Asianet News TeluguAsianet News Telugu

ఈ చైనా ఊరికే ఉండదుగా.. మరో ప్రాణాంతక వైరస్ పై ప్రయోగాలు.. 100 శాతం మరణాల రేటట..

కోవిడ్ -19 (covid-19) వ్యాప్తికి కారణమై, లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న చైనా (china).. మరో ప్రాణాంతక వైరస్ పై ప్రయోగాలు చేస్తోంది. ఈ వైరస్ వల్ల సంభవించే మరణాల రేటు 100 శాతంగా ఉందని తెలుస్తోంది. అక్కడి ఆర్మీ (Chinese People’s Liberation Army) కి చెందిన వైద్యులు GX_P2V వైరస్ ప్రయోగాలు చేస్తున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి.

Chinese experiments on another deadly virus GX_P2V.. 100 percent death rate..ISR
Author
First Published Jan 17, 2024, 4:41 PM IST

కోవిడ్ -19 వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా లెక్కలేనంత మంది మరణించారు. అన్ని దేశాలు అర్థికంగా దెబ్బతిన్నాయి. ఈ కోవిడ్ బారిన పడిన అన్ని దేశాలూ అన్ని రంగాల్లో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్నాయి. కోవిడ్ వైరస్ సోకి కోలుకున్న వారు ఇప్పటికే పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదంతా చైనాలోని ల్యాబ్ లో లీకైనా వైరస్ వల్లే అని చెప్పే అనేక వాదనలు ఉన్నాయి. 

బీజేపీని వీడనున్న ఈటల రాజేందర్..? కాంగ్రెస్ లో చేరి బండి సంజయ్ పైనే పోటీ..!

సరే అయ్యిందేదో అయిపోయింది.. ఇక నైనా చైనా గమ్మున ఉంటే బాగుంటుంది కదా.. కానీ ఊరికే నేనెందుకు ఉండాలని భావిస్తుందో ఏమో తెలియదు గానీ.. ఆ దేశం మరో ప్రాణాంతక వైరస్ పై ప్రయోగాలు చేస్తోంది. దీని వల్ల కలిగే మరణాలు రేటు 100 శాతంగా ఉంటుందని ‘ఫస్ట్ పోస్ట్’ కథనం పేర్కొంది. చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)లో శిక్షణ పొందిన వైద్యులు ‘‘పాంగోలిన్ కరోనా వైరస్’’ వెర్షన్ ను తయారు చేశారు. ఇది ఎలుకలలో 100 శాతం మరణాలను కలిగి ఉందని కనుగొన్నారు.

మా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించారు.. ఇక తీవ్ర పరిణామాలుంటాయ్ - ఇరాన్ కు పాక్ వార్నింగ్..

బయోఆర్క్సివ్ లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. ఈ వైరస్ ప్రభావాన్ని పరీక్షించేందుకు ఎలుకలను ఎంచుకున్నారు. ఎలుకల సమూహానికి సార్స్-కోవ్-2-సంబంధిత పాంగోలిన్ కరోనావైరస్ GX_P2V ఇచ్చారు. ఇందులో షాకింగ్ రిజల్ట్స్ వచ్చాయి. ఈ వైరస్ సోకిన ఎలుకలు ఐదు రోజుల్లోనే వేగంగా బరువు తగ్గాయి. మందకొడిగా ఉంటూ, కళ్లు తెల్లబడటం వంటి తీవ్రమైన లక్షణాలు వాటిలోకనిపించాయి.

GX_P2V వైరస్ సోకిన నాలుగు ఎలుకలు ఇన్ఫెక్షన్ సోకిన ఎనిమిది రోజుల్లోనే చనిపోయాయి. దీంతో ఈ వ్యాధి వేగంగా, ప్రాణాంతకమైన పురోగతిని కలిగి ఉందని తెలుస్తోంది. ఈ వైరస్ మెదడు, కళ్లు, ఊపిరితిత్తులకు వ్యాపించిందని పరిశోధనలో తేలింది. లైవ్ వైరస్ సోకిన ఎలుకల్లో 6వ రోజు నాటికి ఊపిరితిత్తుల్లో వైరల్ లోడ్ గణనీయంగా తగ్గింది. మెదడు నమూనాలలో వైరల్ ఆర్ఎన్ఎ లోడ్లు, వైరల్ టైటర్లు రెండూ 3 వ రోజు సాపేక్షంగా తక్కువగా ఉన్నాయి. కానీ 6 వ రోజు నాటికి మళ్లీ పెరిగాయి. ఇన్ఫెక్షన్ తరువాతి దశలలో తీవ్రమైన మెదడు సంక్రమణ ఈ ఎలుకలలో మరణానికి ప్రధాన కారణం కావచ్చని ఈ పరిశోధన సూచించిందని నివేదిక తెలిపింది.

తెలంగాణ ప్రజల బలమైన గొంతుక బీఆర్‌ఎస్ మాత్రమే - కేటీఆర్

కాగా.. చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన జనరల్ హాస్పిటల్ ఐదో మెడికల్ సెంటర్ ఇన్స్టిట్యూషనల్ యానిమల్ కేర్ అండ్ యూజ్ కమిటీ జంతు ప్రయోగ విధానాలను ఆమోదించింది. ఎలుకలపై వైరస్ ప్రభావం తీవ్రతను చూసి ప్రయోగాలు చేస్తున్న శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఈ వైరస్ ఎలుకల శరీరమంతా వ్యాపించడమే కాకుండా మెదడు, కళ్లు, ఊపిరితిత్తులు వంటి కీలక అవయవాలకు కూడా వ్యాపించింది.  అయితే వైరస్ మనుషుల్లోకి వ్యాపించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. GX_P2V అధిక వ్యాధికారక యంత్రాంగం, మానవ ఆరోగ్యంపై దాని ప్రభావాలపై మరింత పరిశోధన చేయాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెప్పారు. అయితే ఇది మనుషులపై ప్రభావం చూపిస్తుందా ? లేదా ? అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.. కానీ అయితే దాదాపు అలాంటి లక్షణాలే కపించే అకాశం ఉందని విశ్లేషణలను పేర్కొన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios