- Home
- Telangana
- Weather Forecast: వానలు బాబోయ్ వానలు.. వచ్చే నాలుగు రోజులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Weather Forecast: వానలు బాబోయ్ వానలు.. వచ్చే నాలుగు రోజులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
రుతుపవనాల ఎంట్రీ తర్వాత కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేవు. దీంతో రైతులతో పాటు ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాజాగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారీ వర్షాలు కురుస్తున్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us

తెలంగాణలో భారీ వర్షాలు
తెలంగాణలో శుక్రవారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజులపాటు ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బహిర్గతంగా వెళ్లాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు 30 నుంచి 40 కి.మీ. వేగంతో వీచే అవకాశముంది.
మరికాసేపట్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం
వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, ఆదిలాబాద్, జగిత్యాల, జనగాం, గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మెదక్, నాగర్‌కర్నూల్, నల్లగొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, సిద్ధిపేట, సూర్యాపేట, వనపర్తి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2 నుంచి 3 గంటల్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్‌లో శుక్రవారం కురిసిన వర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. షేక్‌పేట్, ఖాజాగూడ, రాయదుర్గం, గచ్చిబౌలి, హఫీజ్‌పేట్, మాదాపూర్, మియాపూర్, చందానగర్ ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. ఐటీ కారిడార్ ప్రాంతాల్లో వాహనదారులు ట్రాఫిక్ జామ్‌లతో ఇబ్బందులు పడుతున్నారు. బయోడైవర్సిటీ, ఐకియా జంక్షన్, గచ్చిబౌలి పిజేఆర్ ఫ్లైఓవర్, టోలిచౌకి-మెహదీపట్నం మార్గాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
రానున్న 4 రోజులు వర్షాలు
జూలై 19: హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
జూలై 20: వనపర్తి, సంగారెడ్డి, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్.
జూలై 21: ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, మేడ్చల్, జనగాం, ఐటీ కారిడార్ పరిధిలోని జిల్లాల్లో వర్షాలు.
జూలై 22: ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి, గద్వాల, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోనూ
గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో ఉక్కపోత ఎక్కువగా ఉండగా తాజాగా మారిన వాతావరణంతో ఉపశమనం లభించింది. రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో జూలై 24 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడనున్నాయని అధికారులు పేర్కొన్నారు. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నట్టు సమాచారం.