Asianet News TeluguAsianet News Telugu

కుండపోత వానలోనూ రాహుల్ గాంధీ ప్రసంగం.. వర్షమే కాదు, మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరంటూ వ్యాఖ్యలు

భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతోంది. అయితే ఆదివారం రాత్రి మైసూర్ ఓ భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుండగా ఆకస్మాత్తుగా భారీ వర్షం ప్రారంభమైంది. అయినా ఆయన తన ప్రసంగాన్ని నిలిపివేయలేదు. ఈ వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. 

Rahul Gandhi's speech even in torrential rain.. Comments that no one can stop us even rain
Author
First Published Oct 3, 2022, 6:55 AM IST

కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర బీజేపీ పాలిత కర్ణాటకకు రాష్ట్రానికి చేరుకుంది. ఆదివారం మైసూరులో ఏపీఎంసీ మైదానంలో జరిగిన భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేశారు. ఈ స‌భ‌కు వేలాది మంది త‌ర‌లివ‌చ్చారు. ఈ స‌భ‌ను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్ర‌సంగిస్తుండ‌గా.. ఒక్క సారిగా కుండ‌పోత వ‌ర్షం ప్రారంభ‌మైంది. అయితే అంత భారీ వ‌ర్షంలోనూ ఆయ‌న త‌న ప్ర‌సంగాన్ని ఆపలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 

యూపీలో ఘోర అగ్ని ప్ర‌మాదం.. నలుగురి మృతి.. 60 మందికి పైగా గాయాలు

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ కు వెళ్తుందని, దానిని ఎవరూ ఆపలేరని చెప్పారు. హింస, అబద్ధాల రాజకీయాల మధ్య అహింస, స్వరాజ్యం అనే సందేశాన్ని ఈ మార్చ్ వ్యాప్తి చేస్తుందని ఆయ‌న నొక్కి చెప్పారు. ‘ భారతదేశాన్ని ఏకం చేయకుండా మమ్మల్ని ఎవరూ ఆపలేరు. భారతదేశం స్వరాన్ని పెంచకుండా మమ్మల్ని ఎవరూ ఆపలేరు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ కు వెళ్తాం. భారత్ జోడో యాత్రను ఎవ‌రూ ఆప‌లేరు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 

భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం.. వైమానిక దళంలో చేర‌నున్న లైట్ కంబాట్ హెలికాప్టర్లు

వర్షంలో తడుస్తున్న ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘ బీజేపీ, ఆరెస్సెస్‌లు వ్యాప్తి చేస్తున్న విద్వేషాలకు వ్యతిరేకంగా నిలవడమే భారత్ జోడో యాత్ర లక్ష్యం. ఈ ప్రయాణం కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు నడుస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆగదు. ఈ వర్షం కూడా మనల్ని ఆపదు. ’’ అని అన్నారు.

కాగా అంతకు ముందు రాహుల్ గాంధీ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. 1927, 1932లో మహాత్మా గాంధీ ఈ కేంద్రాన్ని సందర్శించ‌డం గమనార్హం.  ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నవారు మహాత్మాగాంధీ వారసత్వాన్ని పట్టుకోవడం సులభమని, కానీ ఆయన మార్గంలో నడవడం కష్టమని అన్నారు. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ సెంటర్‌లో జరిగిన ప్రార్థనా సమావేశానికి రాహుల్ హాజరై మహిళా నేత కార్మికులతో మాట్లాడారు. మహాత్మా గాంధీని చంపిన సిద్ధాంతం గత ఎనిమిదేళ్లలో అసమానతలను, విభజనను, కష్టపడి సంపాదించుకున్న స్వేచ్ఛను హరించివేసిందని అన్నారు. అనంత‌రం మైసూరు సమీపంలోని బదనవాలు గ్రామానికి వెళ్లి శ్రమదానం చేశారు. అక్క‌డి గ్రామస్తులతో మమేకమయ్యారు. 

మ‌రో పంజాబీ సింగ‌ర్ పై హ‌త్యాయ‌త్నం.. రాపర్ హనీ సింగ్ భావోద్వేగ పోస్టు.. !

కాగా.. కాంగ్రెస్ తలపెట్టిన ఈ భార‌త్ జోడో యాత్ర ఐదు నెలల్లో 12 రాష్ట్రాల‌ను సంద‌ర్శించాల‌ని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఈ యాత్ర గ‌త శుక్ర‌వారం కర్ణాటకకు చేరుకుంది. ఈ రాష్ట్రంలో మొత్తంగా 21 రోజుల పాటు ఈ యాత్ర కొన‌సాగుతుంది. ఈ పాదయాత్ర ప్ర‌తీ రోజు 25 కిలో మీట‌ర్ల పాటు కొన‌సాగుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios