మా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించారు.. ఇక తీవ్ర పరిణామాలుంటాయ్ - ఇరాన్ కు పాక్ వార్నింగ్..
ఇరాన్ పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ లోని పలు ప్రాంతాలపై క్షిపణి దాడులకు దిగింది (Iran launched missile attacks on several areas of Balochistan in Pakistan). అవి ఉగ్రవాద స్థావరాలని ఇరాన్ పేర్కొంది. అయితే ఈ పరిణామంపై పాకిస్థాన్ (Pakisthan) స్పందించింది. ఇరాన్ (iran) తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పాకిస్థాన్ హెచ్చరించింది.
పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ లో ఉన్న జైష్ అల్ అదాల్ ఉగ్రవాద సంస్థ స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులకు దిగింది. ఈ దాడితో పాకిస్థాన్ ఒక్క సారిగా ఉలిక్కిపడింది. పాకిస్తాన్ గగనతలాన్ని అకారణంగా ఉల్లంఘించడాన్ని ఖండించింది. ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ చర్య పాకిస్థాన్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని అభివర్ణించింది.
బీజేపీని వీడనున్న ఈటల రాజేందర్..? కాంగ్రెస్ లో చేరి బండి సంజయ్ పైనే పోటీ..!
పాక్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడం పూర్తిగా ఆమోదయోగ్యం కాదని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. తీవ్రమైన పరిణామాలను హెచ్చరించింది. పాకిస్థాన్, ఇరాన్‌ల మధ్య చాలా సమాచారాన్ని పంచుకునే వ్యవస్థలు ఉన్నప్పటికీ.. ఇరాన్ ఈ చర్యకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోందని, చట్టవ్యతిరేక చర్య జరిగిందని పేర్కొంది.
టెహ్రాన్‌లోని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన సంబంధిత సీనియర్ అధికారితో పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏం జరిగినా ఇరాన్ పూర్తిగా బాధ్యత వహించాలని సూచించింది. ఇలాంటి ఏకపక్ష చర్యలు ఇరుగు, పొరుగు స్నేహపూర్వకమైన సంబంధాలకు అనుగుణంగా లేవని, ఇది ద్వైపాక్షిక విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని కూడా పాకిస్తాన్ పేర్కొంది.
ఇట్ల కూడా రోడ్లు వేస్తరా..? ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. వైరల్..
కాగా.. పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్‌లతో దాడి చేసిందని, ఇందులో ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు బాలికలు గాయపడ్డారు. పాకిస్థాన్‌లోని టెహ్రాన్ వ్యతిరేక ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ దాడి చేసింది. అయితే పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థ జైష్ అల్-అద్ల్‌కు చెందిన రెండు ముఖ్యమైన ప్రధాన కార్యాలయాలను కూల్చివేసినట్టు ఇరాన్ ప్రకటించింది.
అది మోడీ ఫంక్షన్.. రామమందిర ప్రారంభోత్సవంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు..
అల్ అరేబియా న్యూస్ నివేదిక ప్రకారం.. 2012లో ఏర్పడిన జైష్ అల్-అద్ల్‌ను ఇరాన్ 'ఉగ్రవాద' సంస్థగా ప్రకటించింది. ఇది ఇరాన్‌లోని ఆగ్నేయ ప్రావిన్స్‌లోని సిస్తాన్-బలూచిస్తాన్‌లో పనిచేస్తున్న సున్నీ ఉగ్రవాద సంస్థ. గత కొన్ని సంవత్సరాలుగా, జైష్ అల్-అద్ల్ ఇరాన్ భద్రతా దళాలపై అనేక దాడులు చేసింది. డిసెంబరులో జైష్ అల్-అద్ల్ సిస్తాన్-బలుచెస్తాన్‌లోని ఒక పోలీసు స్టేషన్‌పై దాడికి బాధ్యత వహించింది. ఇందులో 11 మంది పోలీసు సిబ్బందిని మరణించారు. కాగా.. క్షిపణి దాడుల వల్ల అమెరికా స్థావరాలపై ఎలాంటి ప్రభావం పడలేదని ఇద్దరు అమెరికా అధికారులు ‘రాయిటర్స్’ కు తెలిపారు.