Asianet News TeluguAsianet News Telugu

ఇంకా చీక‌ట్లోనే పుదుచ్చేరి.. లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం నివాసాలకూ ప‌వ‌ర్ నిలిపివేత‌..

విద్యుత్ పంపిణీని ప్రైవేటీకరించాలనే కేంద్ర పాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరి నిర్ణయాన్ని అక్కడి విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు వ్యతిరేకిస్తున్నారు. ఐదు రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. 

Puducherry is still in the dark.. Lt. Governor and CM's residences are also without power..
Author
First Published Oct 3, 2022, 8:52 AM IST

విద్యుత్ సంస్థలను ప్రైవేటీక‌రించ‌డం నిలిపివేయాలంటూ విద్యుత్ ఉద్యోగులు, ఇంజ‌నీర్లు పుదుచ్చేరిలో చేప‌ట్ట‌న‌ నిర‌స‌న‌లు 5 రోజులుగా కొన‌సాగుతున్నాయి. దీంతో ఆ కేంద్ర పాలిత ప్రాంతం ఇప్ప‌టికీ చీక‌ట్లోనే మ‌గ్గుతోంది. ఈ నిర‌స‌న‌ల‌ను ఆదివారం ఉద్యోగులు తీవ్ర‌త‌రం చేశారు. 

దుర్గా పూజ మండ‌పంలో అగ్నిప్రమాదం.. 12 ఏళ్ల బాలుడు మృతి, 52 మందికి గాయాలు

అందులో భాగంగా లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం ఇళ్ల‌కు కూడా క‌రెంటు స‌ర‌ఫ‌రాను నిలిపివేశారు. ఈ సంద‌ర్భంగా ఉద్యోగులు పుదుచ్చేరిలోని అనేక ప్రాంతాల్లో ధ‌ర్నాకు దిగారు. సమస్యకు పరిష్కారం చూపని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిర‌స‌న‌లు ఉధృతం కావ‌డంతో సీఎం, లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ లు కేంద్ర బ‌ల‌గాల‌ను మోహ‌రించారు.కేంద్ర పాలిత ప్రాంతంలో పవర్ లేకపోవడంతో  లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్ర ప్రభుత్వం పై సామాన్యులు మండిప‌డుతున్నారు. దీంతో విద్యుత్ ఉద్యోగులకు, ఇంజ‌నీర్స్ కు మద్దతు తెలుపుతూ ప్ర‌జ‌లు నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు. 

ఈ ప్రాంతంలో విద్యుత్ ప్రైవేటీకరణ అపకపోతే ఉద్యమం ఉదృతం చేస్తాం ప్ర‌జ‌లు, ఉద్యోగులు హెచ్చ‌రిస్తున్నారు. పుదుచ్చేరి విద్యుత్ ఇంజనిర్స్ మద్దతుగా నేషనల్ పవర్ కో ఆర్డినేషన్ కమిటీ కూడా నిలిచింది. ఆదివారం వివిధ ప్రాంతాల్లో నిర‌స‌న తెలుపుతున్న 500 మంది విద్యుత్ ఇంజనీర్లు, ఉద్యోగులను కేంద్ర బ‌ల‌గాలు బ‌ల‌వంతంగా అరెస్టు చేశాయి. అనంత‌రం వారిని కోర్టులో హాజ‌రుప‌ర్చారు.

కుండపోత వానలోనూ రాహుల్ గాంధీ ప్రసంగం.. వర్షమే కాదు, మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరంటూ వ్యాఖ్యలు

యితే కోర్టులో కూడా ఉద్యోగులు నిర‌స‌న తెలిపారు. అక్రమ అరెస్ట్ లు అపాలంటూ, కేంద్ర ప్ర‌భుత్వానికి, లెఫ్ట‌నెంట్ గ‌వ‌ర్న‌ర్ కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. కాగా.. విద్యుత్ పంపిణీని ప్రైవేటీకరించడానికి టెండర్‌ల‌ను పిల‌వడంతో పుదుచ్చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యుత్ శాఖ ఉద్యోగులు సెప్టెంబర్ 28 బుధవారం తమ నిరసనను ప్రారంభించారు, 

భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం.. వైమానిక దళంలో చేర‌నున్న లైట్ కంబాట్ హెలికాప్టర్లు

20,000 మందికి పైగా కార్మికులు నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. వారికి ప్ర‌జ‌ల నుంచి కూడా మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెన‌క్కి తీసుకోవాల‌ని, సిబ్బందికి ప్ర‌భుత్వ ఉద్యోగులుగా హోదా క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా విద్యుత్ సిబ్బంది ఆక‌స్మికంగా స‌మ్మెలోకి దిగ‌డంతో కొన్ని స‌బ్ స్టేష‌న్ ల‌లో తాత్కాలిక ఉద్యోగుల‌ను నియ‌మించారు. అయితే వారిపై దాడి జ‌రిగే అవ‌కాశం ఉండ‌టంతో కీల‌క‌మైన స‌బ్ స్టేష‌న్ ల‌లో భ‌ద్ర‌తను పెంచారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios