కండోమ్ కి కన్నం పెట్టి ప్రియురాలితో సెక్స్... జైలుపాలయిన ప్రియుడు
ప్రియురాలి ఇష్టానికి వ్యతిరేకంగా చేసింది అత్యాచారమేనని నిర్దారించిన కోర్టు ఓ వ్యక్తికి కోర్టు నాలుగేళ్ల కారాగార శిక్ష విధించింది.

లండన్: తన ప్రియురాలికి సురక్షిత శృంగారం చేస్తానని మాటిచ్చి మోసం చేసిన ఓ వ్యక్తి కటకటాలపాలయ్యాడు. కండోమ్ కి కన్నంపెట్టి సెక్స్ లో పాల్గొన్న 47ఏళ్ళ బ్రిటన్ వ్యక్తిని అతడి ప్రియురాలే జైలుకు పంపించింది. ప్రియురాలి ఇష్టానికి వ్యతిరేకంగా చేసింది అత్యాచారమేనని నిర్దారించిన కోర్టు సదరు ప్రియుడికి నాలుగేళ్ల కారాగార శిక్ష విధించింది.
వివరాల్లోకి వెళితే... బ్రిటన్ కు చెందిన 47ఏళ్ల వ్యక్తి ఓ మహిళను సన్నిహితంగా వుండేవాడు. ఇద్దరి మనసులు కలవడంతో శారీరకంగా కలవాలని భావించారు. ఈ క్రమంలో సురక్షిత శృంగారానికి ప్రాధాన్యత ఇచ్చన మహిళ కండోమ్ ధరించి సెక్స్ చేయాల్సిందిగా సదరు ప్రియున్ని కోరింది. అయితే ఇది ఇష్టం లేని ప్రియుడి కండోమ్ కు చిల్లులు పెటి సెక్స్ లో పాల్గొన్నాడు.
read more దారుణం : ట్రాన్స్ ఫర్ పేరుతో మభ్యపెట్టి అత్యాచారం.. వీడియో తీసి బ్లాక్ మెయిల్...
ఇలా ఒక్కసారి కాదు పలుమార్లు ప్రియురాలితో సెక్స్ లో పాల్గొన్నాడు. అయితే తాజాగా అతడి మోసాన్ని పసిగట్టిన ఆమె కోర్టును ఆశ్రయించింది. దీంతో మహిళ ఇష్టానికి వ్యతిరేకంగా సెక్స్ చేయడాన్ని అత్యాచారంగానే భావించాల్సి వస్తోందంటూ అతడికి నాలుగేళ్ళ జైలుశిక్ష విధించింది న్యాయస్థానం. తన నమ్మకాన్ని వమ్ముచేసిన ప్రియుడు ఈ శిక్షకు అర్హుడేనని బాధిత మహిళ పేర్కొంది.