ఆదిలాబాద్‌: ఆసిఫాబాద్ జిల్లాలోని రామ్‌నాయక్ తండా సమీపంలో ఆదీవాసీ మహిళపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన నిందితులను గురువారం నాడు పోలీసులు ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. నిందితుల తరపున రహీం అనే అడ్వకేట్ వాదించారు.

Also read:సమత గ్యాంగ్ రేప్, హత్య: 44 మంది సాక్షుల విచారణ, ఛార్జీషీట్ ఇదీ...

ఆసిఫాబాద్ జిల్లాలోని రామ్‌నాయక్ తండా సమీపంలో సమత అనే ఆదీవాసీ మహిళపై  ముగ్గురు నిందితులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన గత నెల 24వ తేదీన జరిగింది.

Also read:సమతపై గ్యాంగ్ రేప్: నిందితుల తరపున వాదించేందుకు ముందుకురాని లాయర్లు

నిందితుల తరపున వాదించేందుకు లాయర్లు ఎవరు కూడ ముందుకు రాలేదు. దీంతో నిందితుల తరపున వాదించేందుకు కోర్టు రహీం అనే అడ్వకేట్ నియమించింది. 

 వరుసగా నాలుగో రోజున  నిందితుల విచారణను ప్రత్యేక కోర్టు నిర్వహిస్తోంది. గురువారం నాడు నిందితుల తరపున డిస్‌చార్జీ పిటిషన్ దాఖలు చేశారు.ఊహాజనితమైన ఆధారాలతో చార్జీషీట్ దాఖలు చేశారని లాయర్ రహీం చెప్పారు. 

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత  సమతపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ ఆందోళన తర్వాత పోలీసులు ప్రత్యేక కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు.