చైనా ఆర్థికంగా ఎద‌గ‌డంతో పాటు సైన్యంప‌రంగా కూడా శ‌క్తివంత‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా చైనా చేసిన ఓ ప‌ని ప్ర‌పంచ దేశాల‌ను వ‌ణికిస్తోంది. ఇంత‌కీ చైనా చేస్తున్న ఆ ప‌ని ఏంటంటే.. 

DID YOU
KNOW
?
బాంబు సామర్థ్యం ఎంతంటే.?
చైనా హైడ్రోజ‌న్ బాంబును ప‌రీక్షించింది. రెండు సెకన్లలో 1,000 డిగ్రీ సెల్సియస్‌ వేడితో పరిసరాలను బూడిదచేసే సామర్థ్యం ఈ బాంబు సొంతం.

చైనా హైడ్రోజ‌న్ బాంబు

 

2025 ఏప్రిల్‌లో చైనా ఓ శ‌క్తివంత‌మైన ఆయుధాన్ని ప‌రీక్షించింది. ఇది సాధారణ అణు బాంబు కాదు, TNTతో కూడిన పేలుడు పదార్థం కూడా కాదు. కానీ ఇది వాటికంటే ప్రమాదకరమైనదిగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇది హైడ్రోజన్ ఆధారితమైన కొత్త రకం పేలుడు పదార్థం. ఇది శాస్త్రీయంగా ‘మ్యాగ్నీషియం హైడ్రైడ్’ (Magnesium Hydride) పేలుడు పదార్థం ఆధారంగా పనిచేస్తుంది.

ఇది ఎలా పనిచేస్తుంది?

మ్యాగ్నీషియం హైడ్రైడ్ వేడెక్కినప్పుడు, అది హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తుంది. ఈ వాయువు వెంటనే అంటుకొని 1,000 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతతో పెద్ద ఎర్రటి అగ్ని వ‌ల‌యాన్ని తయారుచేస్తుంది. TNT వంటి సంప్రదాయ బాంబులు బ్లాస్ట్ అయిన వెంటనే నశిస్తాయి. కానీ ఈ హైడ్రోజన్ పేలుడు 2 సెకన్లపాటు కొనసాగుతుంది. ఇది TNTతో పోలిస్తే 15 రెట్లు ఎక్కువ కాలం. అంటే చాలా ఎక్కువగా లోపలికి ప్రవేశించి, బంకర్లను, ఫ్యూయల్ డిపోలు, షిప్పులను, ట్రాఫిక్ మార్గాలను మంటల్లో కాల్చే సామర్థ్యం ఉంటుంది. రెండు సెకన్లలో 1,000 డిగ్రీ సెల్సియస్‌ వేడితో పరిసరాలను బూడిదచేసే సామర్థ్యం ఈ బాంబు సొంతం.

ప్ర‌పంచ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది

ఈ ఆయుధం అణు బాంబు కాదు కనుక, ఇది అణు ఒప్పందాలను ఉల్లంఘించదు. కానీ దీని ప్రభావం పెద్దఎత్తున ఉంటుంది. ముఖ్యంగా ఇది మిసైళ్ల‌లో, డ్రోన్లలో, టార్పిడోల్లో, రాడార్ సిస్టమ్‌లను ధ్వంస చేయడానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. నగరాల్లో బంకర్ ప్రాంతాలను కాల్చేందుకు ఉపయోగప‌డుతుంది. ఇది సాంప్రదాయ అణు బాంబుల్లా రెడియో యాక్టివ్ ఫాల్‌ఔట్‌ను విడుదల చేయదు. కానీ మానవజీవితాలకు, సైనిక సౌకర్యాలకు గణనీయమైన నష్టాన్ని క‌లిగిస్తుంది.

పెద్ద ఎత్తున ఉత్ప‌త్తి

తాజాగా చైనా ప్రతి సంవత్సరం 150 టన్నులు తయారు చేసే సామర్థ్యం గల ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించింది. ఈ పదార్థం అసలు ఉద్దేశం స్వచ్ఛమైన ఎనర్జీ వినియోగానికి అయినప్పటికీ, ఇప్పుడు అదే టెక్నాలజీని ఆయుధ తయారీకి మార్చారు.

నూతన యుద్ధ శైలికి సంకేతమా?

ఇది పెద్ద పెద్ద బాంబులకంటే భిన్నం. దీనిని తక్కువ సమయంలో ఎక్కువ నష్టం కలిగించే విధంగా రూపొందించారు. డిజిటల్ సిస్టమ్‌లను తిప్పికొట్టే ఉష్ణోగ్రత, మెటల్‌ను కరిగించే శక్తి, భయానికి రూపం లాంటిదిగా త‌యారు చేశారు. అణు పేలుళ్ల కంటే తక్కువ ఖర్చుతో, సులభంగా ప్రయోగించగల, రెగ్యులర్ ట్రాకింగ్‌తో కనిపెట్టలేని ఈ ఆయుధాలు ప్ర‌పంచాన్ని భ‌య‌పెడుతున్నాయి.