Asianet News TeluguAsianet News Telugu

దుర్గా పూజ మండ‌పంలో అగ్నిప్రమాదం.. 12 ఏళ్ల బాలుడు మృతి, 52 మందికి గాయాలు

యూపీలో ఘోరం జరిగింది. ఓ దుర్గా మండపంలో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 52 మందికి వరకు గాయపడ్డారు. ఒక బాలుడు చనిపోయాడు. 

12-year-old boy killed, 52 injured in fire at Durga Puja Mandapam
Author
First Published Oct 3, 2022, 7:51 AM IST

దేవీ న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన దుర్గా మండపంలో అగ్నిప్ర‌మాదం సంభవించింది. ఈ ఘ‌ట‌న‌లో 12 ఏళ్ల బాలుడు చ‌నిపోయాడు. మ‌రో 52 మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

కుండపోత వానలోనూ రాహుల్ గాంధీ ప్రసంగం.. వర్షమే కాదు, మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరంటూ వ్యాఖ్యలు

వివ‌రాలు ఇలా ఉన్నాయి. భదోహి జిల్లాలోని ఔరై పట్టణంలోని ఓ దుర్గా మండ‌పంలో ఆదివారం రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో హారతి ఇస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి దాదాపు 150 మంది వ‌ర‌కు హాజ‌ర‌య్యారు. అయితే ఒక్క సారిగా ఆ మండ‌పం వ‌ద్ద మంట‌లు చెల‌రేగాయి. ఈ అగ్నిప్రమాదంలో 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. 52 మంది గాయాలు కాగా.. ఇందులో 22 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారంద‌రినీ చికిత్స కోసం వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్ యూ) ట్రామా సెంటర్ కు తరలించారు.

యూపీలో ఘోర అగ్ని ప్ర‌మాదం.. నలుగురి మృతి.. 60 మందికి పైగా గాయాలు

వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ‘‘ రాత్రి 9 గంటల సమయంలో భదోహిలోని దుర్గాపూజ పండల్ వద్ద మంటలు చెలరేగాయి. 10-15 మంది గాయపడ్డారు. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించాం’’ అని భదోహి ఎస్పీ అనిల్ కుమార్ తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. దీనిపై విచారణ జరుగుతోంది.

భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం.. వైమానిక దళంలో చేర‌నున్న లైట్ కంబాట్ హెలికాప్టర్లు

అయితే బీహెచ్ యూ ట్రామా సెంటర్ లో చికిత్స పొందుతున్న బాధితుల శరీరంపై 30-40 శాతం కాలిన గాయాలు ఉన్నాయ‌ని భదోహి డీఎం గౌరంగ్ రాఠీ పేర్కొన్నారు. ప్రాథ‌మికంగా ఈ ఘ‌ట‌న షార్ట్ సర్క్యూట్ వ‌ల్ల సంభవించింద‌ని తెలుస్తోంద‌ని, దీనిపై ద‌ర్యాప్తు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించాన‌ని తెలిపారు. ‘‘ ప్రస్తుతానికి, క్షతగాత్రులకు చికిత్స చేయడమే మా ప్రాధాన్యత. వారణాసిలోని వైద్యులతో నేను టచ్ లో ఉన్నాను’’ అని ఆయన పేర్కొన్నారు.

కాగా.. ఈ ఘటనపై వారణాసి పోలీస్ కమిషనర్ ఎ సతీష్ గణేష్ మాట్లాడుతూ.. అగ్నిప్రమాద బాధితులను బీహెచ్ యూ ట్రామా సెంటర్ కు తీసుకువస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. దీంతో వెంటనే బాధితులను ఇబ్బంది లేకుండా, త్వరగా హాస్పిటల్ కు తరలించాలనే ఉద్దేశంతో గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios