Asianet News TeluguAsianet News Telugu

భార‌త్ లో త‌యారు చేసిన దగ్గు సిరప్ తాగి గాంబియాలో 66 మంది పిల్లలు మృతి.. విచార‌ణ‌కు ఆదేశించిన డీసీజీఐ

ఇండియాలో తయారు చేసిన ఓ దగ్గు-జలుబు సిరప్ తాగడం వల్ల గాంబియాలో 66 మంది చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ విషయాన్ని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కు సమాచారం అందించగా.. ఆ సంస్థ విచారణకు ఆదేశించింది. 

66 children died in Gambia after drinking cough syrup made in India. DCGI ordered an inquiry
Author
First Published Oct 6, 2022, 10:05 AM IST

భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన డీకాంగెస్టెంట్, దగ్గు సిరప్ తాగి పశ్చిమ ఆఫ్రికా దేశమైన గాంబియాలో 66 మంది పిల్లలు మరణించారు. దీంతో ఈ సిర‌ప్ ను ఉప‌యోగించ‌కూడ‌ద‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిక జారీ చేసింది. అలాగే దీనిపై ఢిల్లీలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ను ప్ర‌శ్నించింది. దీంతో డీసీజీఐ విచార‌ణ‌కు విచార‌ణ‌కు ఆదేశించింది.

షాకింగ్.. ప్రియుడున్నాడని, వదిలేయమని చెప్పినా భర్త వినకపోవడంతో.. ఆ భార్య చేసిన పని..

ఈ విష‌యాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలోని ఉన్నత వర్గాలు తెలిపాయి. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వెంటనే హర్యానా రెగ్యులేటరీ అథారిటీతో ఈ ఘ‌ట‌నను పంచుకుంది. దీనిపై వివరణాత్మక దర్యాప్తు ప్రారంభించింది.

హర్యానాలోని సోనెపట్‌లోని ఎం/ఎస్ మైడెన్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ కంపెనీలో ఈ దగ్గు సిరప్‌లను తయారు చేస్తున్నారు. ప్ర‌స్తుతం వ‌ర‌కు అందుబాటులో ఉన్న స‌మ‌చారం ప్ర‌కారం.. ఆ సంస్థ ఈ ఉత్పత్తులను గాంబియాకు మాత్రమే ఎగుమతి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆరోపణలపై కంపెనీ ఇంకా స్పందించలేద‌ని ‘ఎన్డీటీవీ‘ నివేదించింది. కాగా.. ఈ మందుల వినియోగం వల్ల గాంబియాలో పెద్ద ఎత్తున పిల్లలు చనిపోయారని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.

కేర‌ళ‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఐదుగురు విద్యార్థులు స‌హా 9 మంది మృతి

ఈ దగ్గు మందులో ఉన్న డైథిలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్ మానవులకు విషం లాంటివని డబ్ల్యూహెచ్‌ఓ బుధవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ ఘ‌ట‌న‌పై డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ.. పిల్లల మరణాలు నాలుగు డ్రగ్స్‌కు సంబంధించినవ‌ని తెలిపారు. ఈ సిరప్‌లు తీసుకోవడం వల్ల పిల్ల‌ల కిడ్నీలు దెబ్బతిన్నాయ‌ని చెప్పారు. ప్రోమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్‌మలిన్ బేబీ కఫ్ సిరప్, మాకోఫ్ బేబీ కఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్ అనే నాలుగు ఉత్పత్తుల ఈ మ‌ర‌ణాల‌కు కార‌ణం అని డబ్ల్యూహెచ్ వో తెలిపింది. 

ఈ మందుల వ‌ల్ల ప్ర‌మాదం ఉంద‌ని ప్రపంచ దేశాలకు కూడా డ‌బ్ల్యూహెచ్ వో హెచ్చరికలు జారీ చేసింది. ఈ సెకెండ్ క్లాస్ ఉత్పత్తులు సురక్షితమైన‌వి కావ‌ని, ముఖ్యంగా పిల్ల‌లలో మరణానికి కారణమవుతాయ‌ని తెలిపింది. ఈ మందులను మార్కెట్ నుండి తొలగించాలని WHO అన్ని దేశాలను హెచ్చరించింది. వీటి స‌ర‌ఫరాపై నిఘా ఉంచాల‌ని తెలిపింది.

దారుణం.. వివాహితను పబ్ కు తీసుకువెళ్లి, డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం.. వీడియో తీసి, బ్లాక్ మెయిల్ చేస్తూ...

ఈ సిరప్ తాగ‌డం వ‌ల్ల పొత్తికడుపు నొప్పి, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, మూత్రవిసర్జనలో ఇబ్బంది, మానసిక స్థితిలో మార్పులు, తీవ్రమైన మూత్రపిండాల నష్టం వంటి సైడ్ ఎఫెక్ట్ లు క‌నిపించాయి. ఇవి మ‌ర‌ణానికి దారి తీసే అవ‌కాశం ఉంది. కాగా.. ఈ పిల్ల‌ల మరణాలు ఎప్పుడు సంభవించాయనే విష‌యంలో డబ్ల్యూహెచ్‌ఓ ఇంకా వివరాలు వెల్ల‌డించ‌లేదు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios