చెక్ పోస్టు వద్ద బాంబు దాడి.. 18 మంది మృతి, 40 మందికి గాయాలు.. ఎక్కడంటే ?
సోమాలియాలో ఘోరం జరిగింది. అక్కడి బెలెడ్వీన్ నగరంలోని సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 18 మంది మరణించారు. మరో 40 మందికి గాయాలు అయ్యాయి.
సోమాలియాలోని బెలెడ్వీన్ నగరంలోని సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద జరిగిన బాంబు దాడి జరిగింది. పేలుడులో 18 మంది మరణించారు. సుమారు 40 మంది గాయపడ్డారు. పేలుడు పదార్థాలతో కూడిన వాహనం పేలడంతోనే ఈ ఘటన జరిగిందని సోమాలియా అధికారులు తెలిపారు.
భారీ వర్షాలతో ఆసిఫాబాద్ జిల్లాలో ముగ్గురు మృతి.. పిడుగుపడి ఇద్దరు, వాగులో కొట్టుకుపోయి మరొకరు..
క్షతగాత్రుల్లో 20 మందిని బెలెడ్వీన్ ఆస్పత్రుల్లో చేర్పించామని, మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉందని హిర్షబెల్లె రాష్ట్ర అంతర్గత మంత్రి అబ్దిరహ్మాన్ దాహిర్ గురే తెలిపారు. వారిని మెరుగైన వైద్యం కోసం మొగదిషుకు తరలించాలని కోరామని చెప్పారు. కాగా.. ఘటనా స్థలంలో నుంచి విడుదలైన పలు వీడియోల్లో పొగలు, ట్రక్కు దగ్ధమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి.
విడాకులు వద్దన్నా వినడం లేదని.. మంచంపై భర్తను కాల్చిన భార్య..
అయితే ఈ దాడికి తామే బాధ్యులమని అల్ షబాబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోనప్పటికీ.. దీని వెనక కచ్చితంగా వారి హస్తం ఉందని అధికారులు భావిస్తున్నారు. పేలుడు పదార్థాలతో నింపిన ట్రక్కు ప్రభుత్వ ఆధీనంలోని చెక్ పోస్టు గుండా వేగంగా వెళ్తోందని, అయితే భద్రతా సిబ్బందికి చెందిన పికప్ వాహనం దానిని వెంబడిస్తుండగా ఈ పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించినట్టు ‘ఇండియా టీవీ’ పేర్కొంది.
ఛాన్స్ దొరికినప్పుడల్లా బ్రిజ్ భూషణ్ సింగ్ రెజ్లర్లను వేధించారు - కోర్టుతో ఢిల్లీ పోలీసులు
ఇదిలా ఉండగా.. ఈ నెల ప్రారంభంలో సోమాలియాలోని ఓ పట్టణంలో జరిగిన వైమానిక దాడి జరిగింది. ఇందులో చిన్నారులు సహా పలువురు మృతి చెందారు. అయితే సోమాలియా దళాల సైనిక చర్యలో ముగ్గురు అల్ షబాబ్ సభ్యులు మరణించారని అక్కడ మోహరించిన అమెరికా సైనిక దళాలు తెలిపాయి. కాగా.. దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడుతున్న అల్ షబాబ్ ఉగ్రవాద సంస్థ ముప్పును ఎదుర్కొనేందుకు ప్రజలు ముందుకు రావాలని అధ్యక్షుడు హసన్ షేక్ మొహమ్మద్ పిలుపునిచ్చారు.