Asianet News TeluguAsianet News Telugu

ఘోరం..బస్ స్టాప్ లో నిలబడి ఉన్నవారిపైకి దూసుకెళ్లిన కారు, ఏడుగురు మృతి, 10 మందికి గాయాలు.. ఎక్కడంటే ? (వీడియో)

బస్సు స్టాప్ లో నిలబడి ఉన్న వారిపైకి ఓ కారు వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. పది మందికి గాయాలు అయ్యాయి. ఈ విషాదం అమెరికాలోని టెక్సాస్ లో చోటు చేసుకుంది. 

Horrific..the car rammed into the people standing at the bus stop, killing seven people and injuring 10 people..where? (video)..ISR
Author
First Published May 8, 2023, 8:38 AM IST

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ బస్ స్టాప్ లోకి కారు దూసుకెళ్లింది. దీంతో అందులో నిలబడి ఉన్న ఏడుగురు ప్రయాణికులు మరణించారు. 10 మందికి గాయాలు అయ్యాయి. దీంతో డ్రైవర్ ను అరెస్టు చేశారు. మెక్సికన్ సరిహద్దు సమీపంలోని బ్రౌన్స్ విల్లే నగరంలో ఆదివారం (స్థానిక కాలమానం ప్రకారం) తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. 

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఎదురు కాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు హతం

బిషప్ ఎన్రిక్ శాన్ పెడ్రో ఓజానమ్ సెంటర్ అనే స్వచ్ఛంద సంస్థ కు సమీపంలోని ఓ బస్ స్టాప్ లో వేచి ఉన్న పలువురిపై ల్యాండ్ రోవర్ దూసుకెళ్లిందని తమకు కాల్ వచ్చిందని అధికారులు తెలిపారు. మృతుల్లో పలువురు వలసదారులు ఉన్నారని బ్రౌన్స్ విల్లే పోలీస్ డిపార్ట్ మెంట్ తెలిపింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. 

దారుణం.. టిక్కెట్ డబ్బులు ఇవ్వలేదని కదులుతున్న బస్సులో నుంచి తోసేయడంతో యువకుడి మృతి

ఈ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనేది తెలియరాలేదని, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తునకు సహకరిస్తోందని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో డ్రైవర్ మత్తులో ఉన్నాడా లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని బ్రౌన్స్ విల్లే పీడీకి చెందిన లెఫ్టినెంట్ మార్టిన్ శాండోవల్ తెలిపారు.

ఓ ఎస్ యూవీ అతివేగంతో బస్ స్టాప్ కు వస్తున్నట్లు సీసీ కెమెరా ఫుటేజీలో కనిపించిందని ఓజానమ్ సెంటర్ డైరెక్టర్ విక్టర్ మాల్డోనాడో ‘బీబీసీ’తో తెలిపారు. ‘‘ ఆ తర్వాత వాహనం అదుపుతప్పి సుమారు 60 మీటర్లు ఎగిరి బస్ స్టాప్ లో ఉన్నవారిని ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఆ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని హాస్పిటల్ కు తరలించాం. కారులో ప్రయాణికులు ఎవరూ లేరు. డ్రైవర్ పేరు, వయస్సు పోలీసులకు వెంటనే తెలిరాలేదు.’’ అని శాండోవల్ చెప్పారు.

జ‌మ్మూకాశ్మీర్ లోని పూంచ్ లోయలో పడ్డ బీఎస్ఎఫ్ వాహ‌నం.. ఒక‌రు మృతి

హాస్పిటల్ లో కూడా అతడు సహకరించడం లేదని, ఢిశ్చార్జ్ అయిన వెంటనే నగర జైలుకు తరలిస్తామని శాండోవల్ తెలిపారు. అక్కడికి వెళ్లి అతడి వేలుముద్రలు తీసుకుంటామని అప్పుడే అతడెవరో తెలుస్తుందని చెప్పారు. పోలీసులు రక్త నమూనాన్ని సేకరించి టెక్సాస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ ల్యాబ్ కు పంపించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios