కెనడాలోని బ్రాంప్టన్‌లో ‘శ్రీ భగవద్గీత’ పార్కు ధ్వంసం పట్ల భారత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. 

కెనడాలోని బ్రాంప్టన్‌లో ఇటీవల ఆవిష్కరించిన ‘శ్రీ భగవద్గీత’ పార్కు విధ్వంసాన్ని ఆదివారం భారత్ ఖండించింది, ఈ ఘటనపై విచారణ జరిపి విద్వేషపూరిత నేరాలకు పాల్పడిన వారిపై అభియోగాలు మోపాలని అధికారులను కోరింది. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిని ‘‘ద్వేషపూరిత నేరం’’గా పేర్కొంటూ.. కెనడాలోని భారత హైకమిషన్ ఈ విషయంపై విచారణకు డిమాండ్ చేసింది.

ఇంకా చీక‌ట్లోనే పుదుచ్చేరి.. లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం నివాసాలకూ ప‌వ‌ర్ నిలిపివేత‌..

‘‘బ్రాంప్టన్‌లోని శ్రీ భగవద్గీత పార్క్ వద్ద జరిగిన ద్వేషపూరిత నేరాన్ని మేము ఖండిస్తున్నాం. కెనడియన్ అధికారులు, పీల్ పోలీసులను విచారించి, నేరస్థులపై సత్వర చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము ’’ అని ఒట్టావాలోని భారత హైకమిషన్ ఒక ట్వీట్‌లో పేర్కొంది.

దుర్గా పూజ మండ‌పంలో అగ్నిప్రమాదం.. 12 ఏళ్ల బాలుడు మృతి, 52 మందికి గాయాలు

గతంలో ట్రాయర్స్ పార్క్ అని పిలిచే ఈ పార్కుకు శ్రీ భగవద్గీత పార్కుగా నామకరణం చేసి సెప్టెంబర్ 28న ఆవిష్కరించారు. కాగా.. ఆదివారం తెల్లవారుజామున ఈ విధ్వంసం వార్తలను బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ ధృవీకరించారు. ఈ ఘటనను ఖండించారు. ‘‘ ఇటీవల ఆవిష్కరించిన శ్రీ భగవద్గీత పార్కు గుర్తును ధ్వంసం చేశారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల మాకు ఎలాంటి స‌హ‌నం లేదు’’ అని పేర్కొన్నారు. తదుపరి విచారణ కోసం మేము పీల్ ప్రాంతీయ పోలీసులకు సమాచారం చేరవేశామని అన్నారు. మా ఉద్యానవన విభాగం వీలైనంత త్వరగా గుర్తును పరిష్కరించి సరిచేయడానికి పని చేస్తోందని పేర్కొన్నారు. 

కెన‌డాలో ద్వేషపూరిత నేరాలు, భారత వ్యతిరేక కార్యకలాపాలు జ‌రుగుతున్నాయ‌ని, అక్క‌డ నివ‌సించే భార‌తీయులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌లు జారీ చేసిన 10 రోజుల తర్వాతే ఈ ఘటన జరిగింది.

కుండపోత వానలోనూ రాహుల్ గాంధీ ప్రసంగం.. వర్షమే కాదు, మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరంటూ వ్యాఖ్యలు

ద్వేషపూరిత నేరాలు, మతపరమైన హింస, భారత వ్యతిరేక కార్యకలాపాల సంఘటనలను కెనడాతో చర్చించామని, దర్యాప్తు, చర్యలు తీసుకోవాలని కోరినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. కెనడాలో ఇప్పటి వరకు ఈ నేరాలకు పాల్పడిన వారిని శిక్షించలేదని, వారు న్యాయ‌స్థానం ముందుకు రాలేద‌ని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Scroll to load tweet…

కెనడాలో 1.6 మిలియన్ల మంది భారతీయ మూలాలున్న వారు, ప్రవాస భారతీయులు నివసిస్తున్నారు. ఈ ఏడాది దేశంలో కనీసం రెండు హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. సెప్టెంబరు 15వ తేదీన భారతదేశ వ్యతిరేక గ్రాఫిటీతో ఒక ఆలయాన్ని అపవిత్రం చేశారు.