తెలంగాణ ప్రజల బలమైన గొంతుక బీఆర్‌ఎస్ మాత్రమే - కేటీఆర్
తెలంగాణ హక్కులు, ప్రయోజనాలు కాపాడటడం బీఆర్ఎస్ (BRS) తోనే సాధ్యమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) అన్నారు. 2014 తెలంగాణకు ఉన్న ఏకైక గొంతుక బీఆర్ఎస్ అని, 2024లో కూడా తమ పార్టీ మాత్రమే తెలంగాణ వాణిని వినిపిస్తుందని తెలిపారు.
తెలంగాణ ప్రజల బలమైన గొంతుక బీఆర్ఎస్ అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత రెండు దఫాలుగా లోక్ సభలో కేంద్రానికి అత్యధిక ప్రశ్నలు సంధించిన ఘనత బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులదని అని ఆయన పేర్కొన్నారు. ఇతర పార్టీల సభ్యుల కంటే బీఆర్ఎస్ ఎంపీలు ఎక్కువ ప్రశ్నలు అడిగారని తెలిపే చాట్ ను కేటీఆర్ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) హ్యాండిల్ లో షేర్ చేశారు.
బీజేపీని వీడనున్న ఈటల రాజేందర్..? కాంగ్రెస్ లో చేరి బండి సంజయ్ పైనే పోటీ..!
ఆ చాట్ ప్రకారం.. 2014 లో ఏర్పడిన 16 వ లోక్ సభలో 2,726 ప్రశ్నలు, 2019 లో ఏర్పడిన 17 వ లోక్ సభలో మరో 2,028 ప్రశ్నలతో సహా బీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో మొత్తం 4,754 ప్రశ్నలు అడిగారు. 16, 17వ లోక్ సభల్లో కాంగ్రెస్ ఎంపీలు 1,271 ప్రశ్నలు అడగగా, తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు మొత్తం 190 ప్రశ్నలను అడిగారని పేర్కొంది.
మా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించారు.. ఇక తీవ్ర పరిణామాలుంటాయ్ - ఇరాన్ కు పాక్ వార్నింగ్..
2024 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటు వేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్లమెంటులో తెలంగాణ గళం గట్టిగా వినిపించాలంటే తెలంగాణ ప్రజలు 'టీమ్ కేసీఆర్'కు ఓటు వేయాలని కోరారు. 16, 17వ లోక్ సభ గణాంకాలను పరిశీలిస్తే తెలంగాణ హక్కులు, ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, డిమాండ్ చేయడంలో బీఆర్ ఎస్ ఎంపీలు ఎంత బాగా పనిచేశారో తెలుస్తుందన్నారు.
2014కు ముందు, 2024లో కూడా తెలంగాణ ప్రజల బలమైన గొంతుక బీఆర్ఎస్ మాత్రమేనని పునరుద్ఘాటించారు. ‘‘నాడు .. నేడు.. ఏనాడైనా..
తెలంగాణ గళం.. తెలంగాణ బలం …తెలంగాణ దళం.. మనమే..’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.