ఏపీకి మూడు రాజధానుల అంశం తెలంగాణను తాకింది. ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ఎంపీ సోయం బాపురావు డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్: ఏపీకి మూడు రాజధానుల ప్రకటన తెలంగాణను తాకింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఏడాదిలో రెండు సార్లు నిర్వహించాలని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు డిమాండ్ చేశారు.
Also read:అమరావతిలో ఉద్రిక్తత: 'తెలంగాణ తరహాలో ఉద్యమం, చంపిన తర్వాతే మార్చండి'
ఏపీ రాష్ట్రానికి మూడు రాజదానులు ఉండే అవకాశం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండు రోజుల క్రితం అసెంబ్లీ ప్రకటించారు. నిపుణుల కమిటీ తర్వాత నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ ప్రకటనపై రాజధాని ప్రాంత రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు ఈ ప్రకటనపై తెలంగాణను కూడ తాకింది.తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 300 కి.మీ దూరంలో ఉందని ఎంపీ బాపూరావు గుర్తు చేశారు.
దీన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను ఏడాదికి రెండు సార్లు ఆదిలాబాద్‌లో నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ విషయాన్ని తాను తెలంగాణ .సీఎం కేసీఆర్ దృష్టికి కూడ తీసుకెళ్లినట్టుగా ఆయన చెప్పారు. ఇదే విషయమై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కూడ కలిసి విన్నవించనున్నట్టుగా ఆయన చెప్పారు.
తమ డిమాండ్‌లో న్యాయం ఉందని బాపూరావు చెప్పారు. ఈ విషయాన్ని పరిశీలించాలని ఆయన సీఎం కేసీఆర్‌ను కోరారు.
