Asianet News TeluguAsianet News Telugu

హాజీపూర్ కేసు: జడ్జి ప్రశ్నలకు నోరు మెదపని శ్రీనివాస్ రెడ్డి

మాజీపూర్ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణను గురువారం నాడు పూర్తి చేసింది. 

Nalgonda Fast Track Court Complets Trial on Hajipur case
Author
Nalgonda, First Published Dec 19, 2019, 2:31 PM IST

నల్గొండ: హాజీపూర్‌లో ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసు విచారణను  నల్గొండ పాస్ట్‌ట్రాక్ కోర్టు గురువారం నాడు పూర్తి చేసింది. త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన తీర్పును కోర్టు వెల్లడించే అవకాశం ఉంది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత  ఈ గ్రామానికి చెందిన బాధిత  కుటుంబాలు  ఇటీవలనే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. 

Also read:కారణమిదే:గవర్నర్‌తో హాజీపూర్ బాధిత కుటుంబాల భేటీ

 ఈ ఏడాది ఏప్రిల్ మాసం చివరలో  హాజీపూర్‌లో మర్రి శ్రీనివాస్ రెడ్డి మైనర్ బాలికలపై అత్యాచారం చేసి  హత్య  చేసిన విషయం వెలుగు చూసింది. ఒక్క కేసు విచారణ చేస్తున్న సమయంలో ఇదే గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలను  హత్య చేసిన విషయాన్ని శ్రీనివాస్ రెడ్డి ఒప్పుకొన్నట్టుగా పోలీసులు ప్రకటించారు. ఈ మూడు హత్యలతో పాటు కర్నూల్ జిల్లాలో కూడ ఓ హత్య కేసులో శ్రీనివాస్ రెడ్డి నిందితుడని అప్పట్లోనే రాచకొండ సీపీ మహేష్ భగవత్ ప్రకటించారు.

ఈ కేసుకు సంబంధించిన నల్గొండ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు రెండు మాసాల పాటు విచారణ చేసింది. 300 సాక్షులను పాస్ట్ ట్రాక్ కోర్టు విచారించింది. పోరెన్సిక్ రిపోర్ట్‌తో పాటు  కీలక సాక్ష్యాలను కూడ పోలీసులు కోర్టకు సమర్పించారు. 

ఇవాళ్టితో కోర్టు విచారణ పూర్తి కానుంది.. చివరి రోజున ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని కోర్టుకు తన వాదనను విన్పించే అవకాశాన్ని కోర్టు కల్పించింది. రెండు మూడు రోజుల్లో ఇరువైపులా న్యాయవాదుల వాదనలను కోర్టు వింటుంది.  313 సెక్షన్ కింద నిందితుడికి తన వాదనను విన్పించే  అవకాశాన్ని  కోర్టు కల్పించింది. ఈ వారం రోజుల్లో  ఈ కేసులో తుది తీర్పు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 

యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం హజీపూర్ హత్యల కేస్ విచారణ సందర్భంగా  నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని గురువారం నాడు పోలీసులు జిల్లా జైలు నుండి భారీ బందోబస్తు మధ్య కోర్టుకు తీసుకువచ్చారు.

ఈ కేసులో 44 మంది సాక్షులను జడ్జి ముందు ఉంచారు పోలీసులు.  వారానికి 5 రోజులు చొప్పున ఇప్పటిదాకా 22 సార్లు ట్రయల్స్ చేసింది కోర్టు.  ఫాస్ట్ ట్రాక్ కోర్టు కంటే వేగంగా ఈ కేసు విచారణ  జరిగింది. 

ఈ రోజు 313 కింద జడ్జి ఈ కేసు విషయంలో నిందితుడిని జడ్జి ప్రశ్నించాడు. సాక్షులు చెప్పిన విషయమై నిందితుడిని జడ్జి పలు ప్రశ్నలు వేశారు. కానీ, ఏ ప్రశ్నకు కూడ శ్రీనివాస్ రెడ్డి సమాధానం చెప్పలేదు. ఈ కేసు విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.

ఈ కేసు విచారణ అధికారిగా భువనగిరి డీసీపీ భుజంగరావును నియమించారు రాచకొండ సీపీ మహేష్ భగవత్.  ఈ కేసులో స్పెసల్ పీపీగా ప్రభుత్వం రంగారెడ్డి కోర్టు పీపీ సామల రంగారెడ్డిని నియమించింది. 

ఈ ఏడాది అక్టోబర్ 29వ తేదీన కోర్టులో విచారణ ప్రారంభమైంది. నిందితుడు శ్రీనివాస్ రెడ్డి పై 376/3,366,376/a,302,201సెక్షన్ల కింద నమోదయ్యాయి. 
ఈ నెల చివరి లోపు పూర్తి కానుంది విచారణ. ఈ శిక్ష కూడా ఈ నెల చివరి లోపు పూర్తి ఖరారు అవుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios