడా అక్కడికి చేరుకొని హాస్పిటల్ ను సీజ్ చేశారు.