MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • International
  • Viral Video: ఇరాన్‌కు ఇంత సీన్ ఉందా.. మిస్సైల్ సిటీ వీడియో చూస్తే వెన్నులో వ‌ణుకు పుట్టాల్సిందే

Viral Video: ఇరాన్‌కు ఇంత సీన్ ఉందా.. మిస్సైల్ సిటీ వీడియో చూస్తే వెన్నులో వ‌ణుకు పుట్టాల్సిందే

Viral Video: అమెరికా, ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఇరాన్ తన సైనిక శక్తిని ప్రదర్శించేలా ఒక వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో “మిస్సైల్ సిటీ”గా పిలిచే భూగర్భ ఆయుధ కేంద్రాన్ని చూపించినట్టు ఇరాన్ సైన్యం ప్రకటించింది.  

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 15 2026, 09:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇరాన్ విడుదల చేసిన “మిస్సైల్ సిటీ” వీడియో
Image Credit : NOELREPORTS/X

ఇరాన్ విడుదల చేసిన “మిస్సైల్ సిటీ” వీడియో

ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఒక వీడియో ప్రసారం చేసింది. ఇందులో భూగర్భంలో నిర్మించిన భారీ టన్నెల్స్ కనిపిస్తాయి. ఆ టన్నెల్స్‌లో నావల్ డ్రోన్లు, యాంటీ-షిప్ మిస్సైళ్లు, సముద్ర మైన్స్ వంటి ఆయుధాలు వరుసగా నిల్వ ఉన్నట్లు చూపించారు. ఇరాన్ అధికారులు ఈ భూగర్భ కేంద్రాన్ని “మిస్సైల్ సిటీ”గా పిలుస్తున్నారు. శత్రు దేశాలు దాడి చేసినా ఈ ఆయుధ నిల్వలు సురక్షితంగా ఉండేలా ప్రత్యేకంగా భూమి అడుగున నిర్మించినట్టు చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హార్ముజ్ జలసంధి లక్ష్యంగా
Image Credit : X

హార్ముజ్ జలసంధి లక్ష్యంగా

ఇరాన్ ప్రకటించిన ప్రకారం, తమ వద్ద పెద్ద సంఖ్యలో “సూసైడ్ డ్రోన్ బోట్లు” ఉన్నాయి. వీటిని హార్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉపయోగించేందుకు సిద్ధంగా ఉంచారు. హార్ముజ్ జలసంధి ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటి. గల్ఫ్ దేశాల నుంచి ప్రపంచానికి వెళ్లే పెద్ద మొత్తంలో చమురు ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. ఈ మార్గాన్ని అడ్డుకుంటే ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇరాన్ ఈ ప్రాంతాన్ని అడ్డుకునే సామర్థ్యం ఉన్నట్టు చూపించడం ద్వారా అమెరికా, ఇజ్రాయెల్‌కు హెచ్చరిక ఇవ్వాలనుకుంటోంది.

35
సూసైడ్ నావల్ డ్రోన్లు ఎలా పనిచేస్తాయి?
Image Credit : X@CENTCOM+Gemini

సూసైడ్ నావల్ డ్రోన్లు ఎలా పనిచేస్తాయి?

ఇరాన్ ఉపయోగిస్తున్న నావల్ డ్రోన్లను “అన్‌మ్యాన్డ్ సర్ఫేస్ వెహికల్స్ (USVs)” అని పిలుస్తారు. ఇవి మనుషులు లేకుండా రిమోట్ ద్వారా నియంత్రించే చిన్న పడవలు. ఈ డ్రోన్లు నీటి మీద లేదా నీటి అడుగుభాగానికి దగ్గరగా కదులుతాయి. వీటిలో భారీ పేలుడు పదార్థాలు అమర్చుతారు. లక్ష్యంగా ఉన్న నౌకను తాకగానే అవి పేలిపోతాయి. ఇలాంటి డ్రోన్లు చిన్నవిగా ఉండటం వల్ల గుర్తించడం కష్టం. అందుకే పెద్ద నౌకలకు ఇవి ప్రమాదకరంగా మారవచ్చు.

45
ఇప్పటికే చమురు ట్యాంకర్లపై దాడులు
Image Credit : X

ఇప్పటికే చమురు ట్యాంకర్లపై దాడులు

ఇరాన్ తయారు చేసిన నావల్ డ్రోన్లు ఇప్పటికే రెండు చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్టు రిపోర్టులు చెబుతున్నాయి. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఆయిల్ ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని అంటున్నారు. హార్ముజ్ జలసంధి వంటి ఇరుకైన సముద్ర మార్గాల్లో ఈ డ్రోన్లు ఉపయోగిస్తే నౌకల రాకపోకలకు పెద్ద అంతరాయం కలగొచ్చు.

Iran published footage of underground tunnels stocked with naval drones, anti-ship missiles, and sea mines. Reuters reported, citing US officials, that Iran has mined the Strait of Hormuz with dozens of sea mines. #Iran pic.twitter.com/Kcwp5UqkXq

— NOELREPORTS 🇪🇺 🇺🇦 (@NOELreports) March 11, 2026

55
అమెరికా, ఇజ్రాయెల్‌కు పెరుగుతున్న భయం
Image Credit : NOELREPORTS

అమెరికా, ఇజ్రాయెల్‌కు పెరుగుతున్న భయం

అమెరికా, ఇజ్రాయెల్ నుంచి దాడుల ముప్పు ఉందని ఇరాన్ చెబుతోంది. ఈ నేపథ్యంలో తమ వద్ద ఉన్న ఆయుధ శక్తిని ప్రపంచానికి చూపించడానికి ఈ వీడియో విడుదల చేసినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. భూగర్భ మిస్సైల్ కేంద్రాలు, డ్రోన్ బోట్లు, సముద్ర మైన్స్ అన్నీ క‌లిపి ఇరాన్ సముద్ర యుద్ధ వ్యూహంలో కీలక భాగంగా మారాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధిని అడ్డుకునే సామర్థ్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
యుద్ధం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Recommended image2
అమెరికాలో ఇళ్ల బయట జనం ఎందుకు కనిపించరు.? ఇంతకీ వాళ్లేం చేస్తుంటారు.?
Recommended image3
Trump Tariffs: రష్యా ఆయిల్ కొంటే భారత్‌పై 100% టారిఫ్? ట్రంప్ చేతికి డెడ్లీ వెపన్ ఇచ్చిన అమెరికా పార్లమెంట్
Related Stories
Recommended image1
Zodiac sign: ఈ రాశికి ఈ వారం ల‌క్కే ల‌క్కు.. కానీ ఒక్క విష‌యంలో మాత్రం చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి
Recommended image2
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం, 392 కిలోమీట‌ర్ల‌లో కొత్త రైల్వే లైన్‌.. ఈ ప్రాంతాల్లో భూమ‌ల ధ‌ర‌ల‌కు రెక్క‌లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved