Asianet News TeluguAsianet News Telugu

చైనాలోని రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 17 మంది మృతి.. ముగ్గురికి తీవ్ర‌గాయాలు

చైనాలోని ఓ రెస్టారెంట్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది అగ్నికి ఆహుతి అయ్యారు. మరో ముగ్గురు గాయపడ్డారు. 

A huge fire in a restaurant in China.. 17 people died.. Three were seriously injured
Author
First Published Sep 28, 2022, 4:06 PM IST

ఈశాన్య చైనాలోని ఓ రెస్టారెంట్‌లో బుధవారం ఓ భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ఇందులో 17 మంది మృతి చెందారు. మ‌రో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయని అధికారులు పేర్కొన్నారు. చాంగ్‌చున్ నగరంలో ఉన్న రెస్టారెంట్ లో మధ్యాహ్నం 12:40 గంటలకు ఒక్క సారిగా మంటలు చెలరేగాయని స్థానిక ప్రభుత్వం వీబో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నార‌ని పేర్కొంది. మధ్యాహ్నం 3 గంటలకు రెస్క్యూ ఆప‌రేష‌న్ పూర్తి చేసిన‌ట్టు తెలిపింది. 

నాన్ వెజ్ తినే వాళ్ల‌తో సెక్స్ చేయొద్దు : మ‌హిళ‌ల‌కు పిలుపునిచ్చిన పెటా.. సెటైర్లు వేసిన నెటిజన్లు

మృతుల‌ను, గాయ‌ప‌డిన వారిని హాస్పిట‌ల్ కు త‌ర‌లించారు. క్ష‌త‌గాత్రుల‌కు డాక్ట‌ర్లు చికిత్స అందిస్తున్నారు. ఘటనకు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

కాగా.. చైనాలో ఇలాంటి ప్రాణాంతకమైన అగ్నిప్ర‌మాదాలు త‌ర‌చూగా సంభ‌విస్తాయి. బిల్డింగ్ ల‌కు అనుమ‌తి ఇచ్చేట‌ప్పుడు, బిల్డింగ్ కోడ్ ల‌ను అమ‌లు చేసేట‌ప్పుడు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో పాటు విస్తృతమైన అనధికార నిర్మాణాలు ఈ ప్ర‌మాదాల‌కు కార‌ణం అవుతున్నాయి. అయితే ఇలాంటి నిర్మాణాల్లో అగ్నిప్ర‌మాదాలు సంభ‌వించిన‌ప్పుడు అందులో ఉండే వారు పారిపోవ‌డం, ప్రాణాల‌ను ర‌క్షించుకోవ‌డం క‌ష్ట‌త‌రంగా మారుతోంది. 

ఈ నెల మొద‌ట్లో సెంట్రల్ సిటీ చాంగ్షాలో ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికమ్యూనికేషన్స్ కంపెనీ లో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. భారీ మంటలు ఆ ఆకాశహర్శ్యాన్ని చుట్టుముట్టాయి. అయితే అదృష్ట‌వ‌శాత్తు ఎలాంటి ప్రాణ న‌ష్టమూ జ‌ర‌గ‌లేదు.

మంత్రివ‌ర్గ విస్తర‌ణ‌.. సౌదీ అరేబియా ప్రధానిగా.. క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్

గత ఏడాది జూలైలో ఈశాన్య జిలిన్ ప్రావిన్స్‌లోని ఓ గోదాంలో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఇందులో 15 మంది మరణించారు. 25 మందికి గాయాలు అయ్యాయి. దానికి నెల రోజుల ముందు సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్‌లోని ఒక మార్షల్ ఆర్ట్స్ స్కూల్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘ‌ట‌న‌లో 18 మంది మరణించ‌గా.. అధికంగా ఇందులో పిల్ల‌లే ఉన్నారు.

పాక్ లో ఆర్మీ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి .. 21 మందికి తీవ్ర గాయాలు..

2017లో బీజింగ్‌లో జరిగిన అగ్నిప్ర‌మాదంలో దాదాపు 6 గురు అగ్నికి ఆహుతి అయ్యారు. 2010లో 28 అంతస్తుల షాంఘై హౌసింగ్ బ్లాక్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘ‌ట‌న‌లో 58 మంది చనిపోయారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios