పాకిస్థాన్ లో మరో హిందూ దేవాలయం ధ్వంసం.. రాకెట్లతో దాడి చేసిన దుండగులు.. 24 గంటల్లో రెండో ఘటన

పాకిస్థాన్ లో మరో హిందూ దేవాలయంపై దాడి జరిగింది. కరాచీలోని 150 ఏళ్ల పురాతన హిందూ ఆలయాన్ని శుక్ర, శనివారంలో దుండుగులు ధ్వంసం చేశారు. తాజాగా సింధ్ లోని కాష్మోర్ లోని ఆలయంపై రాకెట్లతో దాడి జరిగింది. 

Another Hindu temple destroyed in Pakistan.. Thugs attacked with rockets.. Second incident in 24 hours..ISR

పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో 24 గంటల్లోనే రెండు హిందూ దేవాలయాలు ధ్వంసం అయ్యాయి. 150 ఏళ్ల క్రితం నిర్మించిన కరాచీలోని 'మారి మాతా' ఆలయాన్ని శుక్ర, శనివారాల్లో దుండగులు కూల్చివేశారు. ఈ ఘటన చోటు చేసుకొని 24 గంటల కూడా పూర్తికాక ముందే మరో హిందూ దేవాలయం ధ్వంసం జరిగింది.

ముంబైలో మార్వే క్రీక్ లో మునిగిన ఐదుగురు బాలురు.. ముగ్గురు గల్లంతు.. ఇద్దరిని రక్షించిన స్థానికులు

సింధ్ లోని కాష్మోర్ లోని ఆలయంపై ఆదివారం తెల్లవారుజామున రాకెట్ లాంచర్లతో దాడి జరిగింది. దాడి సమయంలో ఆలయాన్ని నిర్వాహకులు మూసివేశారు. బాగ్రీ కమ్యూనిటీ నిర్వహించే మతపరమైన సేవల కోసం ఈ ఆలయం ఏటా తెరుచుకుంటుందని పోలీసు అధికారి తెలిపారు.

సముద్రం ఒడ్డున భర్తతో కలిసి ఫొటో తీసుకుంటుండగా విషాదం.. మహిళను లోపలికి లాక్కెళ్లిన భారీ అల.. వీడియో వైరల్

ఈ ఘటనలను పాకిస్థాన్ మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీపీ) ఖండించింది. సింధ్ లోని కాష్మోర్, ఘోట్కీ జిల్లాల్లో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలు, పిల్లలతో సహా హిందూ సమాజానికి చెందిన 30 మంది సభ్యులను వ్యవస్థీకృత క్రిమినల్ ముఠాలు బందీలుగా ఉంచాయని వచ్చిన వార్తలతో తాము ఆందోళన చెందుతున్నామని కమిషన్ తెలిపింది. దీనిపై విచారణ జరపాలని సింధ్ హోం శాఖను కమిషన్ కోరింది.

సింధ్ నదిలోకి దూసుకెళ్లిన సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం.. 8 మందికి గాయాలు

ఇదిలా ఉండగా.. కాష్మోర్ లో గౌస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలయంతో పాటు హిందువులకు చెందిన ఇళ్లపై దుండగులు దాడి చేశారు. దేవాలయాలు, ఇళ్లపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల శబ్దం తర్వాత కాష్మోర్-కండ్కోట్ ఎస్ఎస్పీ ఇర్ఫాన్ సమ్మో నేతృత్వంలోని పోలీసు విభాగం సంఘటనా స్థలానికి చేరుకుంది. కాగా.. 24 గంటల వ్యవధిలోనే 150 ఏళ్ల పురాతన ఆలయం, మరో ఆలయంపై ధ్వంసం అవడం ఆందోళన కలిగిస్తోంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios