Asianet News TeluguAsianet News Telugu

హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపిన ముంబై పోలీసులు.. ఇది ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన కాదా అంటూ నెటిజన్ల ప్రశ్నలు..

హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపిన ముంబై మహిళా పోలీసులపై నెటిజన్లు మండిపడుతున్నారు. రూల్స్ సామాన్యులకేనా ? చట్టాన్ని రక్షించేవారికి ఉండవా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆ పోలీసుల ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Mumbai police drove a scooter without a helmet.. Is this a violation of traffic rules? Netizens' questions..ISR
Author
First Published Apr 9, 2023, 4:21 PM IST

టూ వీలర్ నడిపే వ్యక్తులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ఈ రూల్ లింగం, వృత్తితో మొదలైన వాటితో సంబంధం లేకుండా అందరికీ సమానంగా వర్తిస్తుంది. చట్టానికి అందరూ ఒకటే. ఇందులో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు. అయితే ముంబైకి చెందిన ఇద్దరు మహిళా పోలీసులు హెల్మెట్ లేకుండా స్కూటీపై ప్రయాణించారు. దీనిని ఒకరు ఫొటో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఇది ప్రస్తుతం నెటింట్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

నీలుగాయిని ఢీకొట్టిన హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా ప్రయాణిస్తున్న వాహనం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం..

హెల్మెట్ లేకుండా స్కూటీ నడుతుపున్న ఇద్దరు మహిళా పోలీసులను రాహుల్ అనే ట్విట్టర్ యూజర్ ఫొటో తీసి పోస్టు చేశారు. అందులో ‘‘పోలీసులు హెల్మెట్ నిబంధనను ఉల్లంఘించారు. ఇది ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన కాదా? మనం ఇలా ప్రయాణిస్తే ఊరుకుంటారా ? ’’ అని క్యాప్షన్ లో ప్రశ్నించారు. ఈ పోస్టులో మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ముంబై పోలీసుల అధికారిక ట్విట్టర్ హ్యాండిల్స్ ను ఆయన ట్యాగ్ చేశారు.

ఈ ట్వీట్ షేర్ చేసిన వెంటనే ముంబై పోలీసులు స్పందించారు. ఎక్కడి నుంచి ఫొటో తీశారో కచ్చితమైన లొకేషన్ తెలియజేయండి అని కోరారు. దీనికి రాహుల్ సమాధానమిస్తూ.. ఈ ఘటన ఈస్ట్రన్ ఎక్స్ ప్రెస్ హైవే (దాదర్) వద్ద జరిగిందని తెలిపారు. మళ్లీ ఒక గంట తరువాత ముంబై పోలీసులు సమధానం ఇచ్చారు. ‘‘వారిపై చర్యలు తీసుకోవాలని మేము మాతుంగా ట్రాఫిక్ విభాగానికి మీ అభ్యర్థనను పంపించాం’’ అని తెలిపారు. 

పులుల గణనను విడుదల చేసిన ప్రధాని.. దేశంలో గణనీయంగా పెరిగిన సంఖ్య.. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయో తెలుసా ?

దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘మాములు వ్యక్తులు హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు కొన్ని గంటల్లోనే జరిమానా విధిస్తారు’’ అని ఓ యూజర్ కామెంట్ చేశారు. మరొకరు ‘‘ఈ చట్టం చట్టసభ సభ్యులకు లేదా చట్ట సంరక్షకులకు వర్తించదు. జరిమానాలు మామూలు ప్రజలకు మాత్రమే రిజర్వ్ చేయబడ్డాయి’’ అని కామెంట్ చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios