Asianet News TeluguAsianet News Telugu

మరోసారి భారత్ ను పొగిడిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ఇండియా లాగే చౌకగా ముడిచమురు కొనాలనుకున్నాం.. కానీ

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరో సారి భారత విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం సమయంలో అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ రష్యా నుంచి చౌకగా ముడి చమురు కొనుగోలు చేస్తోందని కొనియాడారు. తాము కూడా ఇలా కొనాలని అనుకుందని, కానీ ఆలోపే తమ ప్రభుత్వం పడిపోయిందని చెప్పారు. 

Former Pakistan Prime Minister Imran Khan once again praised India.. We wanted to buy cheap crude oil like India.. but..ISR
Author
First Published Apr 10, 2023, 10:00 AM IST

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్ పొడిగారు. భారత విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. తాము కూడా ఇండియా లాగే రష్యా నుంచి ముడి చమురు కొనాలని అనుకున్నామని, కానీ అవిశ్వాస తీర్మానంలో తన ప్రభుత్వం కూలిపోవడంతో అది సాధ్యం కాలేదని అన్నారు. ఆదివారం ఆయన ఓ వీడియో చేశారు. అందులో జాతిని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘ మేము కూడా భారతదేశం మాదిరిగానే రష్యా ముడి చమురును చౌకగా పొందాలనుకుంటున్నాం. కానీ అది జరగలేదు. దురదృష్టవశాత్తు అవిశ్వాస తీర్మానం కారణంగా నా ప్రభుత్వం పడిపోయింది’’ అని అన్నారు.

ప్రతిపక్షాలపై శరద్ పవార్ ఫైర్.. డిగ్రీ అంశం తప్ప దేశంలో ముఖ్యమైన సమస్యలేమీ లేవా అంటూ కామెంట్స్..

పాకిస్తాన్ ఎన్నడూ లేనంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నప్పటికీ భారతదేశం పొందుతున్న డిస్కౌంట్ రేటుకు తమ దేశం రష్యా ముడి చమురును కూడా కొనుగోలు చేయవచ్చని సూచించారు. పాశ్చాత్య దేశాల ఒత్తిడి ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థను పెంచుకోవడంలో, రష్యన్ చమురును కొనుగోలు చేయడంలో భారత్ విజయం సాధించిందని అన్నారు.

రామ మందిరం కోసం మోడీ తప్ప ఎవ్వరూ ఏమీ చేయలేదు.. ఆయనే బాలసాహెబ్ కల నెరవేర్చారు - ఏక్ నాథ్ షిండే

కాగా.. భారత్ ను ఇమ్రాన్ ఖాన్ పొగడటం ఇదే మొదటిసారి కాదు. అమెరికా ఒత్తిడి ఉన్నప్పటికీ రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ఇమ్రాన్ ఖాన్ 2022 మేలో ప్రశంసించారు. ‘‘క్వాడ్ లో భాగమైనప్పటికీ అమెరికా ఒత్తిడిని తట్టుకుని భారత్ రష్యా నుంచి చౌకగా చమురును కొనుగోలు చేసింది. మా ప్రభుత్వం కూడా స్వతంత్ర విదేశాంగ విధానం ద్వారా దీనిని సాధించడానికి ప్రయత్నిస్తోంది.’’ అని ఇమ్రాన్ ఖాన్ ఆ సమయంలో ట్వీట్ చేశారు.

మరో సందర్భంలో పాక్ ప్రస్తుత ప్రధాని నవాజ్ షరీఫ్ ను విమర్శిస్తూ.. భారత ప్రధాని మోడీని పొగిడారు. ‘‘ప్రపంచంలో నవాజ్ కు తప్ప మరే నాయకుడికీ కోట్లాది రూపాయల ఆస్తులు లేవు. దేశం వెలుపల బిలియన్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్న ఒక ప్రధాని గురించి చెప్పండి.. భారత్ వెలుపల ప్రధాని మోడీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి?’’ అని 2022లో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన చెప్పారు.

హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపిన ముంబై పోలీసులు.. ఇది ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన కాదా అంటూ నెటిజన్ల ప్రశ్నలు..

స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తున్నందుకే తమ ప్రభుత్వాన్ని గద్దె దించారని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. భారత్ మాదిరిగానే రష్యా నుంచి కూడా రాయితీ ధరకు చమురును కొనుగోలు చేసే అవకాశం ఉండేదని ఆయన అనేక సార్లు పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios