తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు.

ఈ సందర్భంగా తెలంగాణ కళలకు అవమానంపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. తొమ్మిది నెలల నుంచి తెలంగాణ వారికి హాల్ ఇవ్వకపోవడంపై పాశం ఆగ్రహం వ్యక్తం చేశారు. బండారు దత్తాత్రేయ తెలంగాణ కు చెందిన వ్యక్తి కావడంతో ఆంధ్ర కు సంబంధించిన కిన్నెర ఆర్ట్స్ సంస్థ కనీసం దత్తాత్రేయ ఫోటో వాడకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

రవీంద్ర భారతి నిత్యం ఆంధ్ర వాళ్లకు కేటాయిస్తున్నారని యాదగిరి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇక్కడి సంస్థలకు కళాకారులకు  ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన ధ్వజమెత్తారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు యాదగిరిని అడ్డుకుని సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.  

Also Read:

హాజీపూర్ కేసు: జడ్జి ప్రశ్నలకు నోరు మెదపని శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణను తాకిన రాజధాని సెగ: ఆదిలాబాద్‌లో అసెంబ్లీ సమావేశాలకు డిమాండ్

సమత కేసు: 'ఊహాజనిత ఆధారాలతో చార్ఝీషీట్ దాఖలు'