Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్.. ప్రియుడున్నాడని, వదిలేయమని చెప్పినా భర్త వినకపోవడంతో.. ఆ భార్య చేసిన పని..

పెళ్లికి ముందే మరో వ్యక్తిని ప్రేమించానని తనను వదిలేయమని ఎంత చెప్పినా భర్త వినడం లేదని.. ఓ భార్య ఘాతుకానికి తెగించింది. ఆ భర్తను అతి దారుణంగా విషం పెట్టి హతమార్చింది. 

woman assassinated husband over love affair in uttar pradesh
Author
First Published Oct 6, 2022, 9:46 AM IST

ఉత్తర ప్రదేశ్ : ఆ యువతికి  రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి తర్వాత కూడా ఆమె ఎక్కువగా పుట్టింట్లోనే ఉండేది. తల్లి దండ్రులు బలవంతంగా పంపించినా ఏదో ఒక వంకతో పుట్టింటికి చేరిపోయేది.  భర్త వచ్చి బలవంతంగా తీసుకు వెళ్తే వెళ్ళేది. ఆ తరువాత కొద్ది రోజులకు మళ్లీ మామూలే. అలా 4 నెలల క్రితం భర్తకు విషం పెట్టి చంపేసి పరారైపోయింది. చివరికి పోలీసులకు దొరికిపోయి షాకింగ్ విషయాలు బయట పెట్టింది..  ఉత్తర ప్రదేశ్ లోని బిజ్నోర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

బిజ్నోర్ కు చెందిన యశ్ పాల్(35) జూన్ 16న  అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి మెడపై, మొహంపై గాయాల గుర్తులు కనిపించాయి. ఇంట్లో ఉండాల్సిన అతడి భార్య కవిత ఆచూకీ ఎక్కడా దొరకలేదు. విషాహారం తిని మరణించాడని పోస్టుమార్టంలో తేలింది. అతడి భార్య కవితపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె కోసం నాలుగు నెలలపాటు గాలించిన పోలీసులు చివరికి ఆమెను పట్టుకున్నారు. ఆమెతో పాటు ఆమె ప్రియుడిని కూడా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

దారుణం.. వివాహితను పబ్ కు తీసుకువెళ్లి, డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం.. వీడియో తీసి, బ్లాక్ మెయిల్ చేస్తూ...

విచారణలో ఆమె.. వివాహానికి ముందు నుంచే తనకు వినీత్ అనే వ్యక్తితో లవ్ ఎఫైర్ ఉందని, తన తల్లిదండ్రులు బలవంతంగా యశ్ పాల్ కు ఇచ్చి పెళ్లి చేశారని  కవిత చెప్పింది. తన ప్రేమ గురించి భర్తకు కూడా చెప్పానని,  తనను  వదిలేయమని  అడిగానని..  కానీ అతడు తన మాట వినడం లేదని చెప్పుకొచ్చింది. ఎన్నిసార్లు పుట్టింటికి వెళ్లిపోయినా.. బలవంతంగా తనను తిరిగి తీసుకు వెళ్ళేవాడిని అందుకే అతడి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. ప్రియుడితో కలిసి భర్తను చంపేశానని కవిత పోలీసుల ఎదుట అంగీకరించింది. 

ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్ లోనే స్నేహం ముసుగులో వివాహితపై అత్యాచారం చేసి, బ్లాక్ మెయిల్ కు పాల్పడుతూ, డబ్బులు గుంజుతున్న ఓ బిజినెస్ మ్యాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెడితే.. అతనో వ్యాపారవేత్త. బాగా డబ్బున్న ఓ వివాహిత తో స్నేహం చేశాడు. తరచుగా ఆమెతో కలిసి పార్టీలకు  వెళ్లేవాడు. అలాగే 6 నెలల క్రితం ఆమెను ఓ పార్టీకి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమె తాగే డ్రింక్ లో మత్తు పదార్థాలు కలిపాడు. ఆ తర్వాత ఆమెను ఓ గదిలోకి తీసుకు వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 

ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీశాడు. అంతటితో ఆగకుండా.. ఆ వీడియో చూపించి బెదిరింపులకు పాల్పడడం మొదలుపెట్టాడు. అలా ఆమె నుంచి ఏకంగా రూ.80 లక్షలు లాగేసాడు. అయినా, అతని ఆశ తీరలేదు. ఇంకా ఇంకా డబ్బులు కావాలని వేధింపులు ఎక్కువ చేశాడు. దీంతో అతడి ఆగడాలను భరించలేక పోయిన మహిళా ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన ప్రశాంత్ కుమార్ సింగ్ లక్నోకు చెందిన ఓ వివాహితతో పరిచయం పెంచుకున్నాడు. 

ధనవంతుల కుటుంబానికి చెందిన ఆ మహిళతో స్నేహం చేశాడు. మంచివాడగా నమ్మించాడు. దీంతో ఆమె అతనితో కలిసి పార్టీలకు వెళ్లేది. ఆరు నెలల క్రితం ఆమెను ఓ పబ్ కి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమె తాగే డ్రింక్ లో  డ్రగ్స్ కలిపాడు. మగతలో ఉన్న ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీసి బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. తనకు అవసరమైనప్పుడల్లా డబ్బులు అడిగి తీసుకునే వాడు. అంతే కాదు ఆమెను బెదిరించి పలుసార్లు అత్యాచారం చేశాడు. అలా ఆమె నుంచి దఫదఫాలుగా రూ.80 లక్షలు కాజేశాడు.  

అయినా ఆ డబ్బుతో ప్రశాంత్ సంతృప్తి చెందలేదు. జిమ్  ప్రారంభిస్తున్నానని చెప్పి మరింత డబ్బు అడిగాడు. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios